ఈదురు గాలులకు నేలకొరిగిన హనుమంతుడి విగ్రహం
ఆదివారం వీచిన గాలులకు ఓ భారీ విగ్రహం నేల కూలింది. కర్నూలు జిల్లా పాణ్యం మండలం తొగచ్చేడు గ్రామంలో నిర్మిస్తున్న హనుమంతుడి విగ్రహం నేలకొరిగింది. నిర్మాణ పనులు దాదాపు పూర్తి చేసుకున్న 54 అడుగుల ఎత్తయిన ఆంజనేయస్వామి విగ్రహం భారీ ఈదురు గాలులకు ఒరిగి పోయింది. ఈ విగ్రహ నిర్మాణానికి సుమారు రూ.40లక్షలు ఖర్చు చేసినట్టు గ్రామస్తులు తెలిపారు.