పొంగుతున్న పాతాళగంగ
కోహీర్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. కోహీర్ మండలం మనియార్పల్లి గ్రామానికి చెందిన రైతులు పట్లూరి ప్రభాకర్, పట్లూరి చిట్టి, పట్లూరి సంవృద్ధి, చెనువాల లాల్రెడ్డి బోర్లలో నీరు పైకి ఉబుకుతోంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చూసి వస్తున్నారు.