నిరుద్యోగులు వేరుుకళ్లతో ఎదురుచూస్తున్న గ్రూప్-2 నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదలైంది. మంగళవారం అర్థరాత్రి 34 కేటగిరీల్లో 982 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. వీటిలో 442 ఎగ్జిక్యూటివ్ పోస్టులు కాగా, 540 పోస్టులు నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు. దరఖాస్తు నమూనాలు ఈ నెల 11నుంచి కమిషన్ వెబ్‌సైట్ (ఠీఠీఠీ.ఞటఛి.్చఞ.జౌఠి.జీ)లో అందుబాటులో ఉంటారుు. ఆరోజు నుంచి డిసెంబర్ పదో తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అదేరోజు రాత్రి 11.59 గంటల వరకు ఫీజు చెల్లించేందుకు గడువు విధించారు. దరఖాస్తులు 25వేలు దాటితే ఆఫ్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తామని కమిషన్ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. ఆ మేరకు ఫిబ్రవరి 26వ తేదీన ఈ స్క్రీనింగ్ పరీక్షను నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మే 20, 21 తేదీల్లో ఆన్‌లైన్‌లో మెరుున్ పరీక్ష నిర్వహిస్తారు. అరుుతే దరఖాస్తులు 25 వేలు దాటనట్లరుుతే స్క్రీనింగ్ పరీక్ష ఉండదు.