ఎన్నికల కమిషనర్‌గా ప్రకాశ్ రావత్
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషన్‌లో ఖాళీగా ఉన్న ఒక కమిషనర్ పదవి భర్తీ అయింది. ఎన్నికల కమిషనర్‌గా మధ్యప్రదేశ్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి ఓం ప్రకాశ్ రావత్ గురువారం నియమితులయ్యారు. ఆయన బాధ్యతలు చేపట్టినప్పట్నుంచి నియామకం అమల్లోకి వస్తుందని న్యాయశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రావత్ 2018 డిసెంబర్ వరకు పదవిలో ఉంటారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును ప్రకటించనున్న నేపథ్యంలో ఆయన నియామకం జరిగింది.
1953లో జన్మించిన రావత్ 1977 ఐఏఎస్ బ్యాచ్‌కి చెందినవారు. కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శిగా పనిచేసి గత డిసెంబర్‌లో రిటైర్ అయ్యారు. ముగ్గురు సభ్యులుండే ఎన్నికల సంఘంలో ప్రస్తుతం నసీం జైదీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా, అచల్ కుమార్ జోతి ఎన్నికల కమిషనర్‌గా ఉండడం తెలిసిందే.