Abhay kidnap
-
హవాలా డబ్బు కోసమే అభయ్ కిడ్నాప్!
అభయ్ హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కేవలం హవాలా డబ్బు కోసమే అభయ్‌ని నిందితులు కిడ్నాప్ చేసినట్లు తాజాగా తెలిసింది. ఈ హత్యకు, హవాలా మనీ లింకు బయటపడింది. అభయ్ తండ్రి రాజ్‌కుమార్ కోట్లలో హవాలా వ్యాపారం చేస్తారని అంటున్నారు. దాంతో అతడి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బు ఒకేసారి సంపాదించొచ్చన్నది నిందితుల కుట్రగా తెలుస్తోంది. అభయ్‌ని కిడ్నాప్ చేయడానికి ఆరు నెలలుగా కుట్ర పన్నారు. అందుకోసం రాజ్‌కుమార్ ఇంట్లో పనిచేసే వంట మనిషి సాయిని ఎరగా వాడుకున్నారు. ఈ మొత్తం కుట్రను ఛేదించిన పోలీసులు.. ముగ్గురు నిందితులను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో అరెస్టు చేశారు. తర్వాత వాళ్లను తమదైన శైలిలో విచారించడంతో మొత్తం అన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. హవాలా డబ్బు లింకు కూడా ఈ విధంగానే బయటకు వచ్చినట్లు సమాచారం. -
తెలిసినవాడే చంపేశాడు!
♦ వీడిన అభయ్ కిడ్నాప్,హత్య కేసు మిస్టరీ ♦ గతంలో పక్కింట్లో పనిచేస్తూ అభయ్‌తో స్నేహం చేసిన సాయి ♦ చనిపోయిన తర్వాత తండ్రితో బేరసారాలు.. ఆపై రెలైక్కి విజయవాడకు పరార్ ♦ ముగ్గురు నిందితులను పట్టుకున్న పోలీసులు! సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో పదో తరగతి విద్యార్థి అభయ్ కిడ్నాప్, హత్య కేసులో మిస్టరీ వీడింది! అభయ్‌ని చంపింది గతంలో వారింటి సమీపంలో పని చేసిన సాయిగా తేలింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇతడు.. అదే ప్రాంతానికి చెందిన మరో ముగ్గురు నలుగురితో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దుండగుల కోసం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, రాజమండ్రి, శ్రీకాకుళం ప్రాంతాల్లో టాస్క్‌ఫోర్స్ బృందాలు గాలించాయి. శుక్రవారం సాయంత్రం రాజమండ్రిలో సాయితో పాటు మరో ఇద్దరు నిందితులను పట్టుకున్నట్లు తెలిసింది. కాగా, అభయ్ వినియోగించిన ద్విచక్ర వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పని కోసం వచ్చి కన్నేసి.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీప ప్రాంతానికి చెందిన సాయి బతుకుతెరువు కోసం నగరానికి వలస వచ్చాడు. అభయ్ కుటుంబం నివసించే ఓంకాలనీలోనే ఓ ఇంట్లో పని చేస్తూ ఇటీవలే మానేశాడు. అక్కడ పని చేస్తుండగా సమీపంలో ఉండే పిల్లలతో పరిచయం పెంచుకున్నాడు. తరచుగా అభయ్ సహా మరికొందరిని కలవడం, వారితో కలిసి క్రికెట్ ఆట డం చేసేవాడు. అభయ్ తండ్రి రాజ్‌కుమార్ పెద్ద వ్యాపారవేత్తని భావించిన సాయి.. అతడి వ్యాపార రహస్యాలు తెలుసుకున్నాడు. ప్రస్తుతం ఏపీలో ఉంటున్న సాయి.. ఆర్థిక ఇబ్బందులు నేపథ్యంలో తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు ఈ కిడ్నాప్ స్కెచ్ వేశాడు. విజయవాడ, ఏలూరు పరిసర ప్రాంతాలకు చెందిన పరిచయస్తులు, స్నేహితులు నలుగురైదుగురితో ముఠా కట్టాడు. అభయ్‌ని కిడ్నాప్ చేసి డబ్బు గుంజాలని పథకం వేశాడు. పది రోజుల క్రితం నగరానికి వచ్చి ఓ ప్రాంతంలో షెల్టర్ ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ్నుంచే అభయ్ చదువుకునే ‘స్లేట్’ స్కూల్ వద్దకు వచ్చిపోతుండేవాడు. కిడ్నాప్ కుట్రకు ముందే మారుపేర్లతో నాలుగు సిమ్‌కార్డులు తీసుకున్నాడు. ఈ నంబర్‌తోనే కిడ్నాప్ తర్వాత రాజ్‌కుమార్‌కు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. మాటువేసి.. కాపుగాసి.. ఓంకాలనీలోని