Department of Justice
-
శివశంకర్ కృషితోనే న్యాయశాఖలో బడుగులకు ప్రాతినిధ్యం
గన్ ఫౌండ్రి: నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా స్వయంకృషితో పి.శివశంకర్ ఉన్నత స్థాయికి చేరుకున్నారని పలువురు ప్రముఖులు కొనియాడారు. అణగారిక వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి శివశంకర్ మరో అంబేడ్కర్ అని అభివర్ణించారు. గురువారం ఇక్కడి రవీంద్రభారతిలో ‘ఉత్తుంగ తరంగాలకు ఎదురీదిన ఓ విజేత జీవితావిష్కరణ’పేరిట కేంద్ర మాజీమంత్రి పి.శివశంకర్ ఆత్మకథ గ్రంథావిష్కరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌కుమార్ షిండే మాట్లాడుతూ న్యాయశాఖలో బడుగు, బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం కోసం అప్పట్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి పి.శివశంకర్ తీసుకున్న నిర్ణయాలు ఎన్నో మార్పులు తీసుకు వచ్చాయని గుర్తుచేశారు. నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తరఫున సుప్రీంకోర్టులో పలు కేసులలో న్యాయవాదిగా శివశంకర్ అద్భుతంగా వాదించి ఆమెపై వచ్చిన ఆరోపణలను కొట్టివేయించగలిగారని గుర్తుచేశారు. కర్ణాటక మాజీ సీఎం వీరప్ప మొయిలీ మాట్లాడుతూ కేంద్ర న్యాయ, మానవ వనరుల శాఖల మంత్రిగా ఆయన చేసిన సేవలు ఎనలేనివని కీర్తించారు. ఆయన ఆత్మకథ బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుందని అన్నారు. నిరుపేద బాల్యం నుంచి అనేక ఆటుపోట్లను అధిగమిస్తూ ఉన్నత లక్ష్యాన్ని చేరుకున్న శివశంకర్ విజయప్రస్థానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అన్నారు. ఆయనతో అప్పట్లో పనిచేసినటువంటి అనుభవాలు, జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాలగౌడ, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేతలు కేవీపీ రాంచందర్‌రావు, రఘువీరారెడ్డి, శివశంకర్ సతీమణి లక్ష్మి, కుమారుడు డాక్టర్ వినయ్, పుస్తక తెలుగు అనువాదకర్త వల్లీశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
‘న్యాయశాఖ’ నుంచి రిజిజుకు ఉద్వాసన
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొలీజియంలో మరింత పారదర్శకత కోరుతూ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెణ్ రిజిజును ఆ శాఖ బాధ్యతల నుంచి మోదీ సర్కార్ తప్పించింది. న్యాయవ్యవస్థతో ఎలాంటి బేధాభిప్రాయాలు పొడచూపకూడదనే ఉద్దేశంతోనే ఈయన శాఖను మార్చారని తెలుస్తోంది. పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖల స్వతంత్ర మంత్రి అర్జున్‌సింగ్ మేఘ్వాల్కు న్యాయశాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. కేబినెట్ ర్యాంక్‌లేని ఒక స్వతంత్ర హోదా మంత్రికి కీలకమైన న్యాయశాఖను అప్పగించడం గత పాతికేళ్లలో ఇదే తొలిసారి. ఎందుకు మార్చారు ? సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో జడ్జీలను సొంతంగా సుప్రీంకోర్టే కొలీజియం పేరిట నియమించుకోవడం ఎక్కడా లేదని, ఇదొక ఏలియన్ విధానం అని, మాజీ జడ్జీలు దేశవ్యతిరేక గ్యాంగ్‌లుగా తయారయ్యారని రిజిజు గతంలో ఆరోపించారు. దీంతో తమ బాధ్యతలు, విధుల్లో ప్రభుత్వ జోక్యం అనవసరమని సుప్రీంకోర్టు కొలీజియం ఘాటుగా బదులిచ్చింది. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలకు సిద్దమవుతున్న ఈ తరుణంలో రిజిజు వ్యాఖ్యలు విపక్షాలకు ఎన్నికల అస్త్రంగా మారకూడదనే ఉద్దేశంతోనే ఆయనను తప్పించినట్లు వార్తలొచ్చాయి. ఇన్నాళ్లూ మరో మంత్రి జితేంద్ర సింగ్ నిర్వహించిన భూ విజ్ఞానశాస్త్ర శాఖను రిజిజుకు అప్పగించారు. ప్రధాని మోదీ సలహా మేరకు రిజిజు, మేఘ్వాల్ శాఖలను మార్చుతున్నట్లు గురువారం రాష్ట్రపతిభవన్ ఒక నోటిఫికేషన్ విడుదలచేసింది. కాగా, బాధ్యతలు మారడంపై రిజిజు స్పందించారు. ‘ భూ విజ్ఞాన శాఖలో ప్రధాని మోదీ దార్శనికతను సుసాధ్యం చేసేందుకు శాయశక్తుల కృషిచేస్తా. ఇంతకాలం న్యాయశాఖ మంత్రిగా కొనసాగడం గౌరవంగా భావిస్తున్నా. ఇందుకు మద్దతు పలికిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్సహా మొత్తం న్యాయవ్యవస్థకు నా కృతజ్ఞతలు’ అని రిజిజు ట్వీట్ చేశారు. -
న్యాయవాదులకు వరం ‘లా నేస్తం’
సాక్షి, అమరావతి: ఏపీ అమలు చేస్తోన్న డాక్టర్ వైఎస్సార్ లా నేస్తం, న్యాయవాదుల సంక్షేమ నిధి పథకాలు న్యాయవాదులను ముఖ్యంగా జూనియర్ న్యాయవాదులను ఆదుకుంటున్నారని న్యాయశాఖ కార్యదర్శి జి.సత్యప్రభాకర్‌రావు చెప్పారు. మంగళవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. లా నేస్తం, సంక్షేమ నిధి పథకాలతో న్యాయవాదులు పొందుతున్న ప్రయోజనాలను ఆయన వివరించారు. ప్రస్తుత పోటీ పరిస్థితుల్లో జూనియర్ న్యాయవాదులు న్యాయవాద వృత్తిలో నిలదొక్కుకోవడం కష్టమని, అలాంటి వారిని ఆదుకునేందుకే లా నేస్తం పథకానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారన్నారు. 2019 అక్టోబర్ నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఈ పథకం కింద జూనియర్ న్యాయవాదికి నెలకు రూ.5 వేల చొప్పున మూడేళ్ల పాటు స్టైఫండ్ చెల్లిస్తున్నట్లు చెప్పారు. గత మూడున్నర ఏళ్లలో 65,537 మంది న్యాయవాదులకు రూ.34.39 కోట్లను స్టైపెండ్ రూపంలో చెల్లించామని చెప్పారు. న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్ల కార్పస్‌ఫండ్‌తో సంక్షేమ నిధిని ఏర్పాటు చేశామన్నారు. ఈ సంక్షేమ నిధి నుంచి అర్హులైన న్యాయవాదులకు వైద్య ఖర్చులు, లా పుస్తకాలు, మేజర్ ఆపరేషన్లు, ఇన్సూరెన్స్ వంటి అత్యవసరాలకు నిధులను కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఈ నిధి ద్వారా ఇప్పటివరకు 7,733 మంది న్యాయవాదులకు రూ.25 కోట్ల మేర సాయం చేసినట్లు చెప్పారు. -
వెనకబడ్డ తరగతుల జడ్జిలు... హైకోర్టుల్లో 15 శాతమే
