Hair cuting
-
నెత్తిన భగ్గుమంటున్న మంటలు.. ఇప్పుడు ఇదో స్టైల్
సాక్షి, కైలాస్‌నగర్: ఆదిలాబాద్ పట్టణంలోని కొత్త రకం ఫైర్ హెయిర్ కటింగ్ అందుబాటులోకి వచ్చింది. ప్రధాన నగరాల్లోనే ఉండే ఈ పద్ధతి ఇప్పుడు పట్టణాల్లో అందుబాటులోకి రావడంతో యువత ఆసక్తి చూపున్నారు. స్థానిక భుక్తాపూర్‌లోని ఐస్ ఫ్యాక్టరీ సమీపంలో అమెరికన్ హెయిర్ కటింగ్ షాపులో శేర్లవార్ నర్సింహులు అనే యువకుడు జట్టుకు నిప్పు పెట్టి కొత్త తరహా కటింగ్ చేస్తున్నాడు. హైదరాబాద్‌లో ఫైర్ కటింగ్‌లో ప్రావీణ్యం పొంది సొంతగా క్షవరశాలను ఏర్పాటు చేసుకున్నాడు. మహారాష్ట్రలోని పూణే నగరం నుంచి హెయిర్ ఫైర్ లిక్విడ్‌ను తెప్పిస్తున్నాడు. దీంతో తను ఉపాధి పొందుతూ.. మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఫైర్ కటింగ్ రూ.500 రింగులు తిరిగిన జట్టుకు ప్రత్యేకమైన లిక్విడ్ పెట్టి నిప్పంటిస్తాడు. ఈరకం కట్టింగ్‌కు రూ.500 చార్జీ అవుతుంది. పిట్టెగూడులా ఉన్న వెంట్రుకలు ఫైర్ కటింగ్‌తో ఒక్కసారిగా సిల్కీ స్మూత్ హెయిర్‌గా మారుతుంది. దీంతో ఈ తరహ కట్టింగ్ చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. మొదటి సారి కొత్త తరహా కటింగ్ చేసుకున్న వారు దాని ప్రాధాన్యత తెలుసుకుని తరువాత ఫైర్ కటింగ్ చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఫైర్ కటింగ్ బాగుంది ఫైర్ కటింగ్ అంటే మొదట్లో కొంత బయమేసింది. తలపై నిప్పు పెట్టడంతో కొద్దిపాటి వేడి కావడంతో బయపడిన. తరువాత నీటితో తలను కడగానే చల్లగా ఉంది. వెంట్రుకలు చాలా స్మూత్, సాఫ్ట్‌గా అయ్యాయి. ఫైర్ కటింగ్ చాలా బాగుంది. – అజార్ ఖాన్, ఇందిరానగర్ చాలా మందికి తెలువదు ఆదిలాబాద్‌లో ఫైర్ కటింగ్ చేస్తున్నట్లు చాలా మందికి తెలువదు. ఈమధ్య కాలంలోనే కొత్తగా ఫైర్ కటింగ్ చేస్తున్నారని తెలిసి వచ్చాను. కొత్త తరహా కటింగ్‌తో ఎలాంటి నష్టం ఉండదు. వెంట్రుకలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. – సాయికిరణ్, భీంపూర్ హైదరాబాద్‌లో నేర్చుకున్న హైదరాబాద్‌లోని నేచురల్ హెయిర్ సెల్యూన్లో పనిచేసిన సమయంలో ఫైర్ కటింగ్ గురించి తెలుసుకున్నాను. అక్కడ అనుభవాజ్ఞుల వద్ద శిక్షణ పొంది నేర్చుకున్నాను. మొదటి సారి ఫైర్ కటింగ్ చేసుకుంటున్న వారు బయపడుతారు. తరువాత ఈపద్ధతి కటింగ్ చేసుకునేందుకు ఆసక్తి చూపుతారు. – శేర్లవార్ నర్సింహులు, యజమాని -
ఒక్క హెయిర్ కటింగ్‌తో 60 వేల రూపాయలు!
భోపాల్: ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ కొందరు రాజకీయ నాయకులు మాత్రం సేవా భావంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌కు చెందిన రోహిదాస్ హెయిర్ సెలూన్ షాప్ పెట్టడానికి మధ్యప్రదేశ్ అటవీశాఖ మంత్రి విజయ్ షాను ఆశ్రయించాడు. అయితే కటింగ్‌లో రోహిదాస్ నైపుణ్యం తెలుసుకోవడానికి హెయిర్ కటింగ్, షేవింగ్ చేయమని రోహిదాస్‌ను మంత్రి విజయ్ షా కోరారు. దీంతో కరోనా నేపథ్యంలో మాస్క్ ధరించి అద్భుతంగా కటింగ్ చేశాడు. రోహిదాస్ నైపుణ్యానికి ముగ్ధుడైన మంత్రి సంతోషంతో రూ.60,000 ఆర్థిక సహాయం చేశారు. ఈ అంశంపై విజయ్ షా స్పందిస్తూ కరోనా ఉదృతి నేపథ్యంలో గత కొన్ని నెలలుగా యువత ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. కరోనా ప్రభావం ఉన్నా నిబంధనలు (మాస్క్‌లు) పాటించి సంతోషంగా హెయిర్ కటింగ్ చేసుకోవచ్చని అన్నారు. మరోవైపు చిన్న వ్యాపారాలు చేయాలనుకునే యువతకు ప్రభుత్వం రుణ సహాయం చేస్తుందని పేర్కొన్నారు. -
హెయిర్‌కట్‌కు ఆధార్ తప్పనిసరి!
సాక్షి, చెన్నై : తమిళనాడులో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వైరస్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కేసుల సంఖ్య మాత్రం అదుపులోకి రావడంలో లేదు. ఈ క్రమంలోనే కంటైన్మెంట్ జోన్లో లాక్‌డౌన్‌ను జూన్ 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే క్రమంలో పలు దుకాణాలకు ఆంక్షల నుంచి సడలింపులు సైతం ఇచ్చింది. దీనిలో భాగంగానే రెండు నెలలుగా మూతబడ్డ సెలూన్ (కటింగ్) షాపులు కూడా తెరుచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో సెలూన్ల ద్వారా వైరస్ సోకినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇకపై సెలూన్లుకు వచ్చే వారికి ఆధార్ కార్డు తప్పినిసరి చేసింది. (కరోనా: రికార్డు స్థాయిలో కేసులు) చెన్నైలో హెయిర్‌కట్ చేయించుకోవాలి అనుకునే వారు మాస్క్‌తో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ వెంట తెచ్చుకోవాలని ప్రభుత్వం నిబంధన విధించింది. దీనిపై వివరణ కూడా ఇచ్చింది. సెలూన్ల ద్వారా ఎవరికైనా వైరస్ వ్యాప్తి చెందితే ఆ షాపుకు వచ్చిన వారిని గుర్తించడం అధికారులకు సులభం అవుతుందని వివరించింది. ఆధార్ వివరాల ద్వారా వ్యక్తులను వెంటనే గుర్తించి.. వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని ప్రభుత్వ తెలిపింది. అలాగే ప్రభుత్వ ఆదేశాలను పాటించిన షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఉత్తర్వులో పేర్కొంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 23వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. కరోనా కేసులు అత్యధికంగా నమోదైన మహారాష్ట్ర తరువాత తమిళనాడు రెండో స్థానంలో ఉంది. -
క్వారంటైన్ కటింగ్
లాక్ డౌన్ సమయంలో సెలూన్స్ అన్నీ బంద్ కావడంతో సరదాగా కత్తెర్లు పడుతున్నారు కొందరు. ఆ మధ్య తన భర్త విరాట్ కోహ్లీ హెయిర్ కట్ చేశారు అనుష్కా శర్మ. తాజాగా కుమారుడు తైమూర్ అలీ ఖాన్‌కి హెయిర్ కట్ చేశారు సైఫ్ అలీ ఖాన్. కొడుకు జట్టుని భర్త కత్తిరిస్తున్న ఫొటోను కరీనా కపూర్ తన ఇన్ స్టా గ్రామ్‌లో పంచుకున్నారు. -
కరోనా సరే.. చైనాలో మరో పోరు
జుట్టు ఆడవారికి అందాన్నిస్తుంది. వారిని ఆకర్షణీయంగా మారుస్తుంది. జుట్టుని తీయడమంటే ఒకరకంగా మహిళల్ని అవమానించడమే. కానీ ముంచుకొచ్చింది మామూలు ముప్పు కాదు. కరడుగట్టిన కరోనా. అందులోనూ పెద్ద జుట్టు ఉంటే వైరస్ ఎక్కడ వ్యాపిస్తుందోనని చైనాలో అధికారులు కరోనా వ్యాధిగ్రస్తులకి సేవచేసే మహిళా నర్సులకి జుట్టు కట్ చేస్తున్నారు. అంతేకాదు వారు నిరంతరం సేవలు అందించడం కోసం పీరియడ్స్ రాకుండా పిల్స్ ఇస్తున్నారు. ఇదంతా మహిళలపై చూపిస్తున్న వివక్షేనంటూ అంతర్జాతీయ మహిళాదినోత్సవ వేళ చైనా ఉమెన్ ఫెడరేషన్ పోరుబాట పట్టింది. కరోనా వ్యాధిగ్రస్తులకు సేవ చేయడానికి ధరించే ఐసోలేషన్ సూట్ ధరించడమే ఇబ్బంది అనుకుంటే.. రేయింబవళ్లు పని చేయిస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్నవారి అవసరాలన్నీ అంచనా వేసిన చైనా ప్రభుత్వం అన్నీ అందించింది కానీ మహి ళలకి శానిటరీ ప్యాడ్స్ సరఫరా చేయలేకపోయింది. దీంతో నెలసరి వచ్చినప్పుడు మహిళా సిబ్బంది ఎన్నో పాట్లుపడ్డారు. దీనికి విరుగుడుగా నెలసరి వాయిదా వేయడానికి 200 బాటిల్స్ పిల్స్ అధికారులు సరఫరా చేశారు. సహజసిద్ధంగా వచ్చే పీరియడ్స్‌ని ఆపేస్తే హార్మోన్లపై ప్రభావం చూపిస్తుందంటూ మహిళా నర్సులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనాలో స్వదేశీయంగా వాడే ట్విట్టర్ తరహా సామాజిక మాధ్యమమైన వైబోలో మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు వైరల్‌గా మారాయి. కరోనాపై పోరాటానికి సమాంతరంగా ఇప్పుడు మరో పోరాటం జరుగుతోంది. అవును మరి అక్కడ నర్సుల్ని కమాండ్ చేస్తున్న వారంతా మగవారే. వాళ్లకి ఆడవాళ్ల కష్టాలెలా అర్థమవుతాయి?. -
భక్తులకు క్షవర భారం
సాక్షి, విజయవాడ: భక్తులపై రాష్ట్ర ప్రభుత్వం మరో భారం మోపింది. ప్రముఖ దేవాలయాల్లో కేశఖండన చార్జీలను పెంచింది. టికెట్ రేటును 25 రూపాయలుగా నిర్ణయించింది. రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన దేవాలయాల్లో ఇప్పటికే ఈ చార్జీల వసూళ్లు మొదలయ్యాయి. గతంలో విజయవాడ దుర్గగుడిలో, శ్రీశైలం మల్లికార్జునస్వామి దేవాలయాల్లో కేశఖండనకు రూ. 20 చార్జీ వసూలు చేసేవారు. ద్వారకా తిరుమలలో రూ.17, అన్నవరం, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ గుడి, సింహాచలం, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాల్లో రూ.15 చొప్పున చార్జీలు ఉండేవి. ఇప్పుడు ఈ దేవాలయాల్లో కేశఖండన టిక్కెట్ల ధరను రూ. 25కు పెంచుతూ ఈ మొదటి వారంలో దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయా ఆలయాల్లో కొద్ది రోజులుగా కొత్త రేట్లు వసూలు చేస్తున్నారు. భక్తుల నుంచి వసూలు చేసి నాయీ బ్రాహ్మణులకు కమీషన్‌గా చెల్లించాలనే ప్రభుత్వ నిర్ణయంతో కేశఖండన రేట్లు పెంచినట్లు చెబుతున్నారు. అయితే కేశఖండన బ్లేడ్ చార్జీలను దేవస్థానాలు భరించనున్నాయి. తలనీలాలు విక్రయించడం ద్వారా ప్రధాన ఆలయాలకు కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి గత ఏడాది తలనీలాలు వేలం ద్వారా రూ. 6.09 కోట్లు ఆదాయం సమకూరింది. వాస్తవంగా ఈ ఆదాయం నుంచి కనీసం పది శాతం తీసినా భక్తులపై భారం వేయకుండా నాయీ బ్రాహ్మణులకు కమీషన్ పెంచవచ్చు. ప్రధాన దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులు తమకు ప్రతి నెలా కనీసం రూ.15 వేలు వేతనం ఇవ్వాలని ఇటీవల ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తమ డిమాండ్‌ను విన్నవించారు. ఆ సమయంలో వారిపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షురకుల కమీషన్‌ను రూ. 25 పెంచారు. ప్రభుత్వం అటు నాయీ బ్రాహ్మణులకు సరైన న్యాయం చేయక, ఇటు భక్తులపై భారం మోపడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. టిక్కెట్ చార్జీలను కనీసం రూ. 20కు తగ్గించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. -
విద్యార్థుల జుట్టు కత్తిరించిన పాఠశాల యజమాన్యం
బెళగావి (సాక్షి,బెంగళూరు): అల్లరి చేస్తున్నారంటూ 20 మంది విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు జుట్టు కత్తిరించిన ఘటన సోమవారం బెళగావి తాలూకాలో చోటు చేసుకుంది. తాలూకాలోని కాకతి గ్రామంలో సెయింట్‌జాన్స్ పాఠశాల యజమాన్యం స్కూల్లో పిల్లలు అల్లరి చేస్తూ క్రమశిక్షణ పాటించడం లేదనే కారణంతో 20 మంది పిల్లల జుట్టు కత్తరించింది. పిల్లల ద్వారా విషయం తెలుసుకున్న పిల్లల తల్లితండ్రులు పాఠశాలకు చేరుకొని యజమాన్యాన్ని నిలదీయగా పాఠశాల ముఖ్యోపాధ్యాయుడు పిల్లల తల్లితండ్రులను బెదిరించారు. అంతేకాకుండా దీనిపై ప్రశ్నించడానికి వెళ్లిన స్థానిక మీడియా ప్రతినిధులు కూడా పాఠశాల యజమాన్యం బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. -
జుట్టు జగడం..
సాక్షి ప్రతినిధి, వరంగల్ : మేడారం జాతర సమయం దగ్గర పడుతున్నా తలనీలాలు సేకరించే పని ఎవరికి అప్పగించాలనే అంశం ఓ కొలిక్కి రాలేదు. గత జాతరల్లాగే నామినేషన్ పద్ధతినే కొనసాగించాలని పూజారుల సంఘం కోరుతుండగాæ. టెండర్‌తో మరింత ఆదాయం సమకూరుతుందని దేవాదాయశాఖ వాదిస్తోంది. మేడారం జాతర 1967లో దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. అప్పటి నుంచి దేవాదాయశాఖ పర్యవేక్షణలో జాతర సాగుతోంది. జాతరలో హుండీ ద్వారా సమకూరే ఆదాయంలో 33 శాతాన్ని పూజారుల సంఘానికి చెల్లిస్తున్నారు. అదేవిధంగా.. జాతరలో భక్తులు మొక్కుగా సమర్పించే తలనీలాలను సేకరించే పనిని నామినేషన్ పద్ధతిపై పూజారుల సంఘానికి అప్పగిస్తున్నారు. ఈ తలనీలాల సేకరణ ద్వారా పూజారుల సంఘానికి మరికొంత ఆదాయం సమకూరుతోంది. గత రెండు జాతరల (2014, 2016) నుంచి తలనీలాల సేకరణ పనులను నామినేషన్ పద్ధతిలో పూజారుల సంఘానికి అప్పగించడంపై దేవాదాయశాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో తలనీలాలకు డిమాండ్ ఉండడంతో నామినేషన్ పద్ధతిన పూజారుల సంఘానికి ఇవ్వకుండా.. టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్ల మధ్య పోటీ పెరిగి ఎక్కువ «ఆదాయం వస్తుందని దేవాదాయ శాఖ అంచనా వేస్తోంది. టెండర్లు నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయంలో 33 శాతం పూజారుల సంఘానికి ఇస్తామని చెబుతోంది. చేదు అనుభవాలు.. టెండర్ల పద్ధతిలో కాంట్రాక్టర్లు రింగైతే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందని పూజారుల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. గతంలో 2004, 2006 జాతర సమయాల్లో తలానీలాల సేకరణకు టెండర్లు పిలిస్తే పది లక్షలకు మించి ధర రాలేదు. దీంతో దేవాదాయశాఖకు వచ్చే రాబడి తగ్గిపోయింది. ఫలితంగా తమకు వచ్చే 33 శాతం ఆదాయంపై కోత పడుతోందని పూజారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టెండర్ల పద్ధతిలో చేదు అనుభవాలు ఎదురుకావడంతో 2008 జాతర నుంచి మళ్లీ నామినేషన్ పద్ధతిని అమల్లోకి తెచ్చారు. మళ్లీ విఫలమైన ప్రయోగాన్ని తమ నెత్తిన ఎందుకు రుద్దుతారంటూ పూజారుల సంఘం వాదిస్తోంది. మార్కెట్లో ఉన్న డిమాండ్‌కు తగ్గట్లుగా సరైన ధర చెల్లిస్తూ పనులు దక్కించుకుంటున్నామని వారు అంటున్నారు. 