ధోని అర్ధ సెంచరీ.. సూపర్‌ కామెంట్స్‌ | MS Dhoni hits 2nd T20I Half-Century, Twitter Goes Crazy, | Sakshi
Sakshi News home page

ధోని అర్ధ సెంచరీ.. ట్విటర్‌లో సూపర్‌ కామెంట్స్‌

Published Thu, Feb 22 2018 9:36 AM | Last Updated on Thu, Feb 22 2018 12:13 PM

MS Dhoni hits 2nd T20I Half-Century, Twitter Goes Crazy, - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ధోని చేసిన అర్ధ సెంచరీని చూసి అభిమానులు మాత్రం హ్యాపీగా ఫీల్‌ అవుతున్నారు. బుధవారం సూపర్‌ స్పోర్ట్స్‌ పార్క్‌లో జరిగన మ్యాచ్‌లో ధోని కేవలం 28 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. తన కెరీర్‌లో రెండో అంతర్జాతీయ టీ20 అర్ధశతకాన్ని నమోదు చేశాడు. ఈసందర్భంగా ధోనిపై పలువురు మాజీ ఆటగాళ్లు ట్విటర్‌ వేదికగా పొగడ్తలు కురిపించారు.

డేరింగ్‌ బ్యాట్‌మెన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ పోస్టు చేస్తూ ధోని కత్తి తిప్పడం మర్చిపోలేదు, వైవిద్యమైన ఆటగాడి నుంచి మరో ప్రత్యేక ఇన్నింగ్స్‌ వచ్చిందంన్నాడు. మరో మాజీ ఆటగాడు మహమ్మద్‌ కైఫ్‌ కూడా వావ్‌ ధోని ఏం కొట్టావ్‌.. గొప్ప ఇన్నింగ్స్‌ ఆడావ్‌ అంటూ ట్వీట్‌ చేశాడు. చాలా కాలంగా ధోనీ ఇన్నింగ్స్‌ను చూడలేకపోయానని, కానీ మిడిలార్డర్‌లో మెరవడం సంతోషంగా ఉందని కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా వ్యాఖ్యానించాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌కు నాయకత్వం వహిస్తున్న ధోని, ఐపీఎల్‌లో సైతం మరింత రాణించాలని, మరోసారి చెన్నైని విజేతగా నిలపాలని అభిమానులు కోరుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement