hafiz baba nagar
-
Hyderabad: ప్రేమ పేరుతో వేధింపులు.. నడిరోడ్డుపై మహిళపై దాడి
సాక్షి, హైదరాబాద్: నగరం నడిబొడ్డున దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు ప్రేమ పేరిట వివాహితను వేధిస్తూ.. ఆమె ఒప్పుకోకపోవడంతో కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన కాంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. హఫీజ్ బాబా నగర్లో ఓ రెస్టారెంట్ ముందు నిల్చొని ఉన్న నూరు భాను అనే మహిళపై కత్తితో దాడి చేశాడు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే మహిళ వెనుక నుంచి విచక్షణ రహితంగా కత్తితో పొడిచి గాయపరిచాడు. రోడ్డుపై అంత ఘోరం జరుగుతున్నా ఎవరూ అడ్డుకోకపోవడం బాధించే విషయం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపుమడుగులో పడి ఉన్న బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నిందితుడిని హబీబ్‌గా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీలో రికార్డవ్వడంతో వైరల్‌గా మారాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సంతోష్ నగర్ ఏసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. ‘కాంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎ–బ్లాక్ ప్రాంతానికి చెందిన నూర్ భాను (40) భర్త ఇంతియాజ్ రెండేళ్ల క్రితం మృతి చెందాడు. ప్రస్తుతం నూర్ భాను కుమారుడితో కలిసి నివాసముంటోంది. కొంతకాలంగా అదే ప్రాంతానికి చెందిన షేక్ నసీరుద్దీన్ ఆలియాస్ హబీబ్ (32) ప్రేమ పేరుతో ఆమెను వేధింపులకు గురి చేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం నూర్ భాను ఉమర్ రెస్టారెంట్ ముందుకు రాగానే.. షేక్ నసీరుద్దీన్ వెనుక నుంచి యాక్టివా ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమె ముఖం, చేతులు, ఇతర ప్రాంతాల్లో కత్తితో దాడి చేశాడు. బాధితురాలు అక్కడే స్పృహ కోల్పోయింది. చదవండి: హైదరాబాద్‌లో దారుణం.. ఇల్లు అద్దెకు ఇస్తానంటూ యువతిని బంధించి.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే మహిళను ఓవైసీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాం. నిందితుడిని పట్టుకోవడానికి అయిదు బృందాలు ఏర్పాటు చేశాం. గతంలోనూ హబీబ్‌పై నూర్ భాను ఫిర్యాదు చేసింది. 2021లో కేసు నమోదు చేసి హాబీబ్‌ను అరెస్ట్ చేశాం’ అని ఏసీపీ పేర్కొన్నారు. అదే విధంగా చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ బాధితురాలిని పరామర్శించి నిందితుడికి శిక్షపడేలా చూస్తామని హామీ ఇచ్చిధైర్యం చెప్పారు. చదవండి: నంద్యాలలో నిత్య పెళ్లి కూతురు.. ఒకరికి తెలియకుండా మరొకరిని.. ఇలా.. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
హైదరాబాద్ : వివాహేతర సంబంధం నేపధ్యంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల ప్రకారం.. హఫీజ్ బాబా నగర్‌లోని రియాజ్ హోటల్ వద్ద ఆదివారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఇజాజ్(28) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. దగ్గరి బంధువులే కత్తితో పొడిచి చంపినట్లు స్థానికుల సమాచారం. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. -
'బాలికకు ఆరు పెళ్లిళ్లు'
చిన్నారుల రక్షణ కోసం చేస్తున్న చట్టాలు చట్టుబండలవుతున్నాయి... డబ్బుల కోసం కక్కుర్తిపడి కొందరు నీచులు ముక్కుపచ్చలారని బాలికల జీవితాలను నాశనం చేస్తున్నారు... ధనదాహంతో తండ్రి, సవతి తల్లి బాలికకు కాంట్రాక్ట్ పద్ధతిపై అరబ్‌షేక్‌లతో ఆరు వివాహాలు జరిపించిన ఘటన బుధవారం వెలుగు చూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రెయిన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... హఫీజ్‌బాబానగర్‌కు చెందిన బాలిక (17)ను తండ్రి అక్బర్, సవతి తల్లి నిలోఫర్, మేనత్త మెహర్లు డబ్బుల కోసం అరబ్ షేక్‌లకు ఇచ్చి పెళ్లి జరిపించాలని నిర్ణయించారు. దళారీ రహానా బేగాన్ని సంప్రదించి 2012లో నాగపూర్‌కు చెందిన బషీర్‌తో రూ.30 వేలు తీసుకొని కాంట్రాక్టు పద్ధతిని వివాహం జరిపించారు. తర్వాత రూ.40 వేలు తీసుకొని పూణెలో జమాల్ అనే వ్యక్తితో పెళ్లి జరిపించారు. ముంబైలో ఇదే విధంగా మరో రెండు వివాహాలు జరిపించారు. ఫిబ్రవరి 2013లో మరో పెళ్లి జరిపించారు. ఈనెల 14న సూడాన్‌కు చెందిన షేక్ మన్నాన్(50) నుంచి రూ. లక్ష తీసుకొని అతనితో పెళ్లి జరిపించారు. ఈనెల 15న సదరు షేక్ బాలికను నగరంలోని ఓ లాడ్జికి తీసుకెళ్తుండగా...బాలిక తప్పించుకుంది. విషయాన్ని కంచన్‌బాగ్‌లో ఉండే ఇతర కుటుంబ సభ్యులకు తెలిపి, వారి సహకారంతో పీయూసీఎల్ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జయ వింధ్యాల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జయ వింధ్యాల బాలికతో కలిసి బుధవారం రెయిన్‌బజార్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. కాగా ఘటన జరిగిన స్థలం తమ పరిధిలో కాదని రెయిన్బజర్ పోలీసులు మొదట మొండికే శారు. అయితే, విషయం డీసీపీ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆదేశాలతో కేసు నమోదు చేశారు. ఈ కేసును కంచన్‌బాగ్‌కు బదిలీ చేస్తామని రెయిన్‌బజార్ పోలీసులు తెలిపారు. పాతబస్తీలో పేదరికం, నిరక్ష్యరాస్యత కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని జయ వింధ్యాల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మను డిమాండ్ చేశారు.