మాదిగలను మోసం చేస్తున్న ప్రభుత్వాలు
హన్మకొండ : బీజేపీ, టీఆర్ఎస్ మాదిగలను మోసం చేస్తున్నాయని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి విమర్శించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశా ల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని డి మాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్(టీఎస్) ఆధ్వర్యంలో హన్మకొండలోని ఏకశిలపార్కు వ ద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం మూడో రోజుకు చేరాయి.
దీక్షలకు నాయిని సంఘీబావం తెలిపి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పిన రెండు పార్టీలు అధికారంలోకి రాగా నే మాట తప్పాయని ధ్వజమెత్తారు. ఎ మ్మార్పీఎస్ (టీఎస్)చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు. ఎమ్మార్పీఎస్(టీఎస్) జిల్లా ఇంచార్జి మేకల నరేం దర్ మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం వర్గీకరణపై తన వైఖరి స్పష్టం చేయాలని డిమాం డ్ చేశారు. దీక్షలో ఎమ్మార్పీఎస్ (టీఎస్) జిల్లా అధ్యక్షుడు సిలువేరు సాంబయ్య, యువసేన జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి విజ య్, నాయకులు వినయ్, ప్రవీణ్, మధు, ప్రశాంత్, యోబు, దాలీ, అరుణ్, నరేం ద ర్, రాజేష్, ప్రత్యూష్, టోనీ, పవన్, మా ర్క్ రవి, యోహాన్ కూర్చున్నారు. దీక్షలకు ఆప్ జిల్లా కన్వీనర్ దాడబోయిన శ్రీ కాంత్, ఎమ్మార్పీఎస్(టీఎస్) నాయకులు మాదాసి రాంబాబు, పి.సంజీవ, ఎం.బాబురావు, డాక్టర్ రామకృష్ణ, అనిల్‌కుమార్, రాజేష్‌ఖన్నా, కిశోర్, బాబు, సారంగపాణి సంఘీభావం తెలిపారు.