hangama
-
రెండింతల హంగామా
అయోమయంలో కొందర్ని అపార్థం చేసుకున్నారు బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి. తప్పు తెలుసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అప్పుడామె కొన్ని సమస్యలను ఎదుర్కొన్నారు. తన తెలివితేటలతో ఆ సమస్యలను ఎలా పరిష్కరించారు అనే కథాంశంతో ఓ హిందీ చిత్రం తెరకెక్కనుంది. ప్రియదర్శన్ దర్శకత్వంలో 2003లో వచ్చిన ‘హంగామా’కు ఇది సీక్వెల్. ఈ చిత్రానికి కూడా ప్రియదర్శనే దర్శకుడు కావడం విశేషం. ‘హంగామా 2’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇందులో శిల్పాశెట్టి ప్రధాన పాత్రధారి. పరేష్ రావల్, మీజాన్ జఫేరి, ప్రణీత కీలక పాత్రల్లో నటిస్తారట. ఈ సినిమా చిత్రీకరణ జనవరిలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ–ప్రొడక్షన్ కార్యక్రమాలు డెహ్రాడూన్‌లో జరుగుతున్నాయని తెలిసింది. 13 ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్న శిల్పా ‘నికమ్మా’ సినిమాతో కమ్‌బ్యాక్ ఇçస్తున్నారు. ఈ చిత్రం సెట్స్ మీద ఉన్నప్పుడే ‘హంగామా 2’ చిత్రానికి సైన్ చేశారు. 2007లో ‘అప్నే’లో కథానాయికగా నటించిన తర్వాత ‘ఓం శాంతి’, ‘దోస్తానా’, ‘డిష్కియూన్’ సినిమాలో అతిథి పాత్రల్లో కనిపించారు శిల్పా. మళ్లీ కథానాయికగా కనిపించబోతున్నది ‘నికమ్మా’, ‘హంగామా 2’లోనే. -
'ఖైదీ 'బెనిఫిట్ షో కోసం ఫ్యాన్స్ క్యూ
-
‘జెన్కో’ క్రీడా సందడి
పాల్వంచలో టోర్నీ ప్రారంభం పాల్వంచ: టీఎస్ జెన్కో ఇంటర్ ప్రాజెక్ట్స్ మహిళలు, పురుష ఉద్యోగుల క్రీడా పోటీలు పాల్వంచలోని టీఆర్సీ ఇండోర్ స్టేడియంలో మంగళవారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరగనున్న టోర్నీని కేటీపీఎస్ ఓఅండ్ఎం సీఈ వి.మంగేష్ కుమార్, 5, 6దశల సీఈ పి.రత్నాకర్ ప్రారంభించారు. ఈ పోటీలకు కేటీపీపీ (భూపాల్పల్లి), రామగుండం, విద్యుత్ సౌద(హైదరాబాద్), జూరాల, శ్రీశైలం, కేటీపీఎస్ ఓఅండ్ఎం, కేటీపీఎస్ 5వ దశ, నాగర్జున సాగర్ జట్లు హాజరయ్యాయి. మహిళల విభాగంలో షటిల్ బ్యాట్మింటన్, చెస్, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, టెన్నికాయిట్ క్రీడా పోటీలను నిర్వహించారు. పురుషుల విభాగంలో టేబుల్ టెన్నిస్ సింగిల్, డబుల్ కేటగిరీలో ఆడారు. నిత్యం విధి నిర్వహణ ఒత్తిడిలో ఉండే..ఉద్యోగులు క్రీడా పోటీలతో మానసికోల్లాసం పొందారు. వివిధ ప్రాంతాల నుంచి తరలొచ్చిన వారితో..స్టేడియంలో సందడి నెలకొంది. మరో రెండు రోజుల పాటు జరగనున్న పోటీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఈలు కె.ఎల్లయ్య, కాలం సంజీవయ్య, జెన్కో స్పోర్ట్స్ ఆఫీసర్ ఎస్.లోహిత్ ఆనంద్, గేమ్స్ సెక్రటరీ వై.వెంకటేశ్వర్లు, ట్రెజరర్ కె.నరసింహ, సభ్యులు వి.హనుమంతరామ, డి.సారయ్య తదితరులు పాల్గొన్నారు. -
గుజరాత్లో జోరుగా గర్భా సందడి
-
ఆస్కార్ హంగామా
-
భార్యను రప్పించాలంటూ భర్త హంగామా