GUNTAKAL government hospital
-
పూర్తిస్థాయి విచారణ చేస్తాం: రమేశ్‌నాథ్
అనంతపురం: గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై విచారణ మొదలైంది. ‘మంట కలసిన మానవత్వం’ శీర్షికతో ‘సాక్షి’ గురువారం కథనంపై జిల్లా ఆస్పత్రుల కో ఆర్డినేటర్ డాక్టర్ రమేశ్‌నాథ్ స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి కొందరిపై చర్యలు తీసుకున్నామని, పూర్తిస్థాయి విచారణ ప్రారంభించినట్లు కో ఆర్డినేటర్ చెప్పారు. నడవలేని పరిస్థితిలో ఉన్న షేషెంట్‌కు వీల్ చెయిర్ ఇవ్వని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే స్టాఫ్ నర్సు విమలను సస్పెండ్ చేసిన ఆయన, ఇన్చార్జ్ సూపరింటెండెంట్ హరిప్రసాద్‌ను బాధ్యతల నుంచి తప్పించారు. డాక్టర్ గంగన్నకు ఆ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. గుంతకల్లులోని తిలక్‌నగర్ మదీనా మసీదు ప్రాంతానికి చెందిన శ్రీనివాసాచారి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నా డు. భర్తను శ్రీవాణి ఆస్పత్రికి బుధవారం తీసుకెళ్లింది. అక్కడి ప్రభుత్వ ఆస్పత్రిని ఎంత కోరినా స్ట్రెచర్ ఇవ్వక పోవడంతో భర్తను ఈడ్చుకుంటూనే మొదటి అంతస్తుకు తీసుకెళ్లింది. 'సాక్షి' కథనంతో స్పందించిన జిల్లా కో ఆర్డినేటర్ రమేశ్‌నాథ్ ఆ ఘటనకు కారణమైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
స్టాఫ్ నర్సుపై సస్పెన్షన్ వేటు
- గుంతకల్లు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ గంగన్న - ‘సాక్షి’ కథనం నేపథ్యంలో చర్యలు తీసుకున్న అధికారులు అనంతపురం మెడికల్: గుంతకల్లు ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సు విమలపై సస్పెన్షన్ వేటు పడింది. గుంతకల్లులోని తిలక్‌నగర్ మదీనా మసీదు ప్రాంతానికి చెందిన శ్రీనివాసాచారి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నా డు. అతన్ని భార్య శ్రీవాణి బుధవారం అక్కడి ప్రభుత్వా స్పత్రికి తీసుకెళ్లింది. స్ట్రెచర్ ఇవ్వాలని సిబ్బందిని కోరినా ఎవరూ పట్టించుకోకపో వడంతో మొదటి అంతస్తులోకి భర్తను ఈడ్చుకుంటూనే తీసుకెళ్లింది. దీనిపై ‘మంట కలసిన మానవత్వం’ శీర్షికతో ‘సాక్షి’ గురువారం కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. డీసీహెచ్ఎస్ రమేష్‌నాథ్ గురువారం గుంతకల్లు వెళ్లి ఘటనపై ఆరా తీశారు. సీఎం పేషీ నుంచి అధికారులు కూడా ఘటనపై డీసీహెచ్ఎస్ను ఆరా తీశారు. కలెక్టర్ శశిధర్‌తో రమేష్‌నాథ్ గురువారం రాత్రి సమావేశమై ఘటన వివరాలను తెలియజేశారు. కమిషనర్ దుర్గాప్రసాద్‌కు కూడా వివరించారు. దీంతో స్టాఫ్ నర్సు విమలను సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఆదేశాలు జారీ చేసినట్లు రమేష్‌నాథ్ తెలిపారు. ఇన్చార్జ్ సూపరింటెండెంట్ హరిప్రసాద్‌ను బాధ్యతల నుంచి తప్పించారు. డాక్టర్ గంగన్నకు ఆ బాధ్యతలు అప్పగించారు.