రాజ్‌కుమార్ ఇంటి ఎదురుగా ఖాళీ స్థలం ఉంటుంది. ఆ ప్రాంతానికి చెందిన పలువురు కార్లను అక్కడే పార్క్ చేసుకుంటారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలోనే అక్కడకు చేరుకున్న సాయి.. అభయ్ బయటకు వచ్చేం త వరకు ఎదురు చూశాడు. సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో అభయ్ తన ద్విచక్ర వాహ నం (స్కూటీ)పై జ్ఞాన్‌బాగ్‌కాలనీ సీతారాంపేట్‌లో ఉండే మహాలక్ష్మీ టిఫిన్ సెంటర్‌కు వెళ్లడం గమనించి అనుసరించాడు. అక్కడకు వెళ్లిన తర్వాత మాటలు కలిపిన సాయి... బాలుడిని ఎలాంటి అనుమానం రాకుండా తానే వాహనం నడుపుతూ దారుస్సలాం వరకు తీసుకువెళ్లాడు. అక్కడ అప్పటికే వాహనంలో సిద్ధంగా ఉన్న అనుచరులతో కలిసి అభయ్‌ను కిడ్నాప్ చేశాడు. సాయిని గుర్తించిన కవల సోదరుడు కిడ్నాప్ సమయంలో సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను పోలీసులు సేకరించారు. ఇందులో విద్యార్థిని వెనుక ఎక్కించుకుని వెళ్తున్న వ్యక్తిని అభయ్ కవల సోదరుడు అభిషేక్‌తోపాటు ఆ ప్రాంతానికి చెందిన ఇతరులు సాయిగా గుర్తించారు. అతడు ఓంకాలనీలో పని చేయడం, ఇటీవల తరచుగా స్కూలు వద్దకు రావడం, బుధవారం మధ్యాహ్నం అభయ్ ఇంటి ఎదురుగా తచ్చాడటం తదితర అంశాలను చెప్పడంతో కేసులో చిక్కుముడి వీడింది. ముక్కుకు టేపు వేయడంతో మృతి! అభయ్‌ను కిడ్నాప్ చేసి వాహనంలో తరలిస్తున్న కిడ్నాపర్లు.. బాలుడి నోటికి, చేతులకు సర్జికల్ టే పు చుట్టారు. ఈ టేపు ముక్కును కూడా కప్పేయడంతో అభయ్ మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. బాలుడు చనిపోయాడని తెలుసుకున్న కిడ్నాపర్లు.. మృతదేహాన్ని పార్శిల్ చేసి సికింద్రాబాద్‌లోని అల్ఫా హోటల్ వద్ద వదిలేసి అక్కడ్నుంచి రైల్లో విజయవాడ చేరుకున్నారని భావిస్తున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో సెల్‌ఫోన్‌ను పడేసి ఉడాయించారు. ఈ సెల్‌ఫోన్ స్థానికంగా కొందరికి దొరకడంతో అక్కడకు వెళ్లిన టాస్క్‌ఫోర్స్ బృందాలు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించాయి. గాలింపు తర్వాత ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అభయ్ చనిపోయిన తర్వాత కూడా దుండగులు రాజ్‌కుమార్‌తో బేరసారాలు చేశారు. ఇది పోలీసుల్ని తప్పుదోవ పట్టించడంతో పాటు, నగరం దాటి వెళ్లిపోవడానికే అయి ఉంటుందని అధికారులు అంటున్నారు. -
చంపేసి, ఆపై బేరసారాలు
► రాజధానిలో కిడ్నాపర్ల ఘాతుకం ► టెన్త్ విద్యార్థిని ఎత్తుకెళ్లి చంపేశారు ► మృతదేహాన్ని అట్టపెట్టెలో పెట్టి పడేశారు ► 10 కోట్లివ్వాలంటూ తండ్రిని బెదిరించారు ► పరిచయస్తుల పనేనని అనుమానం హైదరాబాద్: పదో తరగతి విద్యార్థిని గొంతు నులిమి చంపేశారు. అట్టపెట్టెలో కుక్కి పడేశారు. ఆ తర్వాత తీరిగ్గా తండ్రికి ఫోన్ చేసి, రూ.10 కోట్లివ్వాలంటూ పలుమార్లు బేరసారాలకు దిగారు! రాజధానిలో బుధవారం జరిగిన ఈ దారుణం కలకలం సృష్టించింది. హైదరాబాద్‌లోని షా ఇనాయత్‌గంజ్ ఓం కాలనీలో తమ్ముడి కుటుంబంతో పాటు కలిసి నివసిస్తున్న వ్యాపారవేత్త రాజ్‌కుమార్, అనురాధ దంపతులకు అభయ్ మోదానీ (16), అభిషేక్ మోదానీ కవల పిల్లలు. అబిడ్స్‌లోని స్లేట్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నారు. అభయ్ గురువారం సాయంత్రం 4:30 ప్రాంతంలో జ్ఞాన్‌బాగ్‌కాలనీ సీతారాంపేట్ మహాలక్ష్మి టిఫిన్ సెంటర్లో ఇడ్లీ, దోశ తెచ్చేందుకు ఇంటి నుంచి బయల్దేరాడు. గంట దాటినా ఇంటికి రాకపోవడంతో తల్లి ఫోన్ చేసింది. 5 నిమిషాల్లో వస్తానని బదులిచ్చాడు. అరగంట దాటినా రాకపోవడంతో మరోసారి ఫోన్ చేయగా స్విచాఫ్ అయింది. ఆమె కంగారుపడి వెంటనే భర్తకు చెప్పింది. పరిసరాల్లో గాలించినా లాభం లేకపోవడంతో రాత్రి షా ఇనాయత్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు నాలుగు బృందాలతో పలుచోట్ల గాలించినా లాభం లేకపోయింది. రాత్రి పదింటికి ‘7842276480’ నంబర్ నుంచి రాజ్‌కుమార్ మరదలు కవితకు కిడ్నాపర్లమంటూ ఫోన్ వచ్చింది. రూ.10 కోట్లిస్తే కొడుకును వదిలేస్తామన్న కిడ్నాపర్, మరోసారి ఫోన్ చేసి 5 కోట్ల వరకు రాజ్‌కుమార్‌తో బేరసారాలాడాడు. అంత డబ్బులేదని రూ.7 లక్షలు, బంగారం ఇవ్వగలనని ఆయన వేడుకున్నాడు. రాత్రి 10.25కు విషయాన్ని పోలీసులకు తెలిపాడు. దాంతో వారు వేట ముమ్మరం చేశారు. కిడ్నాపర్ సికింద్రాబాద్ నుంచి మాట్లాడినట్టు ఫోన్ లోకేషన్ ఆధారంగా గుర్తించారు. నాలుగు బృందాలు అక్కడ దుండగుల కోసం గాలించాయి. అట్టపెట్టెలో శవమైన బాలుడు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎదురుగా అల్ఫా హోటల్ సమీపంలోని పెట్రోల్ బంకులో రాత్రి 10.30 సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ అట్టపెట్టె వదిలి వెళ్లడాన్ని సిబ్బంది గమనించారు. గంట తర్వాత కూడా అదక్కడే ఉండటంతో పోలీసులకు సమాచారమిచ్చారు. రాత్రి 11.30కు మారేడ్‌పల్లి పోలీసులు బాంబ్ స్క్వాడ్‌తో పరీక్షించి పెట్టె తెరిచి చూడగా బాలుడి మృతదేహం బయటపడింది. నోటికి, వెనక్కు విరిచిన చేతులకు దుండగులు ప్లాస్టర్ వేసి ప్లాస్టిక్ తాడుతో కట్టేశారు. అది అభయ్దని ఫొటోల ఆధారంగా గుర్తించారు. అతని జేబులోని రూ.750, చేతికున్న ఖరీదైన వాచీ అలానే ఉన్నాయి. మృతదేహాన్ని అల్ఫా వద్ద వదిలేశాక కూడా రాత్రి 11:14కు దుండగులు రాజ్‌కుమార్‌కు మళ్లీ ఫోన్ చేసి బేరసారాలకు దిగారు! ఆ సమయంలో వాళ్లు నల్లగొండ జిల్లాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తెలిసినవారి పనే! ఈ హత్య రాజ్‌కుమార్ కుటుంబానికి తెలిసిన వారి పనేనని, కక్షతోనో మరో కారణంతోనో ఘాతుకానికి ఒటిగట్టి ఉంటారని భావిస్తున్నారు. ఎందుకంటే బుధవారం సాయంత్రం ఇంటి నుంచి బయటికెళ్లిన అభయ్, కిడ్నాపర్‌గా భావిస్తున్న వ్యక్తితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండటం స్థానిక సీసీ కెమెరాల్లో నమోదైంది. ఆ వాహనాన్ని కిడ్నాపర్లు దారుస్సలాం వద్ద వదిలేసి అభయ్‌ను కారులో తీసుకెళ్లినట్టు పోలీసులు భావిస్తున్నారు. కిడ్నాపర్లను అభయ్ గుర్తుపట్టిన కారణంగానే చంపేశారనుకుంటున్నారు. గురువారం గాంధీ మార్చురీలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. వారి రోదనల మధ్య అఫ్జల్‌గంజ్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. ఆచూకీ చెబితే రూ.లక్ష దుండగుల ఆచూకీ చెప్పిన వారికి రూ.లక్ష రివార్డు ఇస్తామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి గురువారం రాత్రి ప్రకటించారు. అభయ్‌ను ద్విచక్ర వాహనం వెనుక ఎక్కించుకుని తీసుకువెళ్తూ సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ ఫొటోలను ఆయన విడుదల చేశారు. సమాచారం తెలిసిన వారు పశ్చిమ మండల డీసీపీ ఏ.వెంకటేశ్వరరావు (9490616552) లేదా నగర పోలీసు వాట్సాప్ (9490616555)లకు తెలపాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కొత్వాల్ స్పష్టం చేశారు. -
ముక్కులో పేపర్లు కుక్కి...
