క్యాన్సర్ రోగులకు శుభవార్త
అనంతపురం సిటీ: క్యాన్సర్ వ్యాధి నిర్థారణ చేసుకోడానికి కూడా ఇంతకు ముందు బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. ఈ సమస్యను గుర్తించిన సర్వజనాస్పత్రి వైద్యులు ప్రత్యేకంగా కర్నూలు జిల్లాకు చెందిన క్యాన్సర్ స్పెషలీస్ట్ సత్యనారాయణను అనంతపురం సర్వజనాస్పత్రిలో సేవలందించేందుకు పిలిపించారు.
వారంలో ఒక రోజో లేక రెండు రోజులపాటు ఈ వ్యాధి గ్రస్తులకు సేవలందించేందుకు ప్రత్యేకంగా ఓపీని ఏర్పాటు చేయనున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ జగన్నాథ్ తెలిపారు.అనంత వాసులకు మరింత చేరువుగా సేవలందించాలన్నా లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.