‘ఆ హ్యాపీడేస్‌ మళ్లీ కోరుకుంటున్నా’ | Looking to get back to my happiest days: Hrithik Roshan | Sakshi
Sakshi News home page

‘ఆ హ్యాపీడేస్‌ మళ్లీ కోరుకుంటున్నా’

Published Tue, Feb 7 2017 2:09 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

‘ఆ హ్యాపీడేస్‌ మళ్లీ కోరుకుంటున్నా’ - Sakshi

‘ఆ హ్యాపీడేస్‌ మళ్లీ కోరుకుంటున్నా’

ముంబయి: గతంలో తాను సంతోషంగా ఉన్న రోజులు తిరిగి పొందాలని కోరుకుంటున్నానని బాలీవుడ్‌ ప్రముఖ నటుడు హృతిక్‌ రోషన్‌ అన్నాడు. తాను ప్రస్తుతం క్రియేటివ్‌ చిత్రాలపైనే దృష్టి సారిస్తున్నట్లు చెప్పాడు. ఆయన నటించిన కాబిల్‌ చిత్రానికి ఇటీవల మంచి సానుకూల స్పందన రావడంపై సంతోషంతో ఉన్న ఆయన..

‘ఒక నటుడిగా చిత్ర నిర్మాణాల విషయంలో తప్పనిసరిగా సృజనాత్మకంగా ఆలోచించాలి. గతంలో నేను క్రియేటివ్‌ జానర్‌లో చిత్రాలు చేసేవాడిని అప్పుడు చాలా సంతోషంగా ఉండేవాడిని. ఇప్పుడు నేను అలాంటి రోజులను తిరిగి పొందేందుకు ఎదురుచూస్తున్నాను. కాబిల్‌ చిత్రం విషయంలో ఎంతో నమ్మకంగా ఉన్నాను. అది మంచి చిత్రం అవుతుందని మంచి స్పందన వస్తుందని ముందే భావించాను. అయితే, నేను ఎంతైతే కోరుకున్నానో అంతకుమించి నా చిత్రాన్ని ఆదరిస్తున్నారు.. ప్రేమిస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో నేను ఊహించలేదు. మా టీం మొత్తానికి ఇదొక పెద్ద విజయం’ అంటూ ఆయన మూడో బ్రైట్‌ అవార్డుల కార్యక్రమం 2017 సందర్భంగా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement