Government awards
-
ఆరుగురు అధికారులకు అవార్డులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పథకాలతో పాటు వివిధ కార్యక్రమాల అమలులో విశేష సేవలందించిన ఆరుగురు అఖిల భారత సర్వీస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు అందించనుంది. ఇద్దరు ఐఏఎస్ అధికారులు, ఇద్దరు ఐపీఎస్‌లు, ఇద్దరు ఐఎఫ్ఎస్లను ఈ అవార్డులకు ఎంపిక చేశారు. ఈ జాబితాకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ శశాంక్, కౌంటర్ ఇంటెలిజెన్స్ డీఐజీ రాజేశ్‌కుమార్, హైదరాబాద్ సిటీ క్రైం అదనపు కమిషనర్ స్వాతి లక్రా, ఐఎఫ్ఎస్ అధికారులు ఆర్.శోభ, స్వర్గం శ్రీనివాస్ ఈ అవార్డులకు ఎంపికయ్యారు. తొలిసారిగా ఇద్దరు ఐఎఫ్ఎస్లను రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డులకు ఎంపిక చేయటం గమనార్హం. రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ చేతుల మీదుగా వీరికి నగదు పురస్కారం, ప్రశంసా పత్రాలు అందజేస్తారు. -
కుందేళ్లను గెంతనిస్తే అవార్డు!
జంతువులకు మనసుంటుంది. ఆ విషయం మనుషులకు తెలుసు. కానీ వాటి సహజ స్వభావాన్ని మరుగు పరచేలా.. దయలేకుండా వ్యవహరించటం పారిశ్రామిక వ్యవసాయ పద్ధతిలో చూసేదే. కానీ దానికి భిన్నంగా జైళ్లలో ఖైదీల్లా కిక్కిరిసిన ఇనుప పంజరాల్లో(కేజ్‌లలో) పెంచుతున్న కుందేళ్లకు సాంత్వన చేకూర్చేలా ఐరోపా దేశాల కూటమి తీసుకుంటున్న చర్యలు ఆనందాన్ని కలిగిస్తాయి. కుందేళ్ల పెంపకంలో మెరుగైన ప్రమాణాలు పాటించే వారికి ఈ ఏడాది నుంచి అవార్డ్లు ఇవ్వనున్నట్టు ఐరోపా దేశాల కూటమి ప్రకటించింది. కేజ్‌ల్లో పెంచుతున్న కుందేళ్ల సంక్షేమానికి కృషిచేసే సంస్థలకు ఈ అవార్డ్ ఇస్తారు. ఐరోపాలో మాంసం కోసం పెంచుతున్న జంతువుల సంఖ్యలో కుందేళ్లది రెండో స్థానం. ప్రతి సంవత్సరం 12 లక్షల కుందేళ్లను ఆ దేశాల్లో మాంసం కోసం పెంచుతున్నారు. లెక్కకుమిక్కిలి ఉండే కుందేళ్లు కేజ్‌ల్లో కిక్కిరిసిన జీవితం గడుపుతాయి. తమ సహజ స్వభావానికి అనుగుణంగా చెంగు చెంగున ఉల్లాసంగా ఎగిరే అవకాశం లేదు. ఇంత జరుగుతున్నా వీటి బాగోగుల కోసం ఉద్ధేశించిన శాసనాలేవీ అమల్లో లేవు. కానీ కుందేళ్ల దాణాను తయారుచేసే కంపెనీలు వీటి జీవన పరిస్థితులు మెరుగుచేసేందుకు నడుం బిగిస్తున్నాయి. ఇటువంటి చర్యలకు ప్రభుత్వ అవార్డ్లు కుందేళ్ల సంక్షేమానికి మరింత ఉత్సాహంతో పనిచేసేందుకు స్ఫూర్తినిస్తుందంటున్నారు జంతు ప్రేమికులు.