భారతీయులకు ఏ సీజన్ అంటే ఇష్టం?
భారతదేశంలోని ప్రజలు ఒక ఏడాదిలో వివిధ రుతువులలోని వాతావరణాలను చవిచూస్తారు. చలి, వేడి, వర్షం మొదలైనవి మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తాయి. అటువంటప్పుడు భారతీయులు ఏ సీజన్లో అత్యధిక సంతోషంతో ఉంటారనే ప్రశ్న అందరిలో మెదులుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.వాతావరణం మన మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. సూర్యకాంతి, వర్షం, వేడి, చలి, ఇవన్నీ మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. చలికాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల చాలా మంది ఇబ్బంది పడతారు. అలాగే వేసవిలో అధిక వేడి అందరికీ చికాకు కలిగిస్తుంది.వాతావరణం మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. సూర్యరశ్మి, ఉష్ణోగ్రత మొదలైనవి మన మానసిక స్థితి, శక్తి స్థాయిలు, నిద్రను ప్రభావితం చేస్తాయి. శీతాకాలంలో పగలు తక్కువగా ఉంటుంది. సూర్యరశ్మి కూడా తక్కువగానే ఉంటుంది. ఇది సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ (సాడ్) తరహా సమస్యలను కలిగిస్తుంది. మరోవైపు శీతాకాలం పండుగ సీజన్ కూడా కావడంతో జనం కొంతమేరకు సంతోషంతో ఉంటారు.వేసవి కాలంలో అత్యధిక సూర్యకాంతి కారణంగా జనం త్వరగా అలసిపోతారు. చికాకుగా అనిపిస్తుంటుంది. అయితే వేసవి సెలవులు రావడం, దీనికితోడు ప్రయాణాల సీజన్ కావడంతో జనం సంతోషంతో ఉంటారు. వర్షాకాలంలో ఏర్పడే పచ్చని ప్రకృతి మన మనసును ప్రశాంతపరుస్తుంది. భారతదేశంలో వాతావరణం- సంతోషం మధ్య సంబంధాన్ని తేల్చిచెప్పడం చాలా క్లిష్టమైనదని నిపుణులు అంటుంటారు. ప్రజల ఆనందం అనేక కారణాలపై ఆధారపడి ఉంటుంది.మరోవైపు దేశంలోని వివిధ ప్రాంతాలలోని వాతావరణం భిన్నంగా ఉంటుంది. ఉత్తర భారతదేశంలో శీతాకాలం చాలా చల్లగా ఉంటుంది. అయితే దక్షిణ భారతదేశంలో వేసవిలో ఎండలు మండిపోతుంటాయి. కాగా భారతీయ సంస్కృతిలో వాతావరణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. పలు పండుగలు, ఆచారాలు సీజన్‌తో ముడిపడి ఉన్నాయి. ఉదాహరణకు హోలీ పండుగ వసంతకాలంలో జరుపుకుంటారు. దీపావళిని శరదృతువులో జరుపుకుంటారు. వాతావరణం విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. కొందరికి శీతాకాలం, మరికొందరికి వేసవి కాలం అంటే ఇష్టం ఉంటుంది. ఇది కూడా చదవండి: మనవరాలి పెళ్లి సంగీత్‌లో.. మల్లారెడ్డి ఊర మాస్ డ్యాన్స్