న్యూఢిల్లీ: దేశంలో గత ఐదేళ్లలో హైకోర్టుల్లో నియమితులైన న్యాయమూర్తుల్లో వెనుకబడిన తరగతులకు చెందినవారు కేవలం 15 శాతం మందే ఉన్నారని డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్ వెల్లడించింది. బీజేపీ సీనియర్ నేత, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీని నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయీ సంఘానికి ఈ విషయాన్ని నివేదించింది. జడ్జిలను నియమించే అధికారాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని కొలీజియంకు కట్టబెట్టి 3 దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ హైకోర్టుల్లో బీసీ జడ్జిల సంఖ్య పెరగడం లేదని స్పష్టంచేసింది. జడ్జిలుగా ఎవరిని నియమించాలన్నది కొలీజియమే తేలుస్తుందని గుర్తుచేసింది. కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను మాత్రమే ప్రభుత్వం ఆమోదించగలదని వెల్లడించింది. న్యాయస్థానాల్లో సామాజిక వైవిధ్యాన్ని ఇంకా సాధించలేకపోయామని డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్‌అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయమూర్తుల నియామకం విషయంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలతోపాటు మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తరచుగా కొలీజియంను కోరుతూనే ఉందని వివరించింది. 2018 నుంచి 2022 డిసెంబర్ 19 వరకూ హైకోర్టుల్లో 537 మందిని జడ్జిలుగా నియమించగా, వీరిలో 1.3 శాతం మంది ఎస్టీలు, 2.8 శాతం మంది ఎస్సీలు, 11 శాతం మంది ఓబీసీలు, 2.6 శాతం మైనారిటీలు ఉన్నారని తెలియజేసింది. -
4 వారాల్లోగా లీగల్ ఫీజులు చెల్లించాలి
సాక్షి, అమరావతి: ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ల తరఫున హైకోర్టు, ట్రిబ్యునళ్లు, ఇతర న్యాయస్థానాల్లో వివిధ హోదాల్లో సేవలందించిన న్యాయవాదులకు లీగల్ ఫీజులు/గౌరవ వేతనం సకాలంలో చెల్లించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు చెప్పింది. ప్రభుత్వ న్యాయవాదులు, స్టాండింగ్ కౌన్సిళ్లకు ఇప్పటివరకు చెల్లించాల్సిన ఫీజులను 4 వారాల్లో చెల్లించాలని 12 శాతం వార్షిక వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. ఇక నుంచి వారి ఫీజులను బిల్లులు సమర్పించిన 4 వారాల్లో లేదా 12 శాతం వార్షిక వడ్డీతో కలిపి నెల తర్వాత చెల్లించాలని స్పష్టం చేసింది. కింది కోర్టులు, ట్రిబ్యునళ్లలో సేవలందిస్తున్న వారికి ప్రతి నెలా సకాలంలో లీగల్ ఫీజులు అందేలా చర్యలు తీసుకోవాలని న్యాయ శాఖ కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఇటీవల తీర్పు వెలువరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాయలసీమ ప్రాంతంలో మండల, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీలకు స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించిన సీహెచ్ వేదవాణి తనకు చెల్లించాల్సిన లీగల్ ఫీజులను చెల్లించడంలేదంటూ 2015లో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఆమెకు ఫీజులను చెల్లించాలని అధికారులను ఆదేశించింది. వారు కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో వేదవాణి కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ బట్టు దేవానంద్ విచారించారు. విచారణ సందర్భం గా ప్రభుత్వ న్యాయవాదులు, స్టాండింగ్ కౌన్సిల్స్ సకాలంలో లీగల్ ఫీజులు అందక పడుతున్న ఇ బ్బందులు న్యాయమూర్తి దృష్టికి వచ్చాయి. దీంతో తనకున్న విచక్షణాధికారంతో ఈ వ్యాజ్యం పరిధిని విస్తృతపరిచి ప్రభుత్వ న్యాయవాదులు, స్టాండింగ్ కౌన్సిల్స్ అందరికీ వర్తించేలా తీర్పునిచ్చారు. కోర్టుకెక్కే పరిస్థితి తేవద్దు ‘ప్రభుత్వ న్యాయవాదులు, స్టాండింగ్ కౌన్సిల్స్ సేవలను వినియోగించుకుంటున్న ప్రభుత్వం, ఇతర విభాగాలు బిల్లులను మాత్రం సకాలంలో చెల్లించడంలేదు. వారూ కుటుంబాల సంక్షేమాన్ని చూసుకోవాలి. ఓ కార్యాలయాన్ని, గ్రంథాలయాన్ని, సహచరులను, సిబ్బందిని నిర్వహించాలి. సకాలంలో లీగల్ ఫీజులు చెల్లించకపోతే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఫీజు కోసం హైకోర్టులో పిటిషన్లు, కోర్టు ధిక్కార వ్యాజ్యాలు దాఖలు చేసే పరిస్థితి వారికి తీసుకురావద్దు. రాజకీయ కారణాలతో కూడా ఫీజుల చెల్లింపుల్లో అసాధారణ జాప్యం జరుగుతోందన్న ఆరోపణ ఉంది. ప్రభుత్వాలు మారినప్పుడు గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన వారి ఫీజులు ఆపుతున్నారన్న ఆరోపణ నిజమైతే అది సమంజసం కాదు. వారు సేవలందించింది రాష్ట్రానికే తప్ప వ్యక్తులకు కాదు. పాలకులు వస్తూ పోతూ ఉంటారు. రాష్ట్రం శాశ్వతంగా ఉంటుంది. సకాలంలో ఫీజులు పొందే హక్కు అడ్వొకేట్ జనరల్, ప్రభుత్వ న్యాయవాది, స్టాండింగ్ కౌన్సిల్ సహా అందరికీ ఉంది’ అని జస్టిస్ దేవానంద్ తన తీర్పులో స్పష్టం చేశారు. -
అదీ.. అమెరికా అంటే.. ఆ మోసాలపై విచారణకు రెడీ
