గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల
- 982 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరిన ఏపీపీఎస్సీ
- 11 నుంచి కమిషన్ వెబ్సైట్లో దరఖాస్తు నమూనాలు
- డిసెంబర్ 10 వరకు దరఖాస్తుల స్వీకరణ
- దరఖాస్తులు 25 వేలు దాటితే ఆఫ్‌లైన్‌లో పరీక్ష
- ఆ మేరకు ఫిబ్రవరి 26న స్క్రీనింగ్ పరీక్ష
- మే 20, 21న మెరుున్ పరీక్ష
- దరఖాస్తులు 25 వేలు దాటకుంటే నేరుగా మెరుున్ పరీక్షే
సాక్షి, అమరావతి: నిరుద్యోగులు వేరుుకళ్లతో ఎదురుచూస్తున్న గ్రూప్-2 నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదలైంది. మంగళవారం అర్థరాత్రి 34 కేటగిరీల్లో 982 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. వీటిలో 442 ఎగ్జిక్యూటివ్ పోస్టులు కాగా, 540 పోస్టులు నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు. దరఖాస్తు నమూనాలు ఈ నెల 11నుంచి కమిషన్ వెబ్సైట్ (ఠీఠీఠీ.ఞటఛి.్చఞ.జౌఠి.జీ)లో అందుబాటులో ఉంటారుు. ఆరోజు నుంచి డిసెంబర్ పదో తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అదేరోజు రాత్రి 11.59 గంటల వరకు ఫీజు చెల్లించేందుకు గడువు విధించారు. దరఖాస్తులు 25వేలు దాటితే ఆఫ్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తామని కమిషన్ నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. ఆ మేరకు ఫిబ్రవరి 26వ తేదీన ఈ స్క్రీనింగ్ పరీక్షను నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మే 20, 21 తేదీల్లో ఆన్లైన్లో మెరుున్ పరీక్ష నిర్వహిస్తారు. అరుుతే దరఖాస్తులు 25 వేలు దాటనట్లరుుతే స్క్రీనింగ్ పరీక్ష ఉండదు.
నేరుగా మెరుున్ పరీక్షను(మే 20, 21 తేదీల్లో) నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా దరఖాస్తు చేయాలనుకునేవారు ముందుగా కమిషన్ వెబ్సైట్లో ఓటీపీఆర్ (వన్‌టైమ్ ప్రొఫైల్ రిజిస్టేషన్ర్) చేసుకోవాలి. ఈ ఓటీపీఆర్ యూజర్‌నేమ్, పాస్వర్డ్ ద్వారానే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సివుంటుంది. పరీక్ష తేదీలకు వారం ముందు నుంచి హాల్ టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం జూలై ఒకటి నాటికి 42 సంవత్సరాలు దాటనివారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా పోస్టులను బట్టి విద్యార్హతలను నిర్ణరుుంచారు.దరఖాస్తుదారులు రూ.250 అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు, రూ.80 పరీక్ష ఫీజును ఆన్లైన్లో చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మాజీ సైనికోద్యోగులకు ఫీజు మినహారుుంపునిచ్చారు. స్క్రీనింగ్, మెరుున్ పరీక్షలను రాష్ట్రంలోని 13 జిల్లాలతోపాటు హైదరాబాద్‌లో నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్ష 150 మార్కులకు, మెరుున్ పరీక్ష 450 మార్కులకు నిర్వహిస్తారు.
పోస్టుల వివరాలు..
ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్ పోస్టులు 12, ఏసీటీఓ 96, గ్రేడ్-2 సబ్‌రిజిష్ట్రార్ 27, డిప్యూటీ తహశీల్దార్ 253, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 8, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ శాఖలో అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్లు 23, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు 8, ఎకై ్సజ్ ఎస్ఐ పోస్టులు 15 ఉన్నారుు. నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో సచివాలయం జీఏడీ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 67, ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు 16, న్యాయ శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు 18, అసెంబ్లీ సెక్షన్ ఆఫీసర్లు 23, స్టేట్ ఆడిట్ సబార్డినేట్ సర్వీస్‌లో సీనియర్ ఆడిటర్ పోస్టులు 45, ఖజానా శాఖలో(హెచ్ఓడీ) సీనియర్ అకౌంటెంట్లు 82, ఖజానా శాఖలో(డిస్ట్రిక్ట్ సబ్ సర్వీస్) సీనియర్ అకౌంటెంట్లు 158, ఖజానా శాఖలో జూనియర్ అకౌంటెంట్లు 39, గవర్నమెంట్ ఎగ్జామినేషన్సలో జూనియర్ అసిస్టెంట్లు 10, లేబర్ డిపార్టుమెంట్లో జూనియర్ అసిస్టెంట్లు 10, పీహెచ్ అండ్ ఎంఈ శాఖలో జూనియర్ అసిస్టెంట్లు 3, రవాణా శాఖలో జూనియర్ అసిస్టెంట్లు 6, జైళ్లశాఖలో జూనియర్ అసిస్టెంట్లు 3, స్త్రీ,శిశు సంక్షేమ శాఖలో జూనియర్ అసిస్టెంట్ 1, డ్రగ్స అండ్ కాపీరైట్స్ శాఖలో జూనియర్ అసిస్టెంట్లు 2, వ్యవసాయ శాఖలో జూనియర్ అసిసెంట్లు 10, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్‌లో జూనియర్ అసిస్టెంట్లు 2, ఎకై ్సజ్‌శాఖలో జూనియర్ అసిస్టెంటు 4, షుగర్‌కేన్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ 1, ఆర్ అండ్ బీలో జూనియర్ అసిస్టెంట్లు 14, సర్వే సెటిల్మెంట్లో జూనియర్ అసిస్టెంట్లు 4, పౌరసరఫరాల శాఖలో జూనియర్ అసిస్టెంట్లు 7, బీసీ సంక్షేమశాఖలో జూనియర్ అసిస్టెంట్లు 3, ఏసీబీలో జూనియర్ అసిస్టెంట్ 1, ఏపీ ఇన్సూరెన్సలో సీనియర్ అసిస్టెంట్ 1, ఏపీ జనరల్ లైఫ్ ఇన్సూరెన్సలో సీనియర్ అసిస్టెంట్లు 10 పోస్టులను భర్తీ చేయనున్నారు.