ఆ పిరమిడ్‌ను సరిగ్గా కట్టలేదట!!
బోస్టన్: పురాతన అద్భుతాల్లో ఒక్కటైన ‘గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా’ను సరిగ్గా కట్టలేదట! పిరమిడ్ పునాదిలో కొలతలు సరిగ్గా లేవని శాస్త్రవేత్తలు గుర్తించారు. గిజా పిరమిడ్ కాంప్లెక్స్‌లోని పెద్ద పిరమిడ్‌పై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు.. తూర్పు కంటే పశ్చిమం వైపు 5.55 అంగుళాలు పొడవు ఎక్కువ ఉన్నట్లు గుర్తించారు. వ్యత్యాసం కొద్ది అంగుళాలే అయినప్పటికీ.. దాన్ని శాస్త్రవేత్తలు గుర్తించగలిగారు.
పిరమిడ్‌ను కచ్చితమైన చతురస్రాకారంలో నిర్మించలేదని పేర్కొన్నారు. పిరమిడ్ ఉపరితలాన్ని తెల్లని, గట్టి రాళ్లతో నిర్మించారు.అయితే అందులోని రాళ్లు చాలా వరకు ఇప్పుడు లేవు. దీంతో శాస్త్రవేత్తలకు పిరమిడ్‌కు సంబంధించిన కచ్చితమైన కొలతలు తెలుసుకోవడం కష్టమైంది.