గ్రీన్ టమాటాల గురించి విన్నారా? ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలంటే..!
గ్రీన్ టమాటాలో విటమిన్ ఏ, తోపాటు పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో ఉండే బీటా కెరాటిన్ కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉండేలా చేస్తుంది. రోజూ ఒక పచ్చి టమాటా తినడం వల్ల కంటి సంబంధిత సమస్యలు తగ్గుతాయి. సహజంగా అందరికీ ఎర్రగా ఉండే టమాటానే కూరల్లోనూ, పచ్చడిలోనూ వినయోగిస్తారు. చాలామంది టమాటా లేకుండానే కూరే చెయ్యరు కూడా. అయితే అందరికీ ఎర్రటి టమాటా తెలిసినంతగా పచ్చి టమాటా గురించి పెద్దగా తెలియదు. అంతేగాదు గ్రీన్ కలర్లో టమాటా ఒకటి ఉంటుందని కూడా తెలియదు. ఇక్కడ గ్రీన్ టమాటాలంటే..పండని పచ్చిగా ఉన్న టమాటాలనే గ్రీన్ టమాటాలని అంటారు. పండిన టమాటాల కంటే పచ్చి టమాటాలోనే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. దీనన్ని రోజువారీ డైట్ భాగం చేసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో చూద్దాం..!.గ్రీన్ టమాటాలో ఉండే విటమిన్లు ఖనిజాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే బీటా కెరాటిన్ కంటి ఆరోగ్యం మెరుగుపడేలా చేస్తుంది. రోజూ ఒక పచ్చి టమాటా తినడం వల్ల కంటి సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫెక్షన్లను దూరం చేయడంతో పాటు కేన్సర్ పెరిగే కణాలను కూడ నిరోధిస్తుంది. పచ్చి టమాటాతో రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. ఇందులో ఉండే విటమిన్స్ రోగనిరోధకశక్తిని పెంచుతాయి. గ్రీన్ టమాటాలో టొమాటిన్ అనే కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, కార్డియో ప్రొటెక్టివ్, యాంటీ బయాటిక్ గుణాలను కలిగి ఉంటుంది. దీనివల్ల శరీరానికి పోషకాల శోషణను పెరగడమే గాక వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ గ్రీన్ టమాటాను పచ్చిగా తినకూడదు. వండుకుని మాత్రమే తినాలి. ఎందుకంటే ఇందులో ఉండే సొలనిన్ ఒక్కోసారి విషపూరితం కావచ్చు. అందువల్ల వీటిని ఉడికించి లేదా వండుకుని మాత్రమే తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.పచ్చి టమాటాలో ఉండే ఫైబర్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే వాపు, కొలెస్ట్రాల్, శరీర బరువును తగ్గించడంలో సాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగ్గా ఉంచి, మలబద్దకాన్ని నివారిస్తుంది. వీటిని తినడం వల్ల ముఖంపై ముడతలు పోయి యవ్వనంగా కనిపిస్తారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధుల భారీ నుంచిరక్షణ ఇస్తుంది. ఇందులో ఉండే ఫాస్ఫరస్ ఎసిడిటీ సమస్యను తగ్గిస్తుంది. మధుమేహం ఉన్నవాళ్లకు గ్రీన్ టమాటా బాగా ఉపయోగపడుతుంది. ఈ టమాటాతో ఎముకలు బలంగా పెరుగుతాయి. బోలు ఎముకల వ్యాధి నుంచి విముక్తి పొందాలంటే రోజూవారి డైట్లో ఈ గ్రీన్ టమాటాలను చేర్చుకోవడం మంచిది. దీనిని కేవలం చర్మ ఆరోగ్యానికి మాత్రమే గాక శిరోజాల సంరక్షణలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. (చదవండి: దోమలు కొందరినే ఎక్కువగా కుడతాయి..ఎందుకో తెలుసా?)