గన్నీ సంచుల ఆవిష్కరణ
ఖమ్మం జెడ్పీసెంటర్: వాసవీక్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లక్ష గన్నీ సంచుల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం రాత్రి ప్రజ్ఞా సమావేశ మందిరంలో కలెక్టర్ లోకేష్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆరు లక్షల కుటుంబాలున్నాయని, ఒకొక్క కుటుంబానికి 3 సంచుల చొప్పున పంపిణీ చేయాలన్నారు. దీనికి వాసవీక్లబ్ నిర్వహకులు అంగీకరించారు. ముందస్తుగా ముద్రించిన లక్ష గన్నీ సంచులను పంపిణీ చేయగానే మిగిలిన వాటిని త్వరలో ప్రజలకు అందిస్తామన్నారు. తన సొంత గ్రామంలో ప్లాస్టిక్ వాడకం లేదని, ఆ విధంగా ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాలు చేపట్టాలని వివరించారు. కార్యక్రమంలో వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ జాతీయ అధ్యక్షుడు పబ్బా విజయ్‌కుమార్, ఇంటర్నేషనల్ వాసవిక్లబ్ అడిషనల్ వైస్ ప్రెసిడెంట్ గెల్లా కృష్ణవేణి, అడిషనల్ ట్రెజరర్ మధన్మోహన్, వరప్రసాద్, ఉమారాణి, జిల్లా ట్రెజరర్ వందనం సత్యనారాయణ పాల్గొన్నారు.