లోకం కాని లోకం!
అక్కడ అడుగుపెడితే... భూగోళం మీద ఉన్నట్లు ఉండదు. ఒక కొత్త లోకంలోకి వెళ్లినట్లుంటుంది. కథల్లో కనిపించేవన్నీ... అక్కడ కళ్లెదుట ప్రత్యక్షమవుతాయి. కథలు చదువుతున్నప్పుడు మనోతెరపై ప్రత్యక్షమయ్యే ఊహాదృశ్యం నిజమై మన ముందు నిలుచున్నట్లుగా ఉంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ‘ఇండోర్ థీమ్ పార్క్’ ఇటీవల దుబాయ్లో ప్రారంభమైంది. దీని నిర్మాణానికి మూడు సంవత్సరాలకుపైగా పట్టింది. కోట్లాది రూపాయల ఖర్చుతో నిర్మాణమైన ఈ ‘ఐయంజీ వరల్డ్ ఆఫ్ అడ్వెంచర్’ థీమ్పార్క్ ఆబాలగోపాలాన్నీ కనువిందు చేస్తుంది.
ఇరవై ఎనిమిది ఫుట్బాల్ మైదానాలంత విశాలంగా ఉండే ఈ థీమ్పార్క్ను ఒకేసారి 30,000 మంది ప్రేక్షకులు సందర్శించవచ్చు. ‘హాంటెడ్ హోటల్’ ‘డైనోసర్ జోన్’లతో పాటు వందలాది కార్టూన్ క్యారెక్టర్లతో కళళలాడుతున్న ఈ థీమ్పార్క్ ఊహించినదాని కంటే మిన్నగా ఉందంటున్నారు సందర్శకులు. ఏది ఏమైనా... ఈ థీమ్పార్క్ దుబాయ్ టూరిస్ట్ ఎట్రాక్షన్లలో ఒకటిగా నిలిచింది.