హత్య కేసులో మనవడే నిందితుడు
రంగారెడ్డి(పరిగి): ఈనెల 16న పరిగి మండలం గడిసింగాపూర్ రెవెన్యూ పరిధిలో వెలుగుచూసిన రామచంద్రయ్య(70) అనే వృద్ధుడి హత్య కేసును పరిగి పోలీసులు రెండురోజుల్లో ఛేదించారు. సొంత మనవడే తన తాతను హత్యచేశాడని పోలీసులు బట్టబయలు చేశారు. రాంచంద్రయ్యను హత్య చేసే అవసరం ఎవరికుందనే కోణంలో ఆరాతీశారు.
ఇటీవల పలుసార్లు ఆయన తన మనవడు ఆంజనేయులతో గొడవపడ్డాడని తెలుసుకున్నారు. దీంతో ఆంజనేయులును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ జరుపగా హత్యానేరం అంగీకరించాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి శనివారం రిమాండుకు తరలించారు.