2016 జాతరకు రూ. 1.5 కోట్లు, 2014 జాతరలో కోటి రూపాయలు చెల్లించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రాధాన్యం తగ్గిస్తున్నారు మేడారం జాతరలో రానురాను తమకు ప్రాధాన్యం తగ్గిపోతోందని సమ్మక్క–సారలమ్మ పూజారులు ఆందోళన చెందుతున్నారు. క్రమంగా హిందు మత ప్రభావానికి తోడు జాతరలో వ్యాపార ధోరణి పెరిగిపోతోందని చెబుతున్నారు. వీటి కారణంగా తమ ఆచారాలకు ప్రాధాన్యం తగ్గుతుందన్న ఆవేదన ఆదివాసీల నుంచి వ్యక్తమవుతోంది. తమ చేతి నుంచి ఒక్కో వ్యవహారాన్ని క్రమక్రమంగా దేవాదాయ శాఖ దూరం చేస్తోందని, అందులో భాగంగా ఈ జాతరలో తలనీలాల పనులను తమకు కాకుండా చేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపిస్తున్నారు. జాతర గడువు సమీపిస్తున్నా ఏ విషయం తేల్చకపోవడం తమను అవమానించడమేనని గిరిజన పూజారులు అంటున్నారు. తలనీలాల సేకరణ విషయంలో 2014 జాతర సందర్భంగా దేవాదాయశాఖ, పూజారుల సంఘానికి మధ్య ఘర్షణ వాతావరణ ఏర్పడింది. దీంతో తలనీలాల పనులు తమకు కేటాయించకుంటే జాతర పనులకు సహకరించబోమంటూ అప్పుడు పూజారుల సంఘం సమ్మె నోటీసు కూడా ఇచ్చింది. మరోసారి అదే తరహా పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశం ఉంది. -
నాకు నువ్వు.. నీకు నేను
విద్యార్థుల క్షవరాల నిధులు గోల్మాల్ పాడేరు: మన్యంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల హెయిర్ కంటింగ్ ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు వార్డెన్స్ కైంకర్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా విద్యార్థులు నాకు నువ్వు.. నీకు నేను అన్న చందంగా ఒకరినొకరు హెయిర్ కంటింగ్ చేసుకుంటున్నారు. మన్యంలోని 11 మండలాల్లో 66 గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలు, 11 బాలుర వసతి గృహాలు ఉన్నాయి. వీటిల్లో దాదాపు 22 వేలు మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. వీరి ఒక్కొక్కరికి నెలకు హెయిర్ కంటింగ్ కోసం ప్రభుత్వం రూ. 12లు అందిస్తోంది. ఏడాదిలో రెండు, మూడు పర్యాయలు నిధులు విడుదల చేస్తోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా. ఈ నిధులతో ఏ ఒక్క ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు కంటింగ్ చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. విద్యార్థులే సొంత డబ్బులతో హెయిర్ కంటింగ్ చేసుకుంటున్నట్లు పరిశీలనలో వెల్లడైంది. సెలవులకు ఇళ్లకు వె ళ్లినప్పుడు ఇంటి వద్ద కంటింగ్ చేసుకుని వస్తున్నామని మరికొందరు విద్యార్థులు చెబుతున్నారు. మరికొన్ని పాఠశాలల్లో విద్యార్థులే ఒకరినొక రు హెయిర్ కంటింగ్ చేసుకుంటూ కనిపించారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులకు హెయిర్ కంటింగ్ ఛార్జీలు అమలు చేస్తున్నారు. గిరిజన ఆశ్రమాలు వద్దకు వచ్చే సరికి ఈ నిధులు వార్డెన్లు జేబుల్లో వేసుకుంటున్నారనేది తేటతెల్లం అవుతోంది.