హైదరాబాద్ : వివాహేతర సంబంధం నేపధ్యంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల ప్రకారం.. హఫీజ్ బాబా నగర్‌లోని రియాజ్ హోటల్ వద్ద ఆదివారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఇజాజ్(28) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. దగ్గరి బంధువులే కత్తితో పొడిచి చంపినట్లు స్థానికుల సమాచారం. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.