ఎమ్మెల్యేపై పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్: కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య ఎస్సీ కాదంటూ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఐజయ్య ఎస్సీ కులానికి చెందిన వారు కాదంటూ, తప్పుడు పత్రాలు సృష్టించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడంటూ పిటిషన్లో గుంపుల రవికుమార్ అనే వ్యక్తి పేర్కొన్నాడు. అయితే కేసు విచారణకు వచ్చే సమయానికి గుంపుల రవి కుమార్ అనారోగ్యంతో మృతిచెందడంతో కేసును న్యాయమూర్తి కొట్టేశారు.