మాత్రలు మింగి..గొంతు కోసుకుని..
నేత కార్మికుడి ఆత్మహత్య..ఆర్థికఇబ్బందులే కారణం
సిరిసిల్ల టౌన్: మోతాదుకు మించి నిద్రమాత్రలు మింగాడు.. ఉదయం లేచి ఇంకా తాను చనిపోలేదని గ్రహించి బ్లేడుతో గొంతు కోసుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రా నికి చెందిన నేత కార్మికుడు గూడూరి సుదర్శన్(48) బుధవారం ఆత్మహత్య చేసు కున్నాడు. పట్టణంలోని నెహ్రూనగర్‌కు చెందిన గూడూరి సుదర్శన్ సాంచాలు నడిపి స్తుండగా భార్య రజిత బీడీలు చుడుతుంది. వస్త్ర పరిశ్రమలో సంక్షోభం నేపథ్యంలో అప్పు చేసి మోటార్ వైండింగ్ షాపు పెట్టుకున్నాడు. అదికూడా సరిగా నడవ కపోవడంతో నేత కార్మికుడిగా పని చేస్తున్నాడు. కుటుంబపోషణ, ఉపాధి కోసం చేసి న అప్పు రూ.3 లక్షలు వరకు చేరాయి.
ఆర్థిక ఇబ్బందులతో ఇంట్లో తరచూ గొడవలు కూడా జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి మోతాదుకు మించి నిద్రమాత్రలు మింగాడు. ఉదయం లేచి తాను చనిపోలేదని గ్రహించిన సుద ర్శన్ బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, అక్కడ చనిపోయాడు.