Groundsman
-
ఆసియా కప్-2023 విజేతలు గ్రౌండ్స్‌మెన్, పిచ్ క్యూరేటర్స్
2023 ఆసియా కప్ టైటిల్‌ను టీమిండియా ఎగరేసుకుపోయింది. ఇవాళ (సెప్టెంబర్ 17) జరిగిన ఫైనల్లో భారత్.. శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో రికార్డు విజయం సాధించి, ఎనిమిదో సారి ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలగా.. టీమిండియా ఆడుతూ పాడుతూ 6.1 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్ కిషన్ (23), శుభ్‌మన్ గిల్ (27) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు మహ్మద్ సిరాజ్ (7-1-21-6), బుమ్రా (5-1-23-1), హార్దిక్ పాండ్యా (2.2-0-3-3) చెలరేగడంతో శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. లంక ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. కేవలం కుశాల్ మెండిస్ (17), దుషన్ హేమంత (13 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. 🏏🏟️ Big Shoutout to the Unsung Heroes of Cricket! 🙌 The Asian Cricket Council (ACC) and Sri Lanka Cricket (SLC) are proud to announce a well-deserved prize money of USD 50,000 for the dedicated curators and groundsmen at Colombo and Kandy. 🏆 Their unwavering commitment and… — Jay Shah (@JayShah) September 17, 2023 తెర వెనుక హీరోలకు గుర్తింపు.. 2023 ఆసియా కప్ విజయవంతం కావడంలో కొలొంబో, క్యాండీ మైదానాల సహాయ సిబ్బంది, పిచ్ క్యూరేటర్ల పాత్ర చాలా కీలకమైంది. వీరి కమిట్మెంట్ లేనిది ఆసియా కప్ అస్సలు సాధ్యపడేది కాదు. కీలక మ్యాచ్‌లు జరిగిన సందర్భాల్లో వర్షాలు తీవ్ర ఆటంకాలు కలిగించగా.. క్యూరేటర్లు, గ్రౌండ్స్‌మెన్ ఎంతో అంకితభావంతో పని చేసి మ్యాచ్‌లు సాధ్యపడేలా చేశారు. ముఖ్యంగా ఈ టోర్నీలో గ్రౌండ్స్‌మెన్ సేవలు వెలకట్టలేనివి. Join us in appreciating the Sri Lanka groundsmen 👏👏 pic.twitter.com/0S7jpERgxj — CricTracker (@Cricketracker) September 17, 2023 వారు ఎంతో అప్రమత్తంగా ఉండి, వర్షం పడిన ప్రతిసారి కవర్స్‌తో మైదానం మొత్తాన్ని కప్పేశారు. స్థానికమైన ఎన్నో టెక్నిక్స్‌ను ఉపయోగించి, వీరు మైదానాన్ని ఆర బెట్టిన తీరు అమోఘమని చెప్పాలి. వీరి పనితనానికి దేశాలకతీతంగా క్రికెట్ అభిమానులు ముగ్దులైపోయారు. ఆసియా కప్-2023 నిజమైన విజేతలు గ్రౌండ్స్‌మెన్, పిచ్ క్యూరేటర్స్ అని సోషల్‌మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అంతిమంగా వీరి కష్టానికి తగిన గుర్తింపు దక్కింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ), శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ).. కొలొంబో, క్యాండీ మైదానాల గ్రౌండ్స్‌మెన్, క్యూరేటర్లకు 50,000 యూఎస్ డాలర్ల ప్రైజ్‌మనీని ప్రకటించారు. వారి కమిట్మెంట్, హార్డ్వర్క్లకు ఇది గుర్తింపు అని ఏసీసీ చైర్మన్ జై షా అన్నారు. వీరు లేనిది ఆసియా కప్-2023 సాధ్యపడేది కాదని షా ప్రశంసించారు. కాగా, ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మహ్మద్ సిరాజ్ తనకు లభించిన ప్రైజ్‌మనీ మొత్తాన్ని గ్రౌండ్స్‌మెన్‌కు ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నాడు. -
గ్రౌండ్స్‌మెన్‌కు ధోని గిఫ్ట్..!!
పుణె : రెండేళ్ల తర్వాత ఐపీఎల్లో పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మరోసారి సత్తాచాటుతూ ప్లేఆఫ్‌కు చేరింది . ఆదివారం పుణెలో కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన అనంతరం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన చెన్నై క్వాలిఫయర్-1కు అర్హత సాధించింది. అయితే మ్యాచ్ తర్వాత మిస్టర్ కూల్ కెప్టెన్ ధోని గ్రౌండ్స్‌మెన్‌కు గిఫ్ట్‌లు ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. తమ జట్టు తరపున మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) గ్రౌండ్స్‌మెన్ ఒక్కొక్కరికి 20 వేల రూపాయల చొప్పున కానుక అందజేశారు. అంతేకాదు ఐపీఎల్ ఆరంభంలో వారితో దిగిన ఫొటోలను ఫ్రేమ్ కట్టించి బహుమతిగా అందించారు. తమకు ధోని బహుమతులు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని గ్రౌండ్స్‌మెన్ ఆనందం వ్యక్తం చేశారు. కావేరీ జలాల గురించి తమిళనాడులో ఆగ్రహ జ్వాలలు పెల్లుబికిన నేపథ్యంలో.. చెన్నైలో జరగాల్సిన సీఎస్కే మ్యాచ్‌లను పుణేకి తరలించారు. హోం గ్రౌండ్ మారడంతో సీఎస్కే అభిమానులతో పాటు ఆటగాళ్లు కూడా ఒత్తిడికి లోనయ్యారు. అయితే సీఎస్కే తరపున ఆతిథ్యమిచ్చిన ఎంసీఏ సీఎస్కే ఆటగాళ్లకు సొంత మైదానంలో ఆడుతున్న అనుభూతి కలిగించేందుకు పిచ్ రూపకల్పనలో జాగ్రత్త వహించింది. దీంతో ఇక్కడ జరిగిన 5 మ్యాచుల్లో నాలుగింటిలో సీఎస్కే గెలుపొందింది. ఈ విషయంలో గ్రౌండ్స్‌మెన్ కీలక పాత్ర పోషించారన్న సీఎస్కే యాజమాన్య ప్రతినిధి.. వారికి ఏదైనా బహుమతి ఇవ్వాలనుకున్నామని.. అందుకే ధోని చేత బహుతులు అందజేసామని తెలిపారు. కాగా ఈ సీజన్లో సీఎస్కే ఒకే ఒక మ్యాచ్ చెన్నైలో ఆడింది. చెపాక్ స్టేడియంలో కేకేఆర్‌తో జరిగిన అనంతరం సీఎస్కే ఆతిథ్య మ్యాచ్లన్నీపుణెలోనే జరిగాయి. -
గ్రౌండ్స్‌మెన్‌గా మారిన ముంబై ఆటగాళ్లు
న్యూఢిల్లీ: మైదానంలో పరుగుల వరద పారించడమే కాకుండా అవసరమైతే అదే మైదానాన్ని శుభ్రపరిచేందుకు కూడా వెనుకాడమని ముంబై రంజీ ఆటగాళ్లు నిరూపించారు. రైల్వేస్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్ సందర్భంగా రెండో రోజు ఆట కోసం సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని ముంబై ఆటగాళ్లు కర్నైల్ సింగ్ గ్రౌండ్‌కు వచ్చారు. తొలి రోజు ఆదివారం వర్షం కారణంగా కేవలం 8.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. సోమవారం కూడా అక్కడ చాలా భాగం నీటితో నిండడం గమనించారు. దీనికి తోడు నీటిని తోడేసే సూపర్‌సాపర్ పనిచేయడం లేదు. నలుగురు గ్రౌండ్స్‌మెన్ మాత్రమే పనిచేసేందుకు ఉన్నారు. ఎలాగైనా మ్యాచ్‌ను కొనసాగించాలనే లక్ష్యంతో ఇక ఆటగాళ్లే రంగంలోకి దిగారు. ఎస్కే యాదవ్, అభిషేక్ నాయర్ మరో ఏడుగురు ఆటగాళ్లు షూస్ లేకుండా ఓ చేతిలో స్పాంజి, మరో చేతిలో బకెట్‌తో నీటిని తోడడం ప్రారంభించారు. 35 నిమిషాల సేపు అలుపెరగకుండా మైదానాన్ని తడి లేకుండా చేసేందుకు వీరంతా కష్టపడ్డారు. మీడియా ఫొటోలు తీస్తుండడంతో... రైల్వేస్ క్యురేటర్ సంజీవ్ అగర్వాల్ ముంబై కోచ్ ప్రవీణ్ ఆమ్రే వద్దకు వెళ్లారు. స్టాఫ్‌ను పెంచుతామని, ఆటగాళ్లను వెనక్కి రప్పించాల్సిందిగా కోరారు. అయితే తమ ఆటగాళ్లు మ్యాచ్ ప్రారంభం కావాలనే ఉద్దేశంతోనే ఆ పనిచేశారని, ఇక్కడ సదుపాయాలు మెరుగ్గా లేవని ఆమ్రే అన్నారు. మరోవైపు గత రెండేళ్లుగా ఇక్కడ మ్యాచ్‌లు జరుగలేవని, అందుకే సూపర్‌సాపర్ అవసరం తమకు రాలేదని ఆర్ఎస్పీబీ చీఫ్ రేఖా యాదవ్ అన్నారు.