hawala money link
-
ఢిల్లీ లిక్కర్ స్కాం: కదులుతున్న డొంక
సాక్షి, ఢిల్లీ: సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో అరెస్టయిన రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్ విచారణ కొనసాగుతోంది. అభిషేక్ Abhishek Boinpally ఇచ్చిన సమాచారంతో.. ఈ కేసులో ఏ9 నిందితుడు, ఢిల్లీ వ్యాపారి అమిత్ అరోరాను సీబీఐ ప్రశ్నిస్తోంది. వాహలా రూపంలో నగదు బదిలీ జరిగినట్లు దర్యాప్తులో గుర్తించింది సీబీఐ. ఈ క్రమంలో.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని సంకేతాలు అందుతున్నాయి. లిక్కర్ కుంభకోణంలో సీబీఐ ఇప్పటికే డాక్యుమెంటరీ ఆధారాలు సేకరించింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అనుచరుడిగా భావిస్తున్న అర్జున్ పాండేకు విజయ్ నాయర్ తరపున సమీర్ మహేంద్రు(సహ నిందితుడు) ముడుపులు అందించినట్టు సీబీఐ భావిస్తోంది. ఇందులో అభిషేక్ పాత్రను బ్యాంకు లావాదేవీలు, నిందితులతో జరిగిన సమావేశాల ద్వారా గుర్తించారు. కాగా అభిషేక్‌కు రాష్ట్రంలోని ప్రముఖ నేతలతో వాణిజ్యపరమైన లావాదేవీలున్నాయని సీబీఐ ప్రాథమిక విచారణలో గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. పెద్ద మొత్తంలో చేతులు మారిన ముడుపులు ఏ రాజకీయ ప్రముఖుడి నుంచి ఎవరికి వెళ్లాయనే అనే అంశంపై సీబీఐ దృష్టి పెట్టినట్లు తెలిసింది. అదే సమయంలో.. ఈ కుంభకోణంలో రాజకీయ ప్రముఖుల హస్తం ఉందనేది ఆరోపణలు వినవస్తున్నాయి. -
‘బార్, హోటళ్ల యాజమానులు జాగ్రత్తగా ఉండాలి’
సాక్షి, హైదరాబాద్ : హవాలా అక్రమ మనీ రవాణా దందాను కొనసాగిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. మొత్తం అయిదుగురు.. ఎమ్ ఈశ్వర్‌రెడ్డి, రాజేష్ శర్మ, రాంరాజ పరం, ప్రకాష్ సింగ్, విశాల్ సావాత్ను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ. కోటి 1 లక్ష యాభై వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు రాజ్ కుమార్ ట్రావెలింగ్ బ్యాగ్‌లో డబ్బులు తరలిస్తుండగా పట్టుకున్నామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. స్వీట్ హౌజ్ యాజమాని ఈశ్వర్‌రెడ్డి ద్వారా మిగతా నలుగురిని విచారణ చేశామని, దీనిపై విచారణ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు డ్రగ్స్ రవాణా చేస్తున్న ముఠాలోని ముగ్గురిని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు ముఠా సభ్యులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరి నుంచి 5 గ్రాముల హెరాయిన్, 28 ఎల్ ఎస్టీ స్లీప్స్, 32 లంఫేటమిన్ డ్రగ్ ప్యాకెట్లు, 3 కిలీల గంజా స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 2.5 లక్షలు ఉంటాయని తెలిపారు. గ్యాంగ్ లీడర్‌గా ప్రాన్సిస్ జేవియర్ తమిళనాడుకు చెందిన వ్యక్తిగా పోలీసులు పేర్కొన్నారు. 25 ఏళ్ల క్రితమే ఫ్రాన్సిస్ కుటుంబం హైదరాబాద్‌కు వచ్చిందని. ఫ్రాన్సిస్‌కు ఇంటర్ నుంచే డ్రగ్స్ అలవాటు ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు. అలాగే బార్, హోటళ్ల యాజమానులు జాగ్రత్తగా ఉండాలని, న్యూ ఇయర్ వేడుకల్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదని హెచ్చరించారు. -
హవాలా డబ్బు కోసమే అభయ్ కిడ్నాప్!
అభయ్ హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కేవలం హవాలా డబ్బు కోసమే అభయ్‌ని నిందితులు కిడ్నాప్ చేసినట్లు తాజాగా తెలిసింది. ఈ హత్యకు, హవాలా మనీ లింకు బయటపడింది. అభయ్ తండ్రి రాజ్‌కుమార్ కోట్లలో హవాలా వ్యాపారం చేస్తారని అంటున్నారు. దాంతో అతడి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బు ఒకేసారి సంపాదించొచ్చన్నది నిందితుల కుట్రగా తెలుస్తోంది. అభయ్‌ని కిడ్నాప్ చేయడానికి ఆరు నెలలుగా కుట్ర పన్నారు. అందుకోసం రాజ్‌కుమార్ ఇంట్లో పనిచేసే వంట మనిషి సాయిని ఎరగా వాడుకున్నారు. ఈ మొత్తం కుట్రను ఛేదించిన పోలీసులు.. ముగ్గురు నిందితులను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో అరెస్టు చేశారు. తర్వాత వాళ్లను తమదైన శైలిలో విచారించడంతో మొత్తం అన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. హవాలా డబ్బు లింకు కూడా ఈ విధంగానే బయటకు వచ్చినట్లు సమాచారం.