harbhajansingh
-
కేజ్రీవాల్ ‘కీ’ స్టెప్.. రాజ్యసభకు హర్భజన్ సింగ్‌తో మరో నలుగురు.. ఎవరంటే..?
ఛండీగఢ్: జాతీయ పార్టీలకు షాకిస్తూ పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తోంది పంజాజ్ భగవంత్ మాన్ సర్కార్. ఇప్పటికే ఉద్యోగాల భర్తీ, మంత్రులకు టార్గెట్ ఇచ్చిన ఆప్ ప్రభుత్వం మరో సంచలన ప్రకటన చేసింది. ఐదుగురు విభిన్న వర్గాలకు చెందిన వ్యక్తులను రాజసభ్యకు నామినేట్ చేస్తూ దేశ రాజకీయాలను ఆకర్షించింది. సోమవారం పంజాబ్ రాష్ట్రం నుంచి ఐదుగురిని రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. పంజాబ్ నుంచి ఐదుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియడంతో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఐదుగురు నూతన సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేసింది. ఆప్ అభ్యర్థులుగా ఢిల్లీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా, క్రికెటర్ హర్భజన్ సింగ్, ఢిల్లీ ఐఐటి ప్రొఫెసర్ సందీప్ పాఠక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్‌పియు) వ్యవస్థాపకుడు, ఛాన్సలర్ అశోక్ మిట్టల్, పారిశ్రామికవేత్త సంజీవ్ అరోరాలను రాజ్యసభకు నామినేట్ చేసింది. నామినేషన్ దాఖలుకు సోమవారం చివరి రోజు కాగా మార్చి 31న ఎన్నికలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా.. ఢిల్లీలోని రాజేందర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్న రాఘవ్ చద్దా.. అతిచిన్న వయసులో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అంతేకాకుండా చద్దా.. పంజాబ్ ఆప్ పార్టీ ఇంచార్జ్‌గా, ఆప్ జాతీయ అధికార ప్రతినిధిగా కూడా పనిచేస్తున్నారు. భారత మాజీ క్రికెటర్, స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ అందరికీ తెలిసిన వ్యక్తి. ఢిల్లీ ఐఐటి ప్రొఫెసర్ సందీప్ పాఠక్ చాలా కాలంగా ఆప్‌తో కలిసి పనిచేస్తున్నారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు పాఠక్ అత్యంత సన్నిహితుడు. ఎన్నికల వ్యూహాల రచించడంతో కీలక పాత్ర పోషించారు. ఇక, విద్యా రంగంలో చేస్తున్న సేవలను గుర్తించిన ఆప్.. పంజాబ్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఛాన్సలర్ అశోక్ మిట్టల్‌ను తమ పార్టీ తరఫున రాజ్యసభకు నామినేట్ చేసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త సంజీవ్ అరోరాకు కూడా ఆప్ అవకాశం ఇచ్చింది. Meet AAP's 5 new Rajya Sabha MPs 🥳 1. Ashok Mittal 2. Harbhajan Singh 3. Raghav Chadha 4. Sandeep Pathak 5. Sanjeev Arora pic.twitter.com/wlRuemaajc — AAP (@AamAadmiParty) March 21, 2022 -
నేను కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదు: భజ్జీ
ముంబై: 40 ఏళ్ల వయసులో తాను ఐపీఎల్ ఆడటంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ ఘాటుగా స్పందించాడు. నా విషయమై చర్చింకునే వారికి నేను కొత్తగా నిరూపించుకోవల్సిందేమీ లేదని, నాకు ఆడాలని అనిపించినన్ని రోజులు క్రికెట్లో కొనసాగుతానని బదులిచ్చాడు. ఆట పరంగా తనకంటూ కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేసుకున్నాని, అందులో విఫలమైతే తన్ను తానే విమర్శించుకుంటానని, ఇతరులకు ఎప్పుడూ ఆ అవకాశం ఇవ్వనని పేర్కొన్నాడు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు తరఫున వంద శాతం పర్ఫార్మ్ చేయడమే తన ముందున్న లక్ష్యమని, అనవసరపు చర్చలపై స్పందించి, తన టైమ్‌ను వేస్ట్ చేసుకోదలుచుకోలేదని ప్రకటించాడు. కాగా, వ్యక్తిగత కారణాల వల్ల గతేడాది ఐపీఎల్‌కు దూరంగా ఉన్న భజ్జీని చెన్నై సూపర్ కింగ్స్ రిలీవ్ చేయగా, ఈ ఏడాది వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ అతన్ని కనీస ధరకు(2 కోట్లు) సొంతం చేసుకుంది. ఐపీఎల్ ప్రారంభ ఎడిషన్ నుంచి 2017 వరకు ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈ పంజాబీ స్పిన్నర్ 2018, 2019 సీజన్లలో చెన్నైకు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్లో 700కుపైగా వికెట్లు సాధించిన భజ్జీ.. తాను ప్రాతినిధ్యం వహించిన ఆఖరి సీజన్లో(2019) 11 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు సాధించి శభాష్ అనిపించాడు. భజ్జీ తన ఓవరాల్ ఐపీఎల్ కెరీర్లో 160 మ్యాచ్‌ల్లో 150 వికెట్లు సాధించాడు. చదవండి: టాప్‌లో కొనసాగుతున్న కోహ్లి.. -
విమానంలో ఈత కొట్టిన భారత క్రికెటర్లు
విమానంలో భారత క్రికెట్ ఆటగాళ్లు ఈత కొట్టారు. విమానంలో ఈత కొట్టడం ఏంటి.. అది కూడా క్రికెటర్లు అంటున్నారు, అనుకుంటున్నారా ? నిజమేనండి.. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకు పోరాడి ఒక్క పరుగుతో విజయం సాధించిన భారత ఆటగాళ్లు ఫుల్ జోష్ మీద ఉన్నారు. బంగ్లాదేశ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో చివరి మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసి గట్టెక్కిన టీం ఇండియా ఆటగాళ్లు ఆ ఆనందాన్ని హోలీ రూపంలో జరుపుకొని..ఇప్పుడు విమానంలో కూడా ఈత కొట్టారు. అది కూడా నీటిలో ఆక్సిజన్ అందించే స్నోర్కెలింగ్ అనే పరికరాన్ని ధరించి. హర్బజన్ సింగ్, రోహిత్ శర్మ, రహానేలు స్నోర్కెలింగ్ పరికరాన్ని ధరించి విమానంలో ఈత కొడతున్నట్టు ఉన్న వీడియోను హర్భజన్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. చాలా ఎంజాయి చేస్తున్నట్టు పేర్కొన్నాడు. అయితే యువరాజ్ సింగ్ మాత్రం తమతో జాయిన్ అవ్వడానికి సాహసించలేదంటూ హర్భజన్ ట్విట్ లో పేర్కొన్నాడు. ఓ లేటెస్ట్ యాప్ ను వాడి తాము విమానంలో ఈత కొడుతున్నట్లు కనిపించేలా బ్యాగ్రౌండ్ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. విశేషాలను ఓ వీడియో తీసి ఈ క్రికెటర్స్ బంగ్లాపై మ్యాచ్ విజయాన్ని ఆస్వాదించారు! Snorkelling in the flight with my mates what fun @ImRo45 @ajinkyarahane88 Yuvi didn't get the gears to join in ✌️✌ pic.twitter.com/nPzt5A9Xbx — Harbhajan Singh (@harbhajan_singh) March 24, 2016