పోలీస్ గేమ్స్‌లో జిల్లాకు బంగారు పతకం
పోలీస్ గేమ్స్‌లో జిల్లాకు బంగారు పతకం
Published Wed, Dec 7 2016 8:52 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
కర్నూలు: విశాఖపట్నంలో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు జరిగిన 65వ ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్ హ్యాండ్‌బాల్ పోటీల్లో జిల్లా పోలీసులు బంగారు పతకాన్ని సాధించారు. ఈ గేమ్స్‌లో మొత్తం 26 రాష్ట్రాలు పాల్గొన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కి మొదటి స్థానం, సీఆర్‌పీఎఫ్‌కు రెండవ స్థానం లభించింది. కర్నూలు జిల్లా పోలీసు శాఖ నుంచి ఆర్‌ఎస్‌ఐ జి.రేణుక అభిరాం రెడ్డి(కోచ్ మరియు ప్లేయర్), కానిస్టేబుళ్లు సి.వెంకటేష్(పీసీ నెం.3018), వెంకటరాజు(పీసీ నెం.3668), ఇ.రాము(పీసీ నెం.3586), ఈ.లక్ష్మణ్(పీసీ నెం.3584) ఏపీ జట్టులో పాల్గొని ప్రతిభ కనబరిచారు. కానిస్టేబుళ్లు కర్నూలు, స్పెషల్ పార్టీ, ఆదోని పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్నారు. 65వ ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్–2016లో బంగారు పతకాన్ని కైవసం చేసుకుని జిల్లాకు చేరుకున్న పోలీసు సిబ్బందిని ఎస్పీ ఆకే రవికృష్ణ బుధవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు పిలిపించి అభినందించారు. ఇలాంటి విజయాలు మరిన్ని సాధించి జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
Advertisement