విషాదంగా మారిన అభయ్ కిడ్నాప్ | Abhay kidnap and murdered in hyderabad | Sakshi
Sakshi News home page

విషాదంగా మారిన అభయ్ కిడ్నాప్

Published Thu, Mar 17 2016 6:45 AM | Last Updated on Fri, Jul 12 2019 3:29 PM

విషాదంగా మారిన అభయ్ కిడ్నాప్ - Sakshi

విషాదంగా మారిన అభయ్ కిడ్నాప్

హైదరాబాద్: పాతబస్తీలో బుధవారం కిడ్నాప్ అయిన బాలుడి కథ విషాదంగా ముగిసింది. పాతబస్తీలో నిన్న కిడ్నాపయిన బాలుడు దారుణహత్యకు గురయ్యాడు. 15 ఏళ్ల అభయ్ ని కిడ్నాపర్లు హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివారల ప్రకారం... బుధువారం మధ్యాహ్నం షాహినాయత్ గంజ్ కు చెందిన అభయ్ కిడ్నాప్ అయ్యాడు.

సాయంత్రం 5 గంటలకు ఆ బాలుడి తల్లిదండ్రులు షాహినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాత్రి 11 గంటలు దాటిన తర్వాత రూ. 10 కోట్లు ఇవ్వాలంటూ అభయ్ తండ్రి రాజ్ కుమార్ కు దుండగులు ఫోన్ చేశారు. తండ్రి అందుకు నిరాకరