Half-century
-
ఇంగ్లండ్‌దే ఆధిక్యం
లండన్: నాలుగో టెస్టులో మన పేస్ పైచేయి సాధిస్తుందనుకుంటే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ పట్టుదలే నిలిచింది. తొలి సెషన్ మొదట్లో ఉమేశ్ యాదవ్ (3/76) కసిదీరా బౌలింగ్ చేసి... ఇంగ్లండ్‌నూ తక్కువ స్కోరుకే ఆలౌట్ చేయొచ్చనే ధీమా కలిగించాడు. కానీ ఒలీ పోప్ (81; 6 ఫోర్లు), క్రిస్ వోక్స్ (50; 11 ఫోర్లు) అర్ధసెంచరీలు టీమిండియా ఆశలపై నీళ్లుచల్లాయి. దీంతో 62 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ చివరికొచ్చేసరికి అనూహ్యంగా 99 పరుగుల ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. మన వశమవుతుందనుకున్న ఆధిక్యం పరాధీనమైంది. ఓవర్‌నైట్ స్కోరు 53/3తో రెండో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 84 ఓవర్లలో 290 పరుగుల వద్ద ఆలౌటైంది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ వికెట్ కోల్పోకుండా 43 పరుగులు చేసింది. ఇంకా 56 పరుగులు వెనుకబడే ఉంది. స్కోరు వివరాలు: భారత్ తొలి ఇన్నింగ్స్: 191; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: బర్న్స్ (బి) బుమ్రా 5; హమీద్ (సి) పంత్ (బి) బుమ్రా 0; మలాన్ (సి) రోహిత్ (బి) ఉమేశ్ 31; రూట్ (బి) ఉమేశ్ 21; ఒవర్టన్ (సి) కోహ్లి (బి) ఉమేశ్ 1; పోప్ (బి) శార్దుల్ 81; బెయిర్‌స్టో (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 37; మొయిన్ అలీ (సి) రోహిత్ (బి) జడేజా 35; వోక్స్ (రనౌట్) 50; రాబిన్సన్ (బి) జడేజా 5; అండర్సన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (84 ఓవర్లలో ఆలౌట్ ) 290. వికెట్ల పతనం: 1–5, 2–6, 3–52, 4–53, 5–62, 6–151, 7–222, 8–250, 9–255, 10–290. బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 19–2–76–3, బుమ్రా 21–6–67–2, శార్దుల్ 15–2–54–1, సిరాజ్ 12–4–42–1, జడేజా 17–1–36–2. భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (బ్యాటింగ్) 20; రాహుల్ (బ్యాటింగ్) 22; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (16 ఓవర్లలో) 43/0. -
ధోని అర్ధ సెంచరీ.. సూపర్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్ : దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ధోని చేసిన అర్ధ సెంచరీని చూసి అభిమానులు మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బుధవారం సూపర్ స్పోర్ట్స్ పార్క్‌లో జరిగన మ్యాచ్‌లో ధోని కేవలం 28 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. తన కెరీర్లో రెండో అంతర్జాతీయ టీ20 అర్ధశతకాన్ని నమోదు చేశాడు. ఈసందర్భంగా ధోనిపై పలువురు మాజీ ఆటగాళ్లు ట్విటర్ వేదికగా పొగడ్తలు కురిపించారు. డేరింగ్ బ్యాట్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ పోస్టు చేస్తూ ధోని కత్తి తిప్పడం మర్చిపోలేదు, వైవిద్యమైన ఆటగాడి నుంచి మరో ప్రత్యేక ఇన్నింగ్స్ వచ్చిందంన్నాడు. మరో మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ కూడా వావ్ ధోని ఏం కొట్టావ్.. గొప్ప ఇన్నింగ్స్ ఆడావ్ అంటూ ట్వీట్ చేశాడు. చాలా కాలంగా ధోనీ ఇన్నింగ్స్‌ను చూడలేకపోయానని, కానీ మిడిలార్డర్లో మెరవడం సంతోషంగా ఉందని కామెంటేటర్ ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు నాయకత్వం వహిస్తున్న ధోని, ఐపీఎల్లో సైతం మరింత రాణించాలని, మరోసారి చెన్నైని విజేతగా నిలపాలని అభిమానులు కోరుకుంటున్నారు. Last 4 overs 55 . Hathyar chalana nahi bhoolein, Special hits from a special player , Mahendra Singh Dhoni. Great effort from Pandey as well. Best wishes to the bowlers to defend 188 — Virender Sehwag (@virendersehwag) February 21, 2018 Waah ! Dhoni , kya maara. Great innings from Manish Pandey and MS Dhoni and 188 is a very competitive score #SAvIND — Mohammad Kaif (@MohammadKaif) February 21, 2018 It seems that I missed some vintage Dhoni stuff...happiness is to see the Indian middle-order clicking. 👏👍🏏 #SAvIND — Aakash Chopra (@cricketaakash) February 21, 2018 -
తండ్రీకొడుకుల అర్ధ శతకాలు
కింగ్స్టన్: క్రికెట్లో తండ్రీకొడుకులు ఇద్దరూ ఒకే మ్యాచ్‌లో అర్ధ శతకాలు బాది రికార్డు సృష్టించారు. మామూలుగా క్రికెట్లో అన్నదమ్ములు కలసి బ్యాటింగ్ చేస్తుంటేనే చూడ ముచ్చటగా ఉంటుంది. అలాంటిది తండ్రీ కొడుకులు ఒకే మ్యాచ్ ఆడుతూ అర్ధ శతకాలు బాదితే! అద్భుతంగా అనిపిస్తుంది. కరీబియన్ అభిమానులు ఈ అరుదైన ఇన్నింగ్స్‌ను చూసి ఆనందించారు. విండీస్ బ్యాటింగ్ దిగ్గజం శివ్‌నారాయణ్ చందర్‌పాల్ గుర్తున్నాడు కదా! ఆయన తన కుమారుడు త్యాగి నారాయణ్ చందర్‌పాల్‌తో కలసి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడాడు. సబీనా పార్క్‌లో నిర్వహిస్తున్న ప్రాంతీయ టోర్నీలో శివ్‌నారాయణ్, త్యాగినారాయణ్ గయానా తరఫున ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడారు. వీరిద్దరూ అర్ధశతకాలు సాధించడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 262 పరుగులు చేసింది. ప్రత్యర్థి జమైకా జట్టు 255 పరుగులు మాత్రమే చేయగలిగింది. త్యాగి (20) ఓపెనింగ్ రాగా తండ్రి శివ్‌నారాయణ్ (42) మూడో బ్యాట్స్‌మన్‌గా వచ్చాడు. వీరిద్దరూ కలసి 12.2 ఓవర్లలో నాలుగో వికెట్‌కు 38 పరుగుల భాగస్వామ్యం జోడించారు. వీరిద్దరూ కలసి ఫస్ట్‌క్లాస్ యేతర మ్యాచ్‌లెన్నో ఆడి శతకాలు కూడా బాదారు. టెస్టు క్రికెట్లో 11,867 పరుగులు చేసిన శివ్‌నారాయణ్ విండీస్ రెండో అత్యుత్తమ బ్యాట్స్‌మన్. బ్రయాన్ లారా అతడికన్నా ముందున్నాడు. -
ఇండియాను గెలిపించిన కోహ్లి హాఫ్ సెంచరీ