స్టాఫ్ నర్సుపై సస్పెన్షన్ వేటు | Staff nurse on Suspended | Sakshi
Sakshi News home page

స్టాఫ్ నర్సుపై సస్పెన్షన్ వేటు

Published Fri, Nov 18 2016 1:32 AM | Last Updated on Mon, Sep 4 2017 8:22 PM

స్టాఫ్ నర్సుపై సస్పెన్షన్ వేటు

స్టాఫ్ నర్సుపై సస్పెన్షన్ వేటు

- గుంతకల్లు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ గంగన్న
- ‘సాక్షి’ కథనం నేపథ్యంలో చర్యలు తీసుకున్న అధికారులు
 
 అనంతపురం మెడికల్: గుంతకల్లు ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సు విమలపై సస్పెన్షన్ వేటు పడింది. గుంతకల్లులోని తిలక్‌నగర్ మదీనా మసీదు ప్రాంతానికి చెందిన శ్రీనివాసాచారి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నా డు. అతన్ని భార్య శ్రీవాణి బుధవారం అక్కడి ప్రభుత్వా స్పత్రికి తీసుకెళ్లింది. స్ట్రెచర్ ఇవ్వాలని సిబ్బందిని కోరినా ఎవరూ పట్టించుకోకపో వడంతో మొదటి అంతస్తులోకి భర్తను ఈడ్చుకుంటూనే తీసుకెళ్లింది. దీనిపై ‘మంట కలసిన మానవత్వం’ శీర్షికతో ‘సాక్షి’ గురువారం కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

డీసీహెచ్‌ఎస్ రమేష్‌నాథ్ గురువారం గుంతకల్లు వెళ్లి ఘటనపై ఆరా తీశారు. సీఎం పేషీ నుంచి అధికారులు కూడా ఘటనపై డీసీహెచ్‌ఎస్‌ను ఆరా తీశారు. కలెక్టర్ శశిధర్‌తో  రమేష్‌నాథ్ గురువారం రాత్రి సమావేశమై ఘటన వివరాలను  తెలియజేశారు. కమిషనర్ దుర్గాప్రసాద్‌కు కూడా వివరించారు. దీంతో స్టాఫ్ నర్సు విమలను సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఆదేశాలు జారీ చేసినట్లు రమేష్‌నాథ్ తెలిపారు. ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ హరిప్రసాద్‌ను బాధ్యతల నుంచి తప్పించారు. డాక్టర్ గంగన్నకు ఆ బాధ్యతలు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement