- హరితహారంపై ఎమ్మెల్యే సమీక్ష
- అ«ధికారులవి కాకి లెక్కలు ఎంపీపీ సంపత్
సీఎం కేసీఆర్‌ను మరోసారి తీసుకొస్తా
Published Fri, Jul 29 2016 9:20 PM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM
హుస్నాబాద్: హరితహారం టార్గెట్‌ను పూర్తి చేస్తే మరోసారి సీఎంను తీసుకొస్తానని ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్ అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలో అనుకున్నంత స్థాయిలో మొక్కలు నాటలేదని అన్నారు. ఇంకా స్పీడ్ పెంచాలన్నారు. 40 లక్షల టార్గెట్ కాగా, 11లక్షలు మాత్రమే నాటినట్లు తెలిపారు. మరో పది రోజుల్లో 60శాతం పూర్తి చేసి హుస్నాబాద్‌ను ముందు వరుసలో నిలబెట్టాలని అన్నారు. ప్రభుత్వ స్థలాల్లో, గుట్టలపై మొక్కలను నాటి వాటిని పరిరక్షించాలని అన్నారు. ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో మొక్కలను నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆర్డీఓ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.
ఎమ్మెల్యేను తప్పుదోవ పట్టిస్తున్నారు..
హరితహారం కార్యక్రమంలో భాగంగా అధికారులు కాకి లెక్కలు చూపుతూ ఎమ్మెల్యేను తప్పుదోవ పట్టిస్తున్నారని భీమదేవరపల్లి ఎంపీపీ సంగ సంపత్ అధికారులపై విరుచుకుపడ్డారు. తన మండలంలో కొంతమంది అధికారులు మొక్కలు నాటారని, ఎంఈవో చూపుతున్న మొక్కల లెక్కలు తప్పని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ లింగాల సాయన్న, వివిధ మండలాల ఎంపీపీలు భూక్య మంగ, స్వామి, సంపత్, జెడ్పీటీసీలు పొన్నాల లక్ష్మణ్. బిల్లా వెంకట్‌రెడ్డి, రామచంద్రంనాయక్, ఎంపీడీఓ రాంరెడ్డి, తహసీల్దార్ వాణిరెడ్డి, కమిషనర్ కుమారస్వామి, వివిధ మండలాల ఎంపీడీఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement