hairstylist
-
జుట్టుకి గుడ్లు, పెరుగు అప్లై చేయడం మంచిదేనా..?
కురుల ఆరోగ్యం కోసం పెరుగు, మెంతులు, గుడ్లు వంటివి అప్లై చేస్తుంటారు. ఇవి ఆరోగ్యానికి మంచివని నిపుణులు కూడా సిఫార్సు చేస్తుంటారు. అంతెందుకు నీతా అంబానీ, జాన్వీ కపూర్, అలియా భట్ వంటి ప్రముఖులు కూడా తమ అందమైన శిరోజాల సీక్రెట్ ఇదేనని పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు కూడా. అయితే సెలబ్రిటీ హెయిర్‌స్టైలిస్ట్ అమిత్ ఠాకూర్ ఇలా గుడ్లు, పెరుగు కురులకు అప్లై చేయడం వల్ల నిజంగా ప్రయోజనం ఉంటుందా..? అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలా జుట్టుకి కండిషనర్‌గా అవి రాయడం వల్ల ఏమవుతుందో కూడా వెల్లడించారు. ఇంతకీ ఠాగూర్ ఏమన్నారంటే..జుట్టుకి పెరుగు, గుడ్లు అప్లై చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుందనేది అవాస్తవమని చెప్పారు. ఇది రాయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండదని తెలిపారు. ఇక్కడ పెరుగులో పుష్కలంగా ఉండే లాక్టిక్ యాసిడ్ జుట్టులోని పీహెచ్‌ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. మంచి కండిషనర్‌గా ఉంటుంది. అయితే జుట్టు నష్టాన్ని రిపేర్ చేయదని అన్నారు. అలాగే గుడ్డులో విటమిన్లు, ప్రోటీన్లు, కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. దీన్ని అప్లై చేయడం వల్ల శిరోజాలు మృదువుగా ఉండి మెరుస్తూ ఉంటుంది. అయితే శాశ్వతమైన మార్పును కలిగించదు. ఈ సహజసిద్ధమైన వాటితో తయారైన ఉత్పత్తులు కురులను ఆరోగ్యంగా పెరిగేలా చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయని అన్నారు. మన బడ్జెట్‌కి అనుగుణంగా కురులు చూడటానికి అందంగా ఆకర్షణీయంగా కనిపించాలంటే ఇంట్లో దొరికే సహజసిద్ధమైన పెరుగు, గుడ్లు వంటి వాటిని కండిషనర్లుగా ఉపయోగించొచ్చని చెప్పారు.కానీ జుట్టు ఒత్తుగా, ధృడంగా పెరిగేందుకు, డ్యామేజ్ అయిన జుట్టుని రిపేర్ చేసేందుకు మాత్రం ఇవి అస్సలు సరిపోవని తేల్చి చెప్పారు హెయిర్‌స్టైలిస్ట్ ఠాగూర్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది కూడా. View this post on Instagram A post shared by Amit Thakur (@amitthakur_hair) (చదవండి: నిద్రపోతున్నప్పుడే బెల్లీఫ్యాట్‌ని కరిగించే బెడ్‌టైమ్ 'టీ'..!) -
Aanchal Morwan: సిగ ధగ నైపుణ్యం
ఒత్తయిన తలకట్టుతోనే అందం, ఆకర్షణ! ఆరోగ్యకరమైన జుట్టుంటే ఎన్ని సోకులైనా పోవచ్చు!అలా సెలబ్రిటీల హెయిర్‌ని హెల్దీగా ఉంచుతూ .. ఆన్‌స్క్రీన్ పాత్రలకు తగ్గట్టు, ఆఫ్ స్క్రీన్ వేడుకలకు సూట్ అయ్యేట్టు కేశాలను అలంకరిస్తూ, తారల మీద నుంచి తల తిప్పుకోనివ్వకుండా చేసేది హెయిర్ స్టయిలిస్ట్లే! ఆ లిస్ట్‌లో.. బాలీవుడ్ జపించే పేరు ఆంచల్ మోర్వానీ!ఇన్‌స్టా హ్యాండిల్ ‘హాట్ హెయిర్ బెలూన్’తో ప్రసిద్ధి!జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, కృతి సనన్, దీపికా పదుకోణ్, తృప్తి డిమ్రీ, నోరా ఫతే, కియారా ఆడ్వాణీ, సుహానా ఖాన్, అనన్యా పాండే, సారా అలీ ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, కరీనా కపూర్ ఖాన్, కరిశ్మా కపూర్, డయానా పెంటీ, శనాయా కపూర్, దిశా పాట్నీ, మృణాల్ ఠాకూర్, రశ్మికా మందన్నా, మిథిలా పాల్కర్, యామీ గౌతమ్, అమలా పాల్, చిత్రాంగదా సింగ్, సోనాక్షీ సిన్హా, పరిణీతి చోప్రా, స్వరా భాస్కర్, రియా కపూర్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమందో! ఆమె చేతికి జుట్టిచ్చి.. అందాన్ని తురుముకునే సెలబ్రిటీలు! నటీమణులే కాదు మోడల్స్ కూడా ఆంచల్ చేత జుట్టు ముడిపించుకోవాలని ఆరాటపడుతుంటారు. సిల్వర్ స్క్రీన్, ర్యాంప్‌ల మీదే కాదు ఫొటో షూట్స్, రెడ్ కార్పెట్ వాక్స్, సినిమా ఈవెంట్స్, పార్టీలకూ ఆంచల్ చేసిన హెయిర్ స్టయిల్‌తోనే హాజరవుతుంటారు. సినిమా లోకానికి అవతల కూడా ఆంచల్ హెయిర్ స్టయిలింగ్కి అశేష అభిమానగణం ఉంది. పండుగలు, బర్త్‌డేలు, పెళ్లిళ్లు, పురుళ్లు ఇలా ప్రతి సందర్భానికీ ఆమె హెయిర్ స్టయిల్ని కోరుకునేవారున్నారు. ఇంత ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముంబై వాసి ఈ రంగంలోకి ఎలా వచ్చిందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం..‘నాకు చిన్నప్పటి నుంచీ రకరకాల జడలు వేయడమన్నా, వేయించుకోవడమన్నా చాలా ఇష్టం. క్లాస్‌లో నా ముందు కూర్చున్న ఫ్రెండ్స్‌కి జడలు వేసి టీచర్‌తో తిట్లు తినేదాన్ని. ఇంట్లో కూడా అమ్మ, నానమ్మ, అత్త, పిన్ని, కజిన్స్.. అందరినీ రకరకాల హెయిర్ స్టయిల్స్‌తో ముస్తాబు చేసేదాన్ని. నా ఈ కళకు మా అమ్మ తెగ మురిసిపోయేది. హెయిర్ స్టయిల్స్లోనే కాదు కుట్లు, అల్లికలు, పెయింటింగ్‌లో కూడా ఫస్ట్ ఉండేదాన్ని. అయితే హెయిర్ స్టయిలిస్ట్‌ను అవ్వాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. అసలు దాన్నో కెరీర్‌గా తీసుకుంటారనీ తెలియదప్పుడు. అందుకే ఏంబీఏ అయిపోగానే ఒక అడ్వర్టయిజ్మెంట్ కంపెనీలో చేరాను. కానీ జాబ్ శాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. ఏదో మిస్ అవుతున్న భావన. దాన్ని వదిలేసి మా సొంత సంస్థలో కొంతకాలం మార్కెటింగ్ జాబ్ చేశాను. అదీ నచ్చలేదు. క్రియేటివ్ వర్క్ మీదకే పోయేది మనసు. అప్పుడు గ్రహించాను హెయిర్ స్టయిలింగే నా కాలింగ్ అని. దాని మీద రీసర్చ్ చేస్తే తెలిసింది దానికోసం స్పెషల్ కోర్సులున్నాయని. అంతే పేరెంట్స్‌కి చెప్పి లండన్ వెళ్లాను. అక్కడ Vida Sassoon Academyలో చేరాను. దాని తర్వాత అక్కడే స్టయిలింగ్కి సంబంధించే మరో రెండు కోర్సులు చేసి, ఇండియా వచ్చేశా. ఈ రంగంలో అవకాశాలైతే కనపడ్డాయి కానీ మొదట్లో కొంత స్ట్రగుల్ తప్పలేదు. భయపడలేదు. నా విద్యనే నమ్ముకున్నాను. వమ్ము చేయలేదు. ఇప్పటిదాకా వెనక్కి తిరిగి చూడలేదు. నచ్చిన పని ఇచ్చే ఆనందం అంతా ఇంతా కాదు’ అని చెబుతుంది ఆంచల్. బాలీవుడ్లో పనిచేస్తూనే, ‘హాట్ హెయిర్ బెలూన్’ పేరుతో ఇన్‌స్టాలో జుట్టు సంరక్షణకు సంబంధించిన టిప్స్ ఇస్తోంది. హెయిర్ కేర్ ట్యుటోరియల్స్ కూడా నిర్వహిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇన్‌స్టాలో ఆమెకు అసంఖ్యాకమైన ఫాలోయింగ్ ఉంది. ‘మనలో ఎంత క్రియేటివిటీ ఉన్నా దానికి సంబంధించిన ఫార్మల్ ఎడ్యుకేషన్ తప్పనిసరి. అది మన సృజనను సానబెడుతుంది’ అంటూ ఔత్సాహిక హెయిర్ స్టయిలిస్ట్లకు సలహా ఇస్తుంది ఆంచల్ మోర్వానీ. -
అత్యాచార కేసులో హీరోయిన్ హెయిర్‌స్టైలిస్ట్ అరెస్ట్
ముంబై : పదహారేళ్ల బాలుడిపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో కంగనా రనౌత్ హెయిర్ స్టైలిస్ట్ బ్రెండన్ అలెస్టర్ డీగీ(42)ని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. కంగనా రనౌత్ అప్‌కమింగ్ మూవీ షూటింగ్ ప్రస్తుతం.. మహారాష్ట్రలోని రాయగఢ్‌లో జరుగుతోంది. బ్రెండన్ కూడా అక్కడే ఉండటంతో ముంబై పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద బ్రెండన్‌పై కేసు నమోదు చేసి, అక్టోబర్ 3 వరకు రిమాండ్‌లో ఉంచనున్నట్లు తెలిపారు. సౌతాఫ్రికాకు చెందిన బ్రెండన్ కంగనాతో పాటుగా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలకు హెయిర్‌స్టైలిస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా డేటింగ్ ఆప్‌లో తన వయస్సును తప్పుగా పేర్కొన్న సదరు బాలుడు పలువురు సెలబ్రిటీల(పురుషులు)తో స్నేహం పెంచుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన అతడి తల్లి తన కుమారుడితో సంబంధాలు కలిగి ఉన్న ఎనిమిది మంది వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరిలో బ్రెండన్ కూడా ఉండటంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. -
అమ్మ కోసం హన్సిక...
హీరోయిన్ హన్సిక హెయిర్ స్టయిలిస్ట్‌గా మారిపోయింది. ఇదేంటబ్బా అనుకుంటున్నారా?.... అంటే ప్రొఫెషనల్ హెయిర్ స్టయిలిస్ట్‌గా కాదు లెండీ.. అది కూడా అమ్మ కోసం... ఆమె హెయిర్ స్టయిలిస్ట్గ్గా అవతారమెత్తింది. ఓ సినిమా షూటింగ్‌కు హన్సికతో పాటు వచ్చిన ఆమె తల్లి మోనా మోత్వానీ కూడా వచ్చారు. 'పోకిరి రాజా' షూటింగ్ సమయంలో గ్యాప్ వచ్చింది. అంతే హన్సిక పార్ట్ టైమర్‌గా మారింది. సరదాగా అమ్మకు జడ అల్లుతూ తన ముచ్చట తీర్చుకుంది. ఆ ఫోటోను తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. మా అమ్మకు కొత్త హెయిర్ స్టయిలిస్ట్ దొరికిందంటూ... ఫోటోతో పాటు కామెంట్ పోస్ట్ చేసిన హన్సిక.. అమ్మ అంటే తనకు ఎంతో ప్రేమ అని తెలిపింది. కాగా హన్సిక ప్రస్తుతం పోకిరి రాజా సినిమా షూటింగ్లో బిజీగా ఉంది. అయితే షూటింగ్ గ్యాప్‌లో ఆ చిత్ర హీరో జీవాతో కలిసి దిగిన ఫోటోను ఆమె షేర్ చేసుకుంది. అసిస్టెంట్ డైరెక్టర్ షాట్ రెడీ అని వారిద్దర్ని పిలిచినా... ఓకే అంటూనే ఫస్ట్ సెల్ఫీ ఆ తర్వాత షాట్ అంటూ ...హంగామా చేశారు. 🌸🌸🌸🌸😘😘😘 #onset #partimejob pic.twitter.com/cTokouFNWc — Hansika (@ihansika) October 19, 2015 My mother has got a new hairstylist ...me @ihansika 😂.. 🙆🏼🐣 #onset #mytimepass #ilovemymoma 💋 pic.twitter.com/qBJSVY3RwI — Hansika (@ihansika) October 19, 2015