వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలిగా ఉప్పులేటి కల్పన
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ సీపీ కేంద్రపాలకమండలి సభ్యురాలి (సీజీసీ)గా పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన నియమితులయ్యూరు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆమెను ఈ పదవికి ఎంపికచేసి మంగళవారం ప్రకటించారు. ఇప్పటికే పార్టీ శాసనసభ డెప్యూటీ ఫ్లోర్‌లీడర్‌గా, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా
ఆమె కొనసాగుతున్నారు.
ఈక్రమంలో కేంద్రపాలక మండలి సభ్యురాలిగా నియమితులయ్యూరు. పార్టీలో ఉప్పులేటి కల్పన క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. పామర్రు నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేసిన ఆమె ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. కల్పనకు ఈ పదవికి రావటంపై జిల్లాలోని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారుు.