
హవాలా డబ్బు కోసమే అభయ్ కిడ్నాప్!
అభయ్ హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కేవలం హవాలా డబ్బు కోసమే అభయ్‌ని నిందితులు కిడ్నాప్ చేసినట్లు తాజాగా తెలిసింది. ఈ హత్యకు, హవాలా మనీ లింకు బయటపడింది. అభయ్ తండ్రి రాజ్‌కుమార్ కోట్లలో హవాలా వ్యాపారం చేస్తారని అంటున్నారు. దాంతో అతడి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బు ఒకేసారి సంపాదించొచ్చన్నది నిందితుల కుట్రగా తెలుస్తోంది.
అభయ్‌ని కిడ్నాప్ చేయడానికి ఆరు నెలలుగా కుట్ర పన్నారు. అందుకోసం రాజ్‌కుమార్ ఇంట్లో పనిచేసే వంట మనిషి సాయిని ఎరగా వాడుకున్నారు. ఈ మొత్తం కుట్రను ఛేదించిన పోలీసులు.. ముగ్గురు నిందితులను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో అరెస్టు చేశారు. తర్వాత వాళ్లను తమదైన శైలిలో విచారించడంతో మొత్తం అన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. హవాలా డబ్బు లింకు కూడా ఈ విధంగానే బయటకు వచ్చినట్లు సమాచారం.