గన్నవరం టీడీపీలో గందరగోళం
హనుమాన్‌జంక్షన్‌రూరల్, న్యూస్‌లైన్ : గన్నవరం టీడీపీ టికెట్ తనకే ప్రకటించారని వల్లభనేని వంశీమోహన్ ఉదయం ప్రకటించగా... కాదు టికెట్ నాదేనని సాయంత్రం ఎమ్మెల్యే డాక్టర్ దాసరి వెంకట బాలవర్ధనరావు పేర్కొనడంతో కార్యకర్తలు అయోమయానికి గురయ్యారు. బాపులపాడు మండల పరిషత్ కార్యాలయంలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాల్లో గురువారం దాసరి, వల్లభనేని పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వంశీ చేసిన ప్రకటనపై దాసరి స్పందిస్తూ... రెండు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తగా, ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానని, ఏ కారణంగా నన్ను పార్టీ కాదంటుందని ప్రశ్నించారు. కార్యకర్తలను అయోమయానికి గురిచేయడానికి వంశీ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని అన్నారు.
మండలపార్టీ అద్యక్షుడు కలపాల జగన్మోహనరావు, వేలేరు మాజీ సర్పంచి వేములపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ చెన్నుబోయిన శివ్వయ్య తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.