చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని (ఫైల్ ఫొటో)
పుణె : రెండేళ్ల తర్వాత ఐపీఎల్‌లో పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మరోసారి సత్తాచాటుతూ ప్లేఆఫ్‌కు చేరింది . ఆదివారం పుణెలో కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన అనంతరం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన చెన్నై క్వాలిఫయర్-1కు అర్హత సాధించింది. అయితే మ్యాచ్ తర్వాత మిస్టర్ కూల్ కెప్టెన్ ధోని గ్రౌండ్స్‌మెన్‌కు గిఫ్ట్‌లు ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. తమ జట్టు తరపున మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) గ్రౌండ్స్‌మెన్ ఒక్కొక్కరికి 20 వేల రూపాయల చొప్పున కానుక అందజేశారు. అంతేకాదు ఐపీఎల్ ఆరంభంలో వారితో దిగిన ఫొటోలను ఫ్రేమ్ కట్టించి బహుమతిగా అందించారు. తమకు ధోని బహుమతులు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని గ్రౌండ్స్‌మెన్ ఆనందం వ్యక్తం చేశారు.
కావేరీ జలాల గురించి తమిళనాడులో ఆగ్రహ జ్వాలలు పెల్లుబికిన నేపథ్యంలో.. చెన్నైలో జరగాల్సిన సీఎస్‌కే మ్యాచ్‌లను పుణేకి తరలించారు. హోం గ్రౌండ్ మారడంతో సీఎస్‌కే అభిమానులతో పాటు ఆటగాళ్లు కూడా ఒత్తిడికి లోనయ్యారు. అయితే సీఎస్‌కే తరపున ఆతిథ్యమిచ్చిన ఎంసీఏ సీఎస్‌కే ఆటగాళ్లకు సొంత మైదానంలో ఆడుతున్న అనుభూతి కలిగించేందుకు పిచ్ రూపకల్పనలో జాగ్రత్త వహించింది. దీంతో ఇక్కడ జరిగిన 5 మ్యాచుల్లో నాలుగింటిలో సీఎస్‌కే గెలుపొందింది.
ఈ విషయంలో గ్రౌండ్స్‌మెన్ కీలక పాత్ర పోషించారన్న సీఎస్‌కే యాజమాన్య ప్రతినిధి.. వారికి ఏదైనా బహుమతి ఇవ్వాలనుకున్నామని.. అందుకే ధోని చేత బహుతులు అందజేసామని తెలిపారు. కాగా ఈ సీజన్‌లో సీఎస్‌కే ఒకే ఒక మ్యాచ్ చెన్నైలో ఆడింది. చెపాక్ స్టేడియంలో కేకేఆర్‌తో జరిగిన అనంతరం సీఎస్‌కే ఆతిథ్య మ్యాచ్‌లన్నీపుణెలోనే జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment