'తిరుపతి- గుంతకల్' రైలుకు తప్పిన ముప్పు
అనంతపురం: తిరుపతి- గుంతకల్ ప్యాసింజర్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. గుంతకల్ హనుమాన్ జంక్షన్ వద్ద ఇంజన్ నుంచి బోగీలు విడిపోయాయి. కిలోమీటర్ దూరం వెళ్లిన తర్వాతగానీ డ్రైవర్ ఈ విషయాన్ని గుర్తించలేకపోయాడు.
అనుకోని సంఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది కొద్దిసేపటి తర్వాత మరో ఇంజన్ ద్వారా ప్రయాణికులను తరలించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.