నీతి ఆయోగ్ రాజకీయ విమర్శలు చేయడం సిగ్గుచేటు: హరీష్ రావు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన నిధుల ఇచ్చామని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపణలు అర్థరహితమంటూ నీతి ఆయోగ్ చేసిన ప్రకటనపై తీవ్రంగా స్పందించారు మంత్రి హరీష్ రావు. తెలంగాణకు నిధులు ఇవ్వాలని కోరినా ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. స్మిత సబర్వాల్, ఎర్రబెల్లి దయాకరరావు, కృపాకర్ రెడ్డి.. జల్ జీవన్ మిషన్ కింద నిధులు ఇవ్వాలని అనేక లేఖలు రాశారని గుర్తు చేశారు. బీజేపీకి వంతపాడుతూ నీతి ఆయోగ్ నోట్ రిలీజ్ చేయడం సిగ్గు చేటుగాన్నారు. నీతి ఆయోగ్ రాజకీయ రంగు పులుముకుందని విమర్శించారు. నీతి ఆయోగ్ సీఎం కేసీఆర్ కామెంట్స్‌పై కొద్దీ గంటల్లోనే స్పందించిందని.. అయితే, కేసీఆర్ అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వకపోగా తన విలువను తగ్గించుకుందన్నారు హరీష్ రావు.
‘19వేల కోట్లు ఇవ్వాలని అడిగాం, కానీ స్పందన లేదు. నీతి ఆయోగ్ సిఫార్సులను సైతం కేంద్రం చెత్త బుట్టలో వేసింది. దానికి సమాధానం చెప్పకుండా ఊరికే రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. 3వేల కోట్లు ఇచ్చామని నీతి ఆయోగ్ చెప్తోంది. అందులో తెలంగాణ రెండు వందల కోట్లు మాత్రమే వాడుకుందని తప్పుడు ప్రకటన చేస్తోంది. ఇది ప్రజల్ని పక్కదోవ పట్టించటమే. కాగితాల మీద లెక్కలు చూపుతోంది కేంద్రం కానీ ఆచరణలో నిధులు ఇవ్వట్లేదు.’ అని పేర్కొన్నారు హరీష్ రావు.
రాజకీయ విమర్శలు చేయడం సిగ్గుచేటుగా పేర్కొన్నారు హరీశ్ రావు. మిషన్ భగీరథకు 24వేల కోట్లు ఇవ్వమని అడిగితె 24 పైసలు ఇవ్వలేదు అని సీఎం చెప్పారని, సీఎం అడిగిన బేఖాతారు చేసిందని విమర్శించారు. శనివారం అర్ధ సత్యాలు, అవాస్తవాలు, రాజకీయ రంగులో ప్రకటన ఇచ్చిందని పేర్కొన్నారు. సహకార సమైక్య స్ఫూర్తి ఎక్కడుంది? అని ప్రశ్నించారు హరీశ్ రావు.
ఇదీ చదవండి: నీతి ఆయోగ్ పనికిమాలిందన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. వేగంగా కౌంటర్ ఇచ్చిన నీతి ఆయోగ్