అమెరికాపై ఎన్ని విమర్శలు ఉన్నా .. పారదర్శకత కోసం ప్రయత్నించడంలో ఎప్పుడూ వెనుకబడలేదు. ఇందుకు సాక్షంగా నిలుస్తోంది అక్కడి న్యాయశాఖ తీసుకున్న నిర్ణయం. కోవిడ్ కష్టకాలంలో సాయంగా ప్రకటించిన భారీ మొత్తంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈ కోవిడ్ రిలీఫ్ ఫండ్‌లో చోటు చేసుకుని అవినీతి ఆరోపణలపై విచారించేందుకు ప్రత్యేక డైరెక్టరేట్‌ని ఏర్పాటు చేసింది యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్. 2020లో కోవిడ్ ప్రపంచాన్ని చుట్టేస్తున్న సమయంలో యూఎస్‌లో కూడా లాక్డౌన్ విధించారు. ఇది దీర్ఘకాలం కొనసాగడంతో ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ప్రజల సంక్షేమ చర్యల్లో భాగంగా 2.2 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించారు. ఇందులో సుమారు 8 బిలియన్ డాలర్లు పూర్తిగా పక్కదారి పట్టినట్టు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ఈ మోసాల విచారణకు ప్రత్యేక డైరెక్టరేట్‌ని ఏర్పాటు చేసింది. దీనికి డైరెక్టర్‌గా అసోసియేట్ డిప్యూటీ ఆటార్నీ జనరల్ కెవిన్ చాంబర్స్‌ని నియమించారు. - తప్పుడు సమాచారంతో సుమారు 6 బిలియన్ డాలర్ల కోవిడ్ రిలీఫ్ సాయం పొందిన 1800ల మంది వ్యక్తులు. వీరిపై నమోదైన 240 కేసుల విచారణ - వన్ బిలియన్ డాలర్ల కోవిడ్ సహాయ నిధులు పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు ఉన్న వెయ్యి ముద్దాయిలపై ఉన్న కేసులు - వన్ బిలియన్ డాలర్ల విలువైన ఎకనామిక్ ఇంజ్యూరీ డిసాస్టర్ లోన్ మంజూరు విషయంలో వస్తున్న ఆరోపణలపై స్పెషల్ డైరెక్టరేట్ విచారణ జరపనుంది. కోవిడ్ రిలీఫ్ సహాయ చర్యల మోసాలకు సంబంధించిన విచారణలో సివిల్, క్రిమినల్, పరిపాలన ఇలా అన్ని విభాగాల సాయం తీసుకోనున్నారు. ఇప్పటికే వివిధ రకాల ఏజెన్సీల నుంచి పక్కా సమాచారం సేకరించినట్టు న్యాయశాఖ చెబుతోంది. ప్రస్తుతం కేసు విచారణకుఏ సహాకరించేలా డేటా విశ్లేషణ పెద్ద ఎత్తున జరుగుతోంది. కోవిడ్ రిలీఫ్ కింద ప్రకటించిన భారీ మొత్తంతో నేరుగా ఆర్థిక సాయం చేయడంతో పాటు పీపీఈ కిట్ల కొనుగోలు, రుణాల మంజూరు, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయల పెంపు, క్వారెంటైన్ సెంటర్ల ఏర్పాటు ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టారు. బాధితులను ఆదుకోవడమలే లక్ష్యంగా చాలా వేగంగా యుద్ధ ప్రతిపాదికన ఈ పనులు చేపట్టడాన్ని.. అవకాశంగా మలుచుకున్న కొందరు అవినీతికి తెర లేపారు. కోవిడ్ నిధుల దుర్వినయోగంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అనేక కేసులు నమోదు అయ్యాయి. అయితే కోవిడ్ కల్లోలం చల్లారిన తర్వాత యూఎస్ ప్రభుత్వం, అక్కడి న్యాయవ్యవస్థ ఈ అవినీతి వ్యవహారంపై దృష్టి సారించింది. విచారణ వేగం పుంజుకోవడంతో అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. -
కాబోయే హిమాచల్ సీజేకు వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్కు హైకోర్టు గురువారం ఘనం గా వీడ్కోలు పలికింది. మొదటి కోర్టు హాల్లో జరిగిన వీడ్కోలు సభకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ అధ్యక్ష త వహించారు. జస్టిస్ రామసుబ్రమణియన్‌ను పదోన్నతిపై హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తర్వాత కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. కేసుల్ని సత్వరంగా పరిష్కరించడంలో, విభి న్న కేసుల్లో ఆయన అందించిన న్యాయసేవల్ని జస్టిస్ చౌహాన్ కొనియాడారు. ఉమ్మడి హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నప్పటి నుంచి హైకోర్టులో న్యాయవాదు లు, సిబ్బంది అందించిన సహకారానికి జస్టిస్ రామసుబ్రమణియన్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, పలువురు న్యాయవాదులు, జస్టిస్ రామసుబ్రమణియన్ భార్య సరస్వతి, కుమారుడు దర్శన్, కోర్టు సిబ్బంది హాజరయ్యారు. ఈ బదిలీతో హైకోర్టులో ఏసీజేతో కలిపి న్యాయమూర్తుల సంఖ్య 11కు తగ్గింది. 13 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యాలయంలో కూడా జస్టిస్ రామసుబ్రమణియన్కు న్యాయవాదులు జ్ఞాపికను అందజేసి వీడ్కోలు పలికారు. ఇదిలా ఉండగా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చౌహాన్‌తో గవర్నర్ నరసింహన్ 22న ప్రమాణస్వీకారం చేయించనున్నారు. -
సీజేఐగా రంజన్ గొగోయ్
న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ రంజన్ గొగోయ్(63) నియమితులైనట్లు న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడిం చింది. ఈశాన్య రాష్ట్రాల నుంచి నియమితులైన మొట్టమొదటి సీజేఐ ఈయనే కావడం గమనార్హం. ప్రస్తుత సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ గొగోయ్ పేరును సీజేఐగా లా కమిషన్‌కు ప్రతిపాదించారు. కమిషన్ ఆ ప్రతిపాదనను ప్రధాని మోదీకి పంపగా ఆయన దానిని రాష్ట్రపతి ఆమోదానికి సిఫారసు చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేయడంతో న్యాయమంత్రిత్వ శాఖ గురువారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. వివిధ అంశాలకు సంబంధించి సీజేఐకు వ్యతిరేకంగా గొంతెత్తిన నలుగురు న్యాయమూర్తుల్లో జస్టిస్ గొగోయ్ కూడా ఉండటంతో సీజేఐగా ఆయన నియామకంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అక్టోబర్ 2వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఎన్నార్సీ, లోక్‌పాల్ కేసుల విచారణలో కీలక తీర్పులు వెలువరించారు. -
‘ఆలిండియా జ్యుడీషియల్’ వద్దు
దిగువ కోర్టుల్లో జడ్జీల నియామకాలకు ఉద్దేశించిన ఏఐజేఎస్‌పై మెజారిటీ హైకోర్టుల వ్యతిరేకత ► కేంద్ర ప్రతిపాదనలకు లభించని ఆమోదం ► కింది కోర్టులపై నియంత్రణ కోరుతున్న హైకోర్టులు ► దిగువ కోర్టుల్లో భారీగా జడ్జీల ఖాళీలు ► నీట్, యూపీఎస్సీ తరహా ప్రతిపాదనలు చేసిన కేంద్రం న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థలోనూ ఆలిండియా సర్వీసుల (ఆలిండియా జ్యుడీషియల్ సర్వీసెస్–ఏఐజేఎస్)ను ఏర్పాటు చేయాలన్న కేంద్రం ఆలోచనకు హైకోర్టుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. కిందిస్థాయి కోర్టుల్లో ఈ సేవలను అమలుచేయాలంటూ కేంద్ర న్యాయశాఖ చేసిన ప్రతిపాదనను 9 హైకోర్టులు వ్యతిరేకించాయి. రెండు హై కోర్టులు మాత్రమే దీన్ని ఆమోదించగా.. ఎనిమిది హైకోర్టులు చాలా మార్పులు (నిమాయక స్థాయి, అర్హతలు, శిక్షణ, ఏఐజేఎస్ ద్వారా భర్తీ చేసే ఖాళీల్లో కోటా వంటి అంశాలపై పలు సూచనలు) సూచించాయి. ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపేందుకు 24 హైకోర్టులు దాదాపుగా విముఖత వ్యక్తం చేశాయి. ఈ కోర్టులన్నీ కిందిస్థాయి కోర్టులపై తమ నియంత్రణ ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డాయి. అయితే దిగువ కోర్టుల్లో భారీగా న్యాయమూర్తుల ఖాళీల కారణంగానే పెద్ద సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్రం భావిస్తోంది. వీలైనంత త్వరగా ఓ నిర్ణయానికి వచ్చి ఖాళీలను భర్తీ చేయాలని న్యాయశాఖ యోచిస్తోంది. ‘మెజారిటీ కోర్టులు కిందిస్థాయి కోర్టులపై పాలనాపరమైన నియంత్రణ ఉండాలని భావిస్తున్నాయి’ అని కేంద్ర న్యాయశాఖ.. పార్లమెంటు సంప్రదింపుల కమిటీకి పంపిన నివేదికలో పేర్కొంది. బంతి ‘సుప్రీం’ కోర్టులో.. 2015, డిసెంబర్ 31న విడుదల చేసిన వివరాల ప్రకారం దేశంలోని దిగువకోర్టుల్లో 4,452 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీచేసే విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కొన్ని సూచనలు చేసింది. నీట్ తరహా పరీక్షను నిర్వహించటం ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయాలని ప్రతిపాదించింది. కోర్టుల్లో న్యాయమూర్తుల ఖాళీలను వేగంగా భర్తీ చేసేందుకు వివిధ పద్ధతులను కూడా కేంద్రం సూచించింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉండే.. నియామక సంస్థను ఏర్పాటుచేసి కేంద్రీకృత పరీక్షను నిర్వహించాలని కూడా ప్రతిపాదించింది. జ్యుడీషియల్ అధికారుల ఎంపిక కోసం యూపీఎస్సీ ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహిస్తే ఎలా ఉంటుందని కూడా సుప్రీంను కేంద్రం కోరింది. ఐబీపీఎస్‌లో అనుసరిస్తున్న పద్ధతులను కూడా పరిశీలించాలని న్యాయశాఖ కార్యదర్శి సుప్రీంకోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. 1960 నాటి ఈ ప్రతిపాదనలను మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ ఈ ప్రతిపాదనలను తెరపైకి తెచ్చింది. జర్నలిస్టులు ప్రత్యేకం కాదు: ఢిల్లీ కోర్టు పౌరుల పేరు ప్రతిష్టలను భంగం కలిగించేలా ఎవరినైనా విమర్శించటం, ఆరోపణలు చేసే హక్కు మీడియాకు లేదని ఢిల్లీ హైకోర్టు చురకలంటించింది. జర్నలిస్టులకు ప్రత్యేక స్వేచ్ఛ ఏదీ లేదని పేర్కొంది. సమాచారాన్ని వ్యాప్తి చేయాల్సిన గొప్ప బాధ్యత జర్నలిస్టులపై ఉందంటూనే పరిధి దాటి వ్యవహరించకూడదని సూచించింది. తన పరువుకు భంగం కలిగించారంటూ ఓ పత్రిక మేనేజింగ్ ఎడిటర్‌పై ఓ వ్యక్తి వేసిన కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వ్యతిరేకించినవి 8 - తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు సహా బాంబే, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పట్నా, పంజాబ్–హరియాణా (చండీగఢ్) సూచనలు చేసినవి - అలహాబాద్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మణిపూర్, మేఘాలయ, ఒడిశా, ఉత్తరాఖండ్ 4ఆమోదించినవి - సిక్కిం, త్రిపుర నిర్ణయంచెప్పనివి - జార్ఖండ్, రాజస్తాన్, కలకత్తా, జమ్మూకశ్మీర్, గువాహటి హైకోర్టులు -
గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల
-
గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల
- 982 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరిన ఏపీపీఎస్సీ - 11 నుంచి కమిషన్ వెబ్సైట్లో దరఖాస్తు నమూనాలు - డిసెంబర్ 10 వరకు దరఖాస్తుల స్వీకరణ - దరఖాస్తులు 25 వేలు దాటితే ఆఫ్‌లైన్‌లో పరీక్ష - ఆ మేరకు ఫిబ్రవరి 26న స్క్రీనింగ్ పరీక్ష - మే 20, 21న మెరుున్ పరీక్ష - దరఖాస్తులు 25 వేలు దాటకుంటే నేరుగా మెరుున్ పరీక్షే సాక్షి, అమరావతి: నిరుద్యోగులు వేరుుకళ్లతో ఎదురుచూస్తున్న గ్రూప్-2 నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదలైంది. మంగళవారం అర్థరాత్రి 34 కేటగిరీల్లో 982 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. వీటిలో 442 ఎగ్జిక్యూటివ్ పోస్టులు కాగా, 540 పోస్టులు నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు. దరఖాస్తు నమూనాలు ఈ నెల 11నుంచి కమిషన్ వెబ్సైట్ (ఠీఠీఠీ.ఞటఛి.్చఞ.జౌఠి.జీ)లో అందుబాటులో ఉంటారుు. ఆరోజు నుంచి డిసెంబర్ పదో తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అదేరోజు రాత్రి 11.59 గంటల వరకు ఫీజు చెల్లించేందుకు గడువు విధించారు. దరఖాస్తులు 25వేలు దాటితే ఆఫ్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తామని కమిషన్ నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. ఆ మేరకు ఫిబ్రవరి 26వ తేదీన ఈ స్క్రీనింగ్ పరీక్షను నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మే 20, 21 తేదీల్లో ఆన్లైన్లో మెరుున్ పరీక్ష నిర్వహిస్తారు. అరుుతే దరఖాస్తులు 25 వేలు దాటనట్లరుుతే స్క్రీనింగ్ పరీక్ష ఉండదు. నేరుగా మెరుున్ పరీక్షను(మే 20, 21 తేదీల్లో) నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా దరఖాస్తు చేయాలనుకునేవారు ముందుగా కమిషన్ వెబ్సైట్లో ఓటీపీఆర్ (వన్‌టైమ్ ప్రొఫైల్ రిజిస్టేషన్ర్) చేసుకోవాలి. ఈ ఓటీపీఆర్ యూజర్‌నేమ్, పాస్వర్డ్ ద్వారానే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సివుంటుంది. పరీక్ష తేదీలకు వారం ముందు నుంచి హాల్ టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం జూలై ఒకటి నాటికి 42 సంవత్సరాలు దాటనివారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా పోస్టులను బట్టి విద్యార్హతలను నిర్ణరుుంచారు.దరఖాస్తుదారులు రూ.250 అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు, రూ.80 పరీక్ష ఫీజును ఆన్లైన్లో చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మాజీ సైనికోద్యోగులకు ఫీజు మినహారుుంపునిచ్చారు. స్క్రీనింగ్, మెరుున్ పరీక్షలను రాష్ట్రంలోని 13 జిల్లాలతోపాటు హైదరాబాద్‌లో నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్ష 150 మార్కులకు, మెరుున్ పరీక్ష 450 మార్కులకు నిర్వహిస్తారు. పోస్టుల వివరాలు.. ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్ పోస్టులు 12, ఏసీటీఓ 96, గ్రేడ్-2 సబ్‌రిజిష్ట్రార్ 27, డిప్యూటీ తహశీల్దార్ 253, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 8, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ శాఖలో అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్లు 23, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు 8, ఎకై ్సజ్ ఎస్ఐ పోస్టులు 15 ఉన్నారుు. నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో సచివాలయం జీఏడీ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 67, ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు 16, న్యాయ శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు 18, అసెంబ్లీ సెక్షన్ ఆఫీసర్లు 23, స్టేట్ ఆడిట్ సబార్డినేట్ సర్వీస్‌లో సీనియర్ ఆడిటర్ పోస్టులు 45, ఖజానా శాఖలో(హెచ్ఓడీ) సీనియర్ అకౌంటెంట్లు 82, ఖజానా శాఖలో(డిస్ట్రిక్ట్ సబ్ సర్వీస్) సీనియర్ అకౌంటెంట్లు 158, ఖజానా శాఖలో జూనియర్ అకౌంటెంట్లు 39, గవర్నమెంట్ ఎగ్జామినేషన్సలో జూనియర్ అసిస్టెంట్లు 10, లేబర్ డిపార్టుమెంట్లో జూనియర్ అసిస్టెంట్లు 10, పీహెచ్ అండ్ ఎంఈ శాఖలో జూనియర్ అసిస్టెంట్లు 3, రవాణా శాఖలో జూనియర్ అసిస్టెంట్లు 6, జైళ్లశాఖలో జూనియర్ అసిస్టెంట్లు 3, స్త్రీ,శిశు సంక్షేమ శాఖలో జూనియర్ అసిస్టెంట్ 1, డ్రగ్స అండ్ కాపీరైట్స్ శాఖలో జూనియర్ అసిస్టెంట్లు 2, వ్యవసాయ శాఖలో జూనియర్ అసిసెంట్లు 10, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్‌లో జూనియర్ అసిస్టెంట్లు 2, ఎకై ్సజ్‌శాఖలో జూనియర్ అసిస్టెంటు 4, షుగర్‌కేన్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ 1, ఆర్ అండ్ బీలో జూనియర్ అసిస్టెంట్లు 14, సర్వే సెటిల్మెంట్లో జూనియర్ అసిస్టెంట్లు 4, పౌరసరఫరాల శాఖలో జూనియర్ అసిస్టెంట్లు 7, బీసీ సంక్షేమశాఖలో జూనియర్ అసిస్టెంట్లు 3, ఏసీబీలో జూనియర్ అసిస్టెంట్ 1, ఏపీ ఇన్సూరెన్సలో సీనియర్ అసిస్టెంట్ 1, ఏపీ జనరల్ లైఫ్ ఇన్సూరెన్సలో సీనియర్ అసిస్టెంట్లు 10 పోస్టులను భర్తీ చేయనున్నారు. -
తీర్పు మేరకే కేంద్రానికి అధికారాలు
న్యాయ నియామకాలపై సుప్రీం తీర్పు ప్రకారం అధికారం తీసుకున్నాం * విధివిధానాల ముసాయిదాపై న్యాయశాఖ ఉద్ఘాటన న్యూఢిల్లీ: ఉన్నత స్థాయి న్యాయ నియామకాలకు సంబంధించిన విధివిధానాలు, అధికార పరిధులపై కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు కొలీజియంల మధ్య భిన్నాభిప్రాయాల నేపథ్యంలో.. న్యాయనియామకాలపై సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తాను అధికారాన్ని తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. న్యాయమూర్తుల నియామక వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టు ధర్మాసనం 2015 డిసెంబర్లో ఇచ్చిన తీర్పులో ఉద్ఘాటించిందని న్యాయశాఖలోని ఉన్నతస్థాయి వర్గాలు శుక్రవారం ఉటంకించాయి. కొలీజియం వ్యవస్థను మెరుగుపరిచే మార్గాలపై ఇచ్చిన ఆ తీర్పులో.. ధర్మాసనానికి నియమించబోయే అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోవటానికి మరింత విస్తృత పరిధి ఉండాలని కూడా పేర్కొందని గుర్తుచేశాయి. ఆ తీర్పు ఆధారంగానే న్యాయ నియామకాలపై సవరించిన విధివిధానాల పత్రం ముసాయిదాను రూపొందించటం జరిగిందని చెప్పాయి. ఆమేరకు.. అభ్యర్థుల పేర్లు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు అందరి నుంచీ రావాలన్నది ప్రభుత్వ వైఖరిగా చెప్పాయి. ‘ఒక హైకోర్టు కొలీజియానికి పేర్లను సూచించే స్వేచ్ఛ సదరు హైకోర్టు న్యాయమూర్తులు అందరికీ ఉండాలి. ఆ కొలీజియం ఆ పేర్లను పరిశీలించి నియామకాలకు ఎవరిని సిఫారసు చేయాలనేదానిపై నిర్ణయం తీసుకుంటుంది. సుప్రీంకోర్టుకు కూడా ఇదే విధానం వర్తింపజేయాలి. మధ్యప్రదేశ్ హైకోర్టు ఇదే సూత్రాన్ని పాటిస్తోంది’ అని ఆ వర్గాలు వివరించాయి. అలాగే.. ముఖ్యమంత్రులకు, అడ్వొకేట్ జనరళ్లకు కూడా తమ రాష్ట్ర హైకోర్టు కొలీజియంలకు అభ్యర్థులను సూచించే అవకాశం ఇవ్వాలని పేర్కొన్నాయి. సుప్రీంకోర్టుకు అభ్యర్థులను సూచించే అవకాశం అటార్నీ జనరల్‌కు ఇవ్వాలన్నాయి. న్యాయనియామకాలకు సంబంధించి మార్గదర్శకాల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విధివిధానాల పత్రం ముసాయిదాలో పలు మార్పులు చేయాలని చెప్తూ సుప్రీంకోర్టు కొలీజియం గతంలో కేంద్రానికి తిప్పిపంపిన విషయం తెలిసిందే. ఇందులో కొలీజియం డిమాండ్లు కొన్నిటికి అంగీకరిస్తూ సవరించిన ముసాయిదాను కేంద్రం ఈ నెల 3వ తేదీన కొలీజియానికి పంపించింది. అభ్యర్థుల ఎంపికకు ప్రతిభ - సీనియారిటీ ప్రాతిపదికగా ఉండాలన్న మార్గదర్శకాన్ని.. సీనియారిటీ-ప్రతిభ ప్రాతిపదికగా మార్చటానికి కేంద్రం ఆంగీకరించింది. అయితే సీనియారిటీని కాదనటానికి.. ఒక హైకోర్టు నుంచి ఎక్కువ మంది న్యాయమూర్తులు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలకు చోటు ఇవ్వటం, ఒక న్యాయమూర్తి అత్యద్భుత పనితీరు, ఒక ప్రధాన న్యాయమూర్తి పనితీరు బాగోలేకపోవటం వంటి కారణాలను వినియోగించుకోవచ్చునని పేర్కొంది. న్యాయమూర్తి అయ్యేందుకు అవసరమైన కనీస వయసును నిర్ణయించే అంశాన్ని న్యాయవ్యవస్థకే వదిలిపెట్టింది. అయితే.. ఒకసారి నిర్ణయించిన వయసును సడలించటానికి వీలు ఉండకూడదని స్పష్టంచేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల స్థాయి లో.. అభ్యర్థుల పనితీరు అంచనా, మదింపుల కమిటీలు ఉండాలన్న నిబంధనను భారత ప్రధాన న్యాయమూర్తి తిరస్కరించినప్పటికీ.. సర్కారు దానిపై మళ్లీ పట్టుపట్టింది. -
సస్పెన్షన్లు ఎత్తేస్తే విధుల్లోకి...!
న్యాయాధికారులు, ఉద్యోగుల యోచన - సీజేఐ హామీ నేపథ్యంలో తర్జనభర్జనలు - వారిని పిలిపించి మాట్లాడిన గవర్నర్ - వెంటనే విధుల్లో చేరాలని స్పష్టీకరణ - సస్పెన్షన్ ఎత్తివేతపై హామీ ఇవ్వని వైనం - ఆందోళనలు కొనసాగుతాయంటూ జేఏసీ వ్యాఖ్యలు - న్యాయాధికారుల సంఘం చర్చలు.. నేడూ భేటీ! - వారి సెలవు దరఖాస్తులను తిరస్కరించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్ : హైకోర్టు రూపొందించిన న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపుల జాబితాపై కొద్ది రోజులుగా తీవ్ర నిరసనలు, ఆందోళనలు, సమ్మె చేస్తూ వస్తున్న తెలంగాణ న్యాయాధికారులు, న్యాయవాదులు, న్యాయ శాఖ ఉద్యోగులు ఇప్పుడు సస్పెన్షన్ల ఎత్తివేతపై దృష్టి సారించారు. న్యాయాధికారుల సంఘం, న్యాయ శాఖ ఉద్యోగుల సంఘం నేతలపై హైకోర్టు విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తే ఆందోళనలను, సమ్మెను విరమించి విధుల్లో చేరే దిశగా యోచన చేస్తున్నారు. వెంటనే విధుల్లో చేరాలని, ప్రాథమిక కేటాయింపుల జాబితా విషయాన్ని తాను చూసుకుంటానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఇంకా సెలవుల్లోనే కొనసాగడం సబబేనా అని వారు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆందోళనలు విరమించి వెంటనే విధుల్లో చేరాల్సిందేనని సోమవారం గవర్నర్ నరసింహన్ కూడా స్పష్టం చేయడంతో న్యాయాధికారులు సెలవులను కొనసాగించడంపై పునరాలోచనలో పడినట్లు సమాచారం. అయితే సస్పెన్షన్ ఎత్తివేతపై హైకోర్టు నుంచి సంకేతాలేమీ రాకపోవడంతో ఉద్యమ కార్యాచరణపై వారు తర్జనభర్జన పడుతున్నట్టు తెలిసింది. సెలవులను కొనసాగించడమా, సీజేఐ, గవర్నర్ సూచించినట్టు విధుల్లో చేరడమా అన్నదానిపై న్యాయాధికారుల సంఘం ప్రతినిధులు సోమవారం రాత్రి సమావేశమై పొద్దుపోయేదాకా చర్చించారు. ఏం నిర్ణయం తీసుకున్నారో తెలియరాలేదు. మంగళవారం న్యాయాధికారులంతా సమావేశమై పూర్తిస్థాయి చర్చల అనంతరం ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముంది. సస్పెన్షన్ల ఎత్తివేతపై నిర్దిష్టమైన హామీ ఇచ్చేందుకు గవర్నర్ నిరాకరించినందున తమ ఆందోళనలు కొనసాగుతాయని న్యాయవాదుల సంఘం, జేఏసీ నేతలు మౌఖికంగా చెప్పడం విశేషం. న్యాయాధికారులతో గవర్నర్ చర్చలు సోమవారం సాయంత్రం న్యాయాధికారులు, న్యాయశాఖ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కె.రవీందర్‌రెడ్డి, వరప్రసాద్, చంద్రశేఖరప్రసాద్, సుబ్బయ్య, లకా్ష్మరెడ్డి తదితరులను గవర్నర్ రాజ్‌భవన్‌కు పిలిపించి అరగంటకు పైగా చర్చించారు. సీజేఐ స్పష్టమైన హామీ ఇచ్చాక కూడా విధులకు దూరంగా ఉండటం సరికాదని న్యాయాధికారులకు, న్యాయవాదులకు ఆయన స్పష్టం చేసినట్లు తెలి సింది. ఇన్నేళ్లుగా ఎప్పుడైనా ఇలా న్యాయాధికారులు ఆందోళనలు చేయడం చూశారా అని వారిని ప్రశ్నించిన గవర్నర్, వెంటనే విధుల్లో చేరితే సమస్యలన్నీ సర్దుకుంటాయని సూచించారు. న్యాయాధికారులు సెలవులపై ఉండటం సరికాదని, కక్షిదారులు తీవ్ర ఇబ్బందులు పడతారు గనక వెంటనే విధుల్లో చేరాలని కోరినట్టు తెలిసింది. కేటాయింపుల జాబితాపై ఆందోళన వద్దని, అభ్యంతరాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంటుందని వారికి గవర్నర్ చెప్పారు. తమ సస్పెన్షన్ల ఎత్తివేత గురించి ప్రస్తావించగా, దానిపై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని కలవాలని సూచించారు. న్యాయవాదులకు హామీ ఇవ్వని గవర్నర్ న్యాయాధికారులు కలవడానికి ముందు గవర్నర్‌ను న్యాయవాదుల జేఏసీ నేతలు కన్వీనర్ ఎం.రాజేందర్‌రెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గండ్ర మోహనరావు నేతృత్వంలో కలసి వినతిపత్రం సమర్పించారు. న్యాయాధికారులు, న్యాయ శాఖ ఉద్యోగుల సస్పెన్షన్ల ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలని కోరారు. కానీ దీనిపై గవర్నర్ హామీ ఇవ్వలేదని, ముందు ఆందోళనలు, సమ్మెలు విరమించి విధుల్లో చేరాలని స్పష్టం చేశారని విశ్వసనీయంగా తెలిసింది. దాంతో, గవర్నర్‌తో భేటీ తరువాత బయటకు వచ్చిన నేతలు తమ ఆందోళనలు కొనసాగుతాయని మౌఖికంగా చెప్పి వెళ్లిపోయారు. వరప్రసాద్ అమెరికా టూర్‌కు అనుమతి రద్దు సస్పెన్షన్‌కు గురైన న్యాయాధికారుల సంఘం కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా 14వ అదనపు జిల్లా జడ్జి వి.వరప్రసాద్ అమెరికా పర్యటనకు గతంలో ఇచ్చిన అనుమతిని హైకోర్టు రద్దు చేసింది. నగరం దాటరాదని సస్పెన్షన్ ఉత్తర్వుల్లో షరతు విధించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. న్యాయాధికారుల సెలవు దరఖాస్తులు తిరస్కృతి న్యాయాధికారులు మూకుమ్మడి సెలవుల కోసం పెట్టుకున్న దరఖాస్తులను తిరస్కరిస్తూ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 27 నుంచి మూకుమ్మడి సెలవులపై వెళ్లాలని నిర్ణయించుకున్న న్యాయాధికారులు తమ యూనిట్ హెడ్లకు సెలవుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు సెలవుల మంజూరు అధికారాన్ని జిల్లా జడ్జీల నుంచి ఉపసంహరించి తన వద్దే అట్టిపెట్టుకుంది. దాంతో న్యాయాధికారుల సెలవు దరఖాస్తులన్నీ హైకోర్టుకు చేరాయి. తెలంగాణలో పది జిల్లాల్లోని 100కు పైగా న్యాయాధికారులు, కర్నూలులో పనిచేస్తున్న ఇద్దరు తెలంగాణ న్యాయాధికారులు పెట్టుకున్న దరఖాస్తులను పరిశీలించిన హైకోర్టు, వాటన్నింటినీ తిరస్కరిస్తూ సోమవారం ఉత్తర్వులిచ్చింది. -
న్యాయశాఖ ఉద్యోగులపైనా కొరడా
- 11 మంది ఉద్యోగులపై హైకోర్టు సస్పెన్షన్ వేటు - నిరసనగా పలువురు ఉద్యోగుల రాజీనామా - న్యాయాధికారులకు జరిగింది అన్యాయమే: తెలంగాణ విశ్రాంత హైకోర్టు జడ్జిలు - హైకోర్టు తక్షణమే సరిదిద్దాలని డిమాండ్ - గొంతు కలిపిన రిటైర్డ్ అధికారులు, ఉద్యోగుల సంఘం - నేడు ఇందిరాపార్కు వద్ద న్యాయవాదుల మహాధర్నా సాక్షి, హైదరాబాద్: క్రమశిక్షణ, ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ నిన్నటివరకు న్యాయాధికారులపై కన్నెర్ర చేసిన హైకోర్టు ఇప్పుడు న్యాయశాఖ ఉద్యోగులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా పెన్‌డౌన్ చేశారంటూ న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జగన్నాథం, ఉపాధ్యక్షుడు రమణారావు, ప్రధాన కార్యదర్శి రాజశేఖరరెడ్డి, అసిసోసియేట్ ప్రెసిడెంట్ రవిశంకర్, కోశాధికారి కృష్ణ నాయక్, న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శి లకా్ష్మరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే సిటీ సివిల్ కోర్ట్ న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సుబ్బయ్య, రంగారెడ్డి జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సి.శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి సి.హెచ్.వెంకట రంగారెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్ కృష్ణయ్య, కోశాధికారి ఎం.రతన్రాజులపై కూడా సస్పెండ్ చేసింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) వెంకటప్రసాద్ పేరిట గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. తమ అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని ఈ నలుగురికి హైకోర్టు తేల్చి చెప్పింది. వీరి సస్పెన్షన్‌కు నిరసనగా పలు కోర్టుల్లో పనిచేసే న్యాయశాఖ ఉద్యోగులు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేశారు. కూకట్పల్లి కోర్టులో 48 మంది, ఇబ్రహీంపట్నం కోర్టులో 12 మంది రాజీనామాలు చేశారు. రాజీనామా లేఖలను తమ జిల్లాల అధ్యక్షులకు సమర్పించారు. అయితే ఈ సస్పెన్షన్లకు భయపడేది లేదని, తమ డిమాండ్ల సాధన కోసం ఎంత వరకైనా వెళ్తామని న్యాయశాఖ ఉద్యోగుల సంఘం నేతలు చెబుతున్నారు. అటు తెలంగాణ న్యాయాధికారులు మూకుమ్మడి సెలవులను కొనసాగిస్తున్నారు. గురువారం కూడా విధులకు దూరంగా ఉన్నారు. కాగా, తెలంగాణకు చెందిన హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు, న్యాయాధికారులు, హైకోర్టు రిటైర్డ్ అధికారులు, ఉద్యోగులు వేర్వేరుగా గురువారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రాథమిక కేటాయింపుల జాబితా, న్యాయాధికారుల సస్పెన్షన్, ఉమ్మడి హైకోర్టు విభజనలో అలసత్వానికి నిరసనగా శనివారం మౌన ప్రదర్శన నిర్వహించాలని తెలంగాణకు చెందిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు నిర్ణయించిట్లు తెలిసింది. జరిగింది అన్యాయమే.. ప్రాథమిక కేటాయింపుల్లో తెలంగాణ న్యాయాధికారులకు అన్యా యం జరిగిందని రిటైర్డ్ న్యాయమూర్తులు, న్యాయాధికారులు తేల్చారు. పునర్విభజన చట్ట నిబంధనలకు, హైకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రాథమిక కేటాయింపుల జాబితాను రూపొందించారన్నారు. ఆంధ్రప్రదేశ్ న్యాయాధికారులకు లబ్ది చేకూర్చాలన్న ఉద్దేశంతోనే ఇలా చేశారని ఆరోపించారు. ఈ కేటాయింపుల వల్ల తెలంగాణకు చెందిన యువన్యాయవాదులు, న్యాయాధికారులకు తీరని నష్టం కలుగుతుందన్నారు. అన్యాయాన్ని సరిదిద్దేందుకు హైకోర్టు వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. అలాగే తెలంగాణ న్యాయాధికారుల సస్పెన్షన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు విభజనకు తక్షణమే చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రిటైర్డ్ న్యాయమూర్తుల తరఫున జస్టిస్ వి.భాస్కరరావు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇవే అభిప్రాయాలతో రిటైర్డ్ అధికారులు, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సయ్యాజీరావు కూడా ఓ ప్రకటన విడుదల చేశారు. న్యాయవాదుల ధర్నా న్యాయాధికారులపై సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ గురువారం హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆవరణలో న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. మొదటి, ఏడో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులకు చేరుకున్న న్యాయవాదులు.. ఆంధ్రా జడ్జిలు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. డిమాండ్లు పరిష్కారం అయ్యే వర కు ఉద్యమం ఆగదని పేర్కొన్నారు. న్యాయవాదుల జేఏసీ నేతలు గోవర్దన్‌రెడ్డి, చింతల కృష్ణ, వెంకటేశంను పోలీసులు అరెస్టు చేసి సాయంత్రం విడిచిపెట్టారు. నేడు న్యాయవాదుల మహాధర్నా న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపులను రద్దు చేయాలని, ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని, న్యాయాధికారులపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ న్యాయవాదుల సంఘాలు శుక్రవారం ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నా యి. ఈ ధర్నాకు అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు హాజరుకానున్నారు. హైకోర్టు బార్ అసోసియేషన్, న్యాయవాదుల జేఏసీ, ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్, బార్ కౌన్సిల్ సభ్యులు సంఘాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ధర్నాలో తెలంగాణవ్యాప్తంగా న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం ఉంది. నేటి నుంచి కోర్టు ఉద్యోగుల సమ్మె న్యాయాధికారుల ప్రాథమిక కేటాయిం పుల జాబితా ఉపసంహరణ, హైకోర్టు విభజన డిమాండ్లతో న్యాయశాఖ ఉద్యోగులు శుక్రవారం నుంచి సమ్మెలోకి వెళ్లనున్నారు. తాము సమ్మె నోటీసు ఇచ్చినా కనీసం చర్చలకు కూడా పిలవలేదని, దీంతో సమ్మె చేయాల్సి వస్తోందని ఉద్యోగ సంఘం నేతలు పేర్కొంటున్నారు. అటెండర్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వరకూ అందరూ సమ్మెలోకి వెళ్తుండంతో శుక్రవారం నుంచి కోర్టు తాళాలు కూడా తెరిచే అవకాశం లేదు. ఉద్యోగుల సమ్మెతో కోర్టులు పనిచేసే అవకాశం కూడా లేదు. -
టీచర్ల సర్వీసు రూల్స్‌కు కేంద్రం ఓకే
♦ రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణకు మార్గం ♦ ఎంఈఓ, డిప్యుటీ డీఈఓ ఖాళీల భర్తీకి అవకాశం సాక్షి, హైదరాబాద్: టీచర్ల ఏకీకృత సర్వీసు నిబంధనలకు కేంద్ర న్యాయశాఖ ఆమోదం తెలిపింది. గత దశాబ్దన్నర కాలంగా ఏకీకృత సర్వీసు నిబంధనలపై నెలకొన్న వివాదం కేంద్ర న్యాయశాఖ ఆమోదంతో ఒక కొలిక్కి వచ్చిన ట్లే. ఏకీకృత సర్వీసు నిబంధనలపై ఏర్పడిన వివాదం సుప్రీంకోర్టులో కేసుల వరకు వెళ్లడంతో రాష్ట్రంలోని వందలాది మండల విద్యాధికారుల పోస్టులు, జిల్లా ఉప విద్యాధికారులు, డైట్ లెక్చరర్ల పోస్టులు దశాబ్దకాలంగా భర్తీ కాకుండా నిలిచిపోయాయి. ఫలితంగా రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పాఠశాలలపై పర్యవేక్షణ కరువైంది. మధ్యలో ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని ఎంఈఓ పోస్టులను భర్తీ చేసినా ఏపీలో ఇప్పటికీ 550కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిప్యుటీ డీఈఓ పోస్టులు కూడా 140కి పైగా ఖాళీగా ఉన్నాయి. గత ఏడాదిలో సుప్రీంకోర్టు టీచర్ల సర్వీసు నిబంధనలపై తుది తీర్పు వెలువరించింది. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ ద్వారా సర్వీసు నిబంధనలు రూపొందించుకోవచ్చని, ఆయా టీచర్లకు పదోన్నతుల తదితర అంశాలపై ఉత్తర్వులు ఇచ్చింది. తీర్పు అనంతరం కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం నివేదికను పంపించినా ప్రభుత్వ టీచర్ల సంఘం నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ వ్యవహారాన్ని న్యాయశాఖ పరిశీలనకు కేంద్రం అప్పగించింది. ఎట్టకేలకు ఇటీవల కేంద్ర న్యాయశాఖ ఏకీకృత సర్వీసు నిబంధనలపై రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణలు చేయడానికి వీలుగా కేంద్ర హోం శాఖకు నివేదికను అందించింది. న్యాయశాఖ ఆమోదం తెలపడంతో ఇక కేంద్ర హోం శాఖ రాష్ట్రపతి ఉత్తర్వులకు వీలుగా తదుపరి చర్యలు తీసుకోవలసి ఉంది. దీనిపై రాష్ట్రపతి కార్యాలయం కూడా సానుకూల నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. అప్పటికి ఈ వ్యవహారం పూర్తవుతుంది. -
‘ఏపీ స్థానికత’కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
-
‘ఏపీ స్థానికత’కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: నూతన రాజధానికి తరలి వెళ్లే ఉద్యోగులతో పాటు ఇతరులు, వారి పిల్లలకు స్థానికత కల్పించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంబంధిత ఫైలును న్యాయ శాఖ పరిశీలనకు పంపింది. న్యాయ శాఖ ఎటువంటి అభ్యంతరాలను వ్యక్తం చేయకపోతే వీలైనంత త్వరలో స్థానిక హోదా కల్పిస్తూ ఉత్తర్వులు వెలువడతాయని అధికార వర్గాలు తెలిపాయి. న్యాయ శాఖ పరిశీలన అనంతరం మళ్లీ ఫైలు కేంద్ర హోంశాఖకు చేరుతుందని, కేంద్ర హోంశాఖ రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రాష్ట్ర విభజన తేదీ జూన్ 2, 2014 నుంచి మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే కుటుంబాలందరికీ స్థానికత కల్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్ 7న కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తుది ముసాయిదా తీర్మానాన్ని కేంద్రానికి సమర్పించింది. అనంతరం కేంద్రం అడిగిన పలు వివరణలు ఇవ్వడంతో పాటు , రాష్ట్రపతి ఉత్తర్వులకు కొన్ని సవరణలు కూడా సూచించింది. ఈ సవరణలు ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఎక్కడి నుంచైనా ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంతానికి వలస వెళ్లినప్పటికీ స్థానికత వర్తించనుంది. -
రాష్ట్రానికి రూ.3,100 కోట్ల హడ్కో రుణం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో గృహ నిర్మాణ పథకానికి రూ.3,100 కోట్ల హడ్కో రుణం మంజూరుకు కేంద్రం ఆమోదం తెలిపిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వెల్లడించారు. రాష్ట్రం నుంచి సమగ్ర ప్రతిపాదన వస్తే వీలైనంత ఎక్కువగా ఇళ్లను మంజూరు చేస్తామని, ఎలాంటి వివక్ష చూపబోమని తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఎంపీలు కేశవరావు, వినోద్, జితేందర్‌రెడ్డి, సీతారాం నాయక్, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి గురువారమిక్కడ వెంకయ్య నాయుడుతో భేటీ అయ్యారు. గృహ నిర్మాణ పథకంలో ఇళ్ల మంజూరు, హైకోర్టు విభజన, ముంపు గ్రామాల సమస్య, అమృత్ పథకం పట్టణాల జాబితాలో సిద్దిపేటను చేర్చడం తదితర అంశాలపై చర్చించారు. ఈ నెల 23వ తేదీ నుంచి నిర్వహించనన్న అయుత చండీయాగానికి రావాల్సిందిగా ఈ సందర్భంగా సీఎం కేసీఆర్... వెంకయ్యను ఆహ్వానించారు. భేటీ అనంతరం కేంద్ర మంత్రి విలేకరులతో మాట్లాడుతూ... ఇళ్ల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి భూ మి, లబ్ధిదారుల వివరాలను అందచేయాలని సూచించినట్లు పేర్కొన్నారు. మురికివాడల్లో రూ.లక్ష, సొంతంగా ఇళ్లు కట్టుకునేవారికి రూ.1.50 లక్షలు, రుణం కింద ఇళ్లు నిర్మించుకునేవారికి రూ.2.30 లక్షల సహకారం అందిస్తామన్నారు. సీఎం కేసీఆర్ త్వరలోనే ప్రతిపాదనలు అందచేస్తామని చెప్పినట్లు వివరించారు. తెలంగాణలోని 12 అమృత్ నగరాల్లో సిద్దిపేటను చేర్చామన్నారు. పవార్‌కు సీఎం జన్మదిన శుభాకాంక్షలు 75వ జన్మదినం సందర్భంగా ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్‌కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం శరద్ పవార్ నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటుకు శరద్ పవార్ సంపూర్ణ మద్దతు తెలిపారని గుర్తుచేశారు. ఒకట్రెండు రోజుల్లో ఎంపీలతో సమావేశం తెలంగాణ, ఏపీలో అసెంబ్లీ స్థానాల పెంపుపై మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ‘‘అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచుకోడానికి అవకాశం ఉంది. అయితే రాజ్యాంగాన్ని లేదా విభజన చట్టాన్ని సవరించడం విషయంలో గందరగోళంగా ఉంది. దీనిపై న్యాయశాఖ కార్యదర్శితో ఫోన్లో మాట్లాడాను. ఒకట్రెండు రోజుల్లో నేను, కేశవరావు, వినోద్ సమావేశమై అధ్యయనం చేస్తాం. అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపునకు సూత్ర రీత్యా అభ్యంతరం లేదు. విభజన చట్టంలో చిన్న లొసుగు ఉంది. ‘నాట్ విత్ స్టాండింగ్’ పదం వాడాల్సింది. కానీ అలా జరగలేదు’’ అని అన్నారు. హైకోర్టు విభజన విషయంలో ఇరు రాష్ట్రాల సీఎంలు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన తర్వాత.. ఆయన అంగీకారం తెలుపుతూ న్యాయశాఖకు లేఖ రాస్తే తదుపరి చర్యలు చేపడతామన్నారు. ఏపీలో విలీనం చేసిన ముంపు గ్రామాల్లో రహదారుల సమస్యపై ఇరు రాష్ట్రాల సీఎంలు మాట్లాడి ప్రతిపాదన పంపితే సానుకూలంగా స్పందిస్తామన్నారు. ఈ నెల 23 నుంచి నిర్వహిస్తున్న చండీయాగానికి రావాల్సిందిగా సీఎం ఆహ్వానించారని, తాను హాజరవుతానని చెప్పారు. తెలంగాణకు తక్కువ ఇళ్లు మంజూరు చేయడంపై ప్రశ్నించగా... రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన ప్రతిపాదనల మేరకే ఇళ్లు మంజూరు చేశామన్నారు. ప్రతిపాదన ఆలస్యానికి కేసీఆర్ కారణాలను చెప్పారన్నారు. డబుల్బెడ్రూం పథకం రూపకల్పన తర్వాత సమగ్ర ప్రతిపాదన పంపుతామని సీఎం చెప్పారన్నారు. రాష్ట్రంలోని ఎయిమ్స్‌కు వచ్చే ఏడాది నిధులు కేటాయిస్తామన్నారు. -
ఎన్నికల కమిషనర్‌గా ప్రకాశ్ రావత్
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషన్‌లో ఖాళీగా ఉన్న ఒక కమిషనర్ పదవి భర్తీ అయింది. ఎన్నికల కమిషనర్‌గా మధ్యప్రదేశ్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి ఓం ప్రకాశ్ రావత్ గురువారం నియమితులయ్యారు. ఆయన బాధ్యతలు చేపట్టినప్పట్నుంచి నియామకం అమల్లోకి వస్తుందని న్యాయశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రావత్ 2018 డిసెంబర్ వరకు పదవిలో ఉంటారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును ప్రకటించనున్న నేపథ్యంలో ఆయన నియామకం జరిగింది. 1953లో జన్మించిన రావత్ 1977 ఐఏఎస్ బ్యాచ్‌కి చెందినవారు. కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శిగా పనిచేసి గత డిసెంబర్లో రిటైర్ అయ్యారు. ముగ్గురు సభ్యులుండే ఎన్నికల సంఘంలో ప్రస్తుతం నసీం జైదీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా, అచల్ కుమార్ జోతి ఎన్నికల కమిషనర్‌గా ఉండడం తెలిసిందే. -
కోర్టులో ఇంటర్వ్యూలు ప్రారంభం
ఆదిలాబాద్ క్రైం : జిల్లాలోని న్యాయశాఖలో ఖాళీగా ఉన్న ఆఫీస్ సబ్ ఆర్డినేటర్ పోస్టుల భర్తీ కోసం బుధవారం అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. స్తానిక జిల్లా కోర్టులో జిల్లా జడ్జి గోపాలకృష్ణమూర్తి ఇంటర్వ్యూలు ప్రారంభించారు. మొదటి రోజు 400 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం వరకు ఇంటర్వ్యూలు కొనసాగాయి. కోర్టు ద్వారా కాల్ లెటర్స్ జారీ చేసిన అభ్యర్థులకు ముందుగా సర్టిఫికెట్లు పరిశీలించారు. అనంతరం ప్రత్యేక కమిటీ వీరిని ఇంటర్వ్యూ చేసింది.