గిజా పిరమిడ్ రహస్యం ఇదే..!
ఈజిఫ్ట్ పిరమిడ్లకు ప్రపంచవ్యాప్త ప్రాముఖ్యత ఉంది. అందులోనూ గిజా పరిమిడ్ రహస్యాలను కనుక్కోవాలని.. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా గిజా పిరిమడ్ లోపల నిర్మాణం ఎలా ఉంది? అనే విషయంపై సైంటిస్టులకు అనేక అనుమానాలు ఉన్నాయి.
తాజాగా ఈ గిజా పిరిమడ్పై తాజాగా కొందరు ఔత్సాహిక పరిశోధకులు పరిశోధనలు చేశారు. అందులో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చేశాయి. పిరిమిడ్లోని గ్రాండ్ గాలరీ నుంచి 30 మీటర్ల లోతు వరకూ సైంటిస్టులు ‘కాస్మిక్ రే ఇమేజింగ్’ టెక్నాలజీ సాయంతో సైంటిస్టులు పరిశోధనలు చేశారు. గ్రేట్ పిరమిడ్లో లోపల రహస్యంగా ఉన్న సొరంగాలు, వంకీ ఆకారంలో ఉన్న నిర్మాణాలను, ఇతర కీలక అంశాలను సైంటిస్టులు దీని ద్వారా గుర్తించారు.
ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా గుర్తింపు పొందిన గ్రేట్ పిరమిడ్ ఆఫ్ ఈజిఫ్ట్ నిర్మాణం ఎలా చేశారన్న అంశంపై ఇప్పటివరకూ సైంటిస్టులు ఒక అంచనాకు రాలేకపోతున్నారు. దీనిని క్రీస్తుపూర్వం 2550లో ఫారో రాజులు నిర్మించారు.
తాజాగా సైంటిస్టులు కాస్మిక్ టెక్నాలజీతో చేసిన పరిశోధన వల్ల పిరమిడ్ నిర్మాణం గురించి తెలుసుకోవడంలో పురోగతి సాధించారు. అప్పట్లోనే ఆధునిక భౌతిక శాస్త్రాన్నినిర్మాణశాస్త్రంలో వినియోగించడంపై సైంటిస్టులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గిజా పిరమిడ్ లోపల ఇప్పుడు అనుకుంటున్నట్లుగా.. కాకుండా మరో గ్రాండ్ గాలరీతో పాటు, విభిన్న ఆకృతులతో కూడిన నిర్మాణాలు ఉన్నట్లు తెలిసింది.