యువకుడి వద్ద 3 కిలోల బంగారం!
గువహతి: అస్సాంలోని గువహతి రైల్వే స్టేషన్లో ఓ యువకుడి వద్ద భారీగా బంగారం పట్టుబడింది. రోజువారి తనిఖీలు నిర్వహిస్తున్న రైల్వే పోలీసులు 19 ఏళ్ల యువకుడి వద్ద 3 కిలోల బంగారాన్ని గుర్తించారు.
పట్టుబడిన యువకుడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎమ్డీ సాదిద్ కమాల్ అని పోలీసులు వెల్లడించారు. మూడు కిలోల బంగారాన్ని 14 బిస్కెట్ల రూపంలో.. సరాయ్‌ఘాట్ ఎక్స్‌ప్రెస్‌లో తరలిస్తూ సాదిద్ పట్టుబడ్డాడు. బంగారం విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. సాదిద్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు. ఎప్రిల్ 4న గువహతి రైల్వే పోలీసులు ఓ వ్యక్తి వద్ద నుంచి 4 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.