ఆరుగురు అధికారులకు అవార్డులు  | all indian services officers get state government award | Sakshi
Sakshi News home page

ఆరుగురు అధికారులకు అవార్డులు 

Published Fri, Jan 26 2018 1:49 AM | Last Updated on Tue, Sep 4 2018 5:37 PM

all  indian services officers get state government award

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పథకాలతో పాటు వివిధ కార్యక్రమాల అమలులో విశేష సేవలందించిన ఆరుగురు అఖిల భారత సర్వీస్‌ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు అందించనుంది. ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు, ఇద్దరు ఐపీఎస్‌లు, ఇద్దరు ఐఎఫ్‌ఎస్‌లను ఈ అవార్డులకు ఎంపిక చేశారు. ఈ జాబితాకు సీఎం కేసీఆర్‌ ఆమోదం తెలిపారు. యాదాద్రి జిల్లా కలెక్టర్‌ అనితా రామచంద్రన్, కరీంనగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ శశాంక్, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ డీఐజీ రాజేశ్‌కుమార్, హైదరాబాద్‌ సిటీ క్రైం అదనపు కమిషనర్‌ స్వాతి లక్రా, ఐఎఫ్‌ఎస్‌ అధికారులు ఆర్‌.శోభ, స్వర్గం శ్రీనివాస్‌ ఈ అవార్డులకు ఎంపికయ్యారు. తొలిసారిగా ఇద్దరు ఐఎఫ్‌ఎస్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డులకు ఎంపిక చేయటం గమనార్హం. రిపబ్లిక్‌ డే వేడుకల్లో గవర్నర్‌ చేతుల మీదుగా వీరికి నగదు పురస్కారం, ప్రశంసా పత్రాలు అందజేస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement