haryana minister anil vij
-
మీ పేర్ల ముందు ‘పప్పూ’ యాడ్ చేసుకోండి..
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ శ్రేణులు సోషల్ మీడియాలో తమ పేర్లకు చౌకీదార్ ట్యాగ్‌ను యాడ్ చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ విమర్శలను బీజేపీ దీటుగా తిప్పికొట్టింది. కాంగ్రెస్ కార్యకర్తలు తమ పేర్లకు ‘పప్పు’ అని యాడ్ చేసుకుంటే బీజేపీకి ఎలాంటి అభ్యంతరం లేదని హర్యానా మంత్రి అనిల్ విజ్ పేర్కొన్నారు. తాము తమ పేర్లలో చౌకీదార్ (కాపలాదారు) అనే పదాన్ని జోడించామని, మీరు కూడా మీ పేర్లకు ముందు పప్పూ అని పెట్టుకోవాలని, ఇందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన ట్వీట్ చేశారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ ఆయనను బీజేపీ పప్పూ అని పిలవడం తెలిసిందే. కాగా రాహుల్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు రఫేల్ ఒప్పందంలో అవినీతిని ప్రస్తావిస్తూ కాపలాదారే దొంగ అని విమర్శిస్తున్నారు. ఇక చౌకీదార్ క్యాంపెయిన్‌లో భాగంగా ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, పీయూష్ గోయల్, దర్మేంధ్ర ప్రధాన్, జేపీ నడ్డా సహా పలువురు నేతలు తమ ట్విటర్ ఖాతాల్లో పేరుకు ముందు చౌకీదార్‌ను యాడ్ చేసుకున్నారు. -
హరియాణా మంత్రి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని నిపా వైరస్‌తో పోల్చిన హరియాణా మంత్రి అనిల్ విజ్ బుధవారం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రతి పౌరుడు కొద్దిరోజులు ఆర్ఎస్ఎస్లో విధిగా పనిచేయాలని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి పంపిన ఆహ్వానాన్ని అంగీకరించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్లో పనిచేయడాన్ని తప్పనిసరి చేయాలని మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రి వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్లో విధిగా పనిచేయాలన్న నిబంధన పౌరులను ఒత్తిడి చేయడమే అవుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. పిల్లలను విధిగా స్కూలుకు పంపడం తప్పనసరి చేయాలని మరికొందరు సూచించగా, ఆర్ఎస్ఎస్లో పనిచేసే బదులు భారత సైన్యంలో కొంతకాలం పనిచేస్తే దేశానికి సేవ చేసిన వారమవుతామని మరికొందరు వ్యాఖ్యానించారు. -
సంఘ్ శక్తులే ఉగ్రవాదులని ఒప్పుకున్నారు
- బీజేపీ మంత్రి అనిల్ విజ్ వ్యాఖ్యలకు దిగ్విజయ్ కౌంటర్ న్యూఢిల్లీ: ఉగ్రదాడులకు పాల్పడేది ముస్లింలేనని, హిందువుల్లో ఉగ్రవాదులు ఉండరన్న బీజేపీ(హరియాణ) మంత్రి అనిల్ విజ్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఘాటుగా సమాధానమిచ్చారు. సంఘ్‌పరివార్ ఉగ్రవాద సంస్థే అన్న నిజాన్ని అనిల్ తన వ్యాఖ్యల ద్వారా మరోసారి నిరూపించారని దిగ్విజయ్ అన్నారు. ‘పరివార్ ఉగ్రద సంస్థని ఆయన(అనిల్ విజ్) అధికారికంగా ప్రకటించుకున్నారు. మేం(కాంగ్రెస్) చెబుతున్నది కూడా అదే. హిందువులు ఉగ్రవాదులు కారు.. సంఘ్ శక్తులు మాత్రమే టెర్రరిస్టులు’ అని దిగ్విజయ్ వ్యాఖ్యానించారు. హరియాణ మంత్రి అనిల్ విజ్ బుధవారం ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఉగ్రదాడులకు పాల్పడుతున్నది ముస్లింలేనని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. (ముస్లింలే టెర్రరిస్టులు.. హిందూ ఉగ్రవాదం మిథ్య)