హరియాణా మంత్రి అనిల్ విజ్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని నిపా వైరస్‌తో పోల్చిన హరియాణా మంత్రి అనిల్ విజ్ బుధవారం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రతి పౌరుడు కొద్దిరోజులు ఆర్‌ఎస్‌ఎస్‌లో విధిగా పనిచేయాలని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమానికి పంపిన ఆహ్వానాన్ని అంగీకరించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆర్‌ఎస్‌ఎస్‌లో పనిచేయడాన్ని తప్పనిసరి చేయాలని మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రి వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో విధిగా పనిచేయాలన్న నిబంధన పౌరులను ఒత్తిడి చేయడమే అవుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. పిల్లలను విధిగా స్కూలుకు పంపడం తప్పనసరి చేయాలని మరికొందరు సూచించగా, ఆర్‌ఎస్‌ఎస్‌లో పనిచేసే బదులు భారత సైన్యంలో కొంతకాలం పనిచేస్తే దేశానికి సేవ చేసిన వారమవుతామని మరికొందరు వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment