గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణపై నిరసనల వెల్లువ
కృష్ణా: గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణపై ఆదివారం కృష్ణా జిల్లాలో నిరసనల జ్వాల వెల్లువెత్తింది. ఈ నేపథ్యంలో నాలుగు రెవెన్యూ గ్రామాల్లో గ్రామ సభలను బహిష్కరించినట్టు తెలుస్తోంది.
బుద్ధవరం, దావోజీగూడెం, అజ్జంపూడి, ఒటుపల్లి పలు ప్రాంతాల రైతులు నిరసనకు దిగారు. గన్నవరం విమానశ్రయం విస్తరణ విషయంలో భూ సమీకరణను నిరసిస్తూ రైతులు సభలను బహిష్కరించారు.