Handboll
-
పోలీస్ గేమ్స్‌లో జిల్లాకు బంగారు పతకం
కర్నూలు: విశాఖపట్నంలో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు జరిగిన 65వ ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్ హ్యాండ్‌బాల్ పోటీల్లో జిల్లా పోలీసులు బంగారు పతకాన్ని సాధించారు. ఈ గేమ్స్‌లో మొత్తం 26 రాష్ట్రాలు పాల్గొన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కి మొదటి స్థానం, సీఆర్పీఎఫ్కు రెండవ స్థానం లభించింది. కర్నూలు జిల్లా పోలీసు శాఖ నుంచి ఆర్ఎస్ఐ జి.రేణుక అభిరాం రెడ్డి(కోచ్ మరియు ప్లేయర్), కానిస్టేబుళ్లు సి.వెంకటేష్(పీసీ నెం.3018), వెంకటరాజు(పీసీ నెం.3668), ఇ.రాము(పీసీ నెం.3586), ఈ.లక్ష్మణ్(పీసీ నెం.3584) ఏపీ జట్టులో పాల్గొని ప్రతిభ కనబరిచారు. కానిస్టేబుళ్లు కర్నూలు, స్పెషల్ పార్టీ, ఆదోని పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్నారు. 65వ ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్–2016లో బంగారు పతకాన్ని కైవసం చేసుకుని జిల్లాకు చేరుకున్న పోలీసు సిబ్బందిని ఎస్పీ ఆకే రవికృష్ణ బుధవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు పిలిపించి అభినందించారు. ఇలాంటి విజయాలు మరిన్ని సాధించి జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. -
రేపు జిల్లా మహిళా హ్యాండ్‌బాల్ జట్టు ఎంపిక
కర్నూలు (టౌన్): ఈ నెల 5 వ తేదీన స్థానిక బి. క్యాంపు క్రీడా మైదానంలో జిల్లా స్థాయి సీనియర్ మహిళా హ్యాండ్‌బాల్ జట్టుకు క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం కార్యదర్శి సి. రామాంజనేయులు శనివారం ప్రకటనలో తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 13, 14 తేదీలలో విజయవాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి మహిళా హ్యాండ్ బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారని తెలిపారు. జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు రూ.10 దరఖాస్తు రుసుం చెల్లించాలన్నారు. వివరాలకు సెల్: 9393 827 585 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. -
నేటి నుంచి ఇంటర్ హ్యాండ్‌బాల్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్ : అంతర్‌జిల్లాల స్థాయి సబ్‌జూనియర్స్ హ్యాండ్‌బాల్ పోటీలు హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్న ట్లు తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్‌కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మూడు రోజులపాటు జరి గే టోర్నమెంట్లో పది జిల్లాల నుంచి సుమారు మూడు వందల మంది క్రీడాకారులు, టెక్నికల్ అఫీషియల్స్ హాజరవుతారని తెలి పారు. శనివారం సాయంత్రం ప్రారంభించనున్న టోర్నమెంట్‌కు స్థానిక కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, కార్పొరేటర్ దామోదర్‌యాదవ్, డీఎస్డీఓ ఇందిరతో పాటు వివిధ క్రీడాసంఘాల కార్యదర్శులు హాజరవుతారని పవన్‌కుమార్ పేర్కొన్నారు.