చీప్ లిక్కర్‌కు వ్యతిరేకంగా గౌడసంఘం ధర్నా
రామగుండం(కరీంనగర్ జిల్లా): తెలంగాణ ప్రభుత్వం తీసుకురానున్న చీప్ లిక్కర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గౌడ సంఘం నాయకులు ధర్నాకు దిగారు. ఈ సంఘటన ఆదివారం కరీంనగర్ జిల్లా రామగుండం మండలం బసంత్‌నగర్ పీఎస్ సమీపంలో జరిగింది. వివరాలు.. మండలంలోని కన్నాల, రామాపూర్ గ్రామాలకు చెందిన గౌడ సంఘం నాయకులు రాజీవ్ జాతీయ రహదారిపై బైఠాయించారు.
ఈ మేరకు చీప్‌లిక్కర్ ప్రవేశపెట్టాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చీప్ లిక్కర్ ప్రవేశపెట్టి మా పొట్టలు కొట్టొద్దని వారు వాపోయారు.