haritaharma
-
సీఎం కేసీఆర్‌ను మరోసారి తీసుకొస్తా
హరితహారంపై ఎమ్మెల్యే సమీక్ష అ«ధికారులవి కాకి లెక్కలు ఎంపీపీ సంపత్ హుస్నాబాద్: హరితహారం టార్గెట్‌ను పూర్తి చేస్తే మరోసారి సీఎంను తీసుకొస్తానని ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్ అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలో అనుకున్నంత స్థాయిలో మొక్కలు నాటలేదని అన్నారు. ఇంకా స్పీడ్ పెంచాలన్నారు. 40 లక్షల టార్గెట్ కాగా, 11లక్షలు మాత్రమే నాటినట్లు తెలిపారు. మరో పది రోజుల్లో 60శాతం పూర్తి చేసి హుస్నాబాద్‌ను ముందు వరుసలో నిలబెట్టాలని అన్నారు. ప్రభుత్వ స్థలాల్లో, గుట్టలపై మొక్కలను నాటి వాటిని పరిరక్షించాలని అన్నారు. ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో మొక్కలను నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆర్డీఓ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యేను తప్పుదోవ పట్టిస్తున్నారు.. హరితహారం కార్యక్రమంలో భాగంగా అధికారులు కాకి లెక్కలు చూపుతూ ఎమ్మెల్యేను తప్పుదోవ పట్టిస్తున్నారని భీమదేవరపల్లి ఎంపీపీ సంగ సంపత్ అధికారులపై విరుచుకుపడ్డారు. తన మండలంలో కొంతమంది అధికారులు మొక్కలు నాటారని, ఎంఈవో చూపుతున్న మొక్కల లెక్కలు తప్పని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ లింగాల సాయన్న, వివిధ మండలాల ఎంపీపీలు భూక్య మంగ, స్వామి, సంపత్, జెడ్పీటీసీలు పొన్నాల లక్ష్మణ్. బిల్లా వెంకట్‌రెడ్డి, రామచంద్రంనాయక్, ఎంపీడీఓ రాంరెడ్డి, తహసీల్దార్ వాణిరెడ్డి, కమిషనర్ కుమారస్వామి, వివిధ మండలాల ఎంపీడీఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మొక్కలను కాపాడడమే ప్రతిఒక్కరి ధ్యేయం
ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి రాయికల్ : మొక్కలు నాటడమే కాదు పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. మండలం బోర్నపల్లి, చింతలూరు, రామాజీపేట, ఇటిక్యాల గ్రామాల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం రామాజీపేటలో జెడ్పీ నిధులతో మంజూరైన బోర్ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ పడాల పూర్ణిమ, జెడ్పీటీసీ గోపీ మాధవి, సర్పంచులు కోల లక్ష్మి, కదుర్ల లక్ష్మి, రామాజీపేటలో వాసరి రవి, ఇటిక్యాలలో నీరటి శ్రీనివాస్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్రావు, ప్రధాన కార్యదర్శి మహేందర్, ఎంపీటీసీలు బెజ్జంకి మోహన్, అనుపురం లక్ష్మి, తహసీల్దార్ చంద్రప్రకాశ్, యూత్ కాంగ్రెస్ నాయకులు మహిపాల్‌రెడ్డి, దివాకర్, హరీశ్‌రావు తదితరులు పాల్గొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతి భాగ్యలక్ష్మి రాయికల్, ద్వితీయ సుమలత రాయికల్, తృతీయ జ్యోతి ధర్మాజీపేటలు గెలుచుకున్నారు. వీరికి ఎంపీపీ పడాల పూర్ణిమ బహుమతులు అందజేశారు.