హైదరాబాద్ : పాతబస్తీలో సంచలనం రేపిన 15 ఏళ్ల అభయ్ కిడ్నాప్ మిస్టరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను విజయవాడలో అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశౄరు. అరెస్ట్ చేసినవారిని విజయవాడ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ అభయ్‌ను హతమార్చింది బంధువులా, పని మనుషులా, ఇతర వ్యక్తులా అనేది తెలియాల్సి ఉందన్నారు. కిడ్నాపర్లు హత్య చేసిన తర్వాతే అభయ్ తండ్రికి ఫోన్ చేసి ఉంటారని అన్నారు. షాహీనాయత్ గంజ్‌లోని శ్రీకాలనీకి చెందిన అభయ్.. బుధవారం మధ్యాహ్నం అల్పాహారం తెచ్చుకునేందుకు బయటకొచ్చాడు. అప్పటికే పక్కా ప్లాన్‌తో ఉన్న దుండగులు అభయ్‌ను కిడ్నాప్ చేశారు. అభయ్ ఇంటికి రాకపోవడంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు సాయంత్రం 5గంటల సమయంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు... అభయ్ కోసం వెతకడం మొదలుపెట్టారు. బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కిడ్నాపర్ల నుంచి అభయ్ తండ్రికి ఫోన్ వచ్చింది. త్రరూ. 10 కోట్లు ఇవ్వాలంటూ అభయ్ తండ్రి రాజ్ కుమార్ కు దుండగులు ఫోన్ చేశారు. తండ్రి అందుకు నిరాకరించడంతో అభయ్ ముక్కులో పేపర్లు కుక్కి శ్వాస ఆడకుండా చేసి హత్య చేసినట్టు సమాచారం. మరోవైపు అభయ్ తల్లిదండ్రులతో నిందితుల ఫోన్ సంభాషణ ఆడియో టేపులు విడుదలయ్యాయి. కిడ్నాపర్లు అభయ్ తండ్రికి ఫోన్ చేసి 10 కోట్లు డిమాండ్ చేశారు. అయితే రాత్రికి రాత్రే ఐదు కోట్లు ఇవ్వాలని పట్టుబట్టారు. లేకుంటే అభయ్ ప్రాణాలతో దక్కడని బెదిరించాడు. కనీసం 5 కోట్లు అయినా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికిప్పుడు అంత డబ్బు తన దగ్గర లేదని, 20 లక్షల వరకైతే ఇవ్వగలనని అభయ్ తండ్రి ప్రాధేయపడ్డాడు. అయినా కిడ్నాపర్లు కనికరించలేదు.. డబ్బు తీసుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు రావాలని చెప్పి కిడ్నాపర్ ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ కిడ్నాపర్లు అభయ్‌ను హతమార్చి, మృతదేహాన్ని అట్టపెట్టెలో పెట్టి సికింద్రాబాద్ ఆల్ఫా కేఫ్ వద్ద వదిలి పరారయ్యారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు....కాటన్ బాక్స్‌ను ఓపెన్ చేసి చూడడంతో మృతదేహం బయటపడింది. కాగా అభయ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. -
విషాదంగా మారిన అభయ్ కిడ్నాప్
హైదరాబాద్: పాతబస్తీలో బుధవారం కిడ్నాప్ అయిన బాలుడి కథ విషాదంగా ముగిసింది. పాతబస్తీలో నిన్న కిడ్నాపయిన బాలుడు దారుణహత్యకు గురయ్యాడు. 15 ఏళ్ల అభయ్ ని కిడ్నాపర్లు హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివారల ప్రకారం... బుధువారం మధ్యాహ్నం షాహినాయత్ గంజ్ కు చెందిన అభయ్ కిడ్నాప్ అయ్యాడు. సాయంత్రం 5 గంటలకు ఆ బాలుడి తల్లిదండ్రులు షాహినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాత్రి 11 గంటలు దాటిన తర్వాత రూ. 10 కోట్లు ఇవ్వాలంటూ అభయ్ తండ్రి రాజ్ కుమార్ కు దుండగులు ఫోన్ చేశారు. తండ్రి అందుకు నిరాకరించడంతో బాలుడిని చంపి మృతదేహాన్ని కాటన్ బాక్స్ లో పెట్టి సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ సమీపంలో దుండగులు వదిలివెళ్లారు. విచారణ వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు.