ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ విఫలం: కాల్వ
సాక్షి, హైదరాబాద్: నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మెరుగైన పాత్ర పోషించడంలో వైఎస్సార్సీపీ విఫలమైందని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండేళ్ల పాలన కూడా పూర్తి చేసుకోని ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ప్రతిపక్షం.. స్పీకర్‌పైనా అదే నోటీసు ఇచ్చి తన అనాలోచిత నిర్ణయాన్ని బయట పెట్టుకుందన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు చట్టాలు, శాసనసభా వ్యవహారాలపై అవగాహన లేదని విమర్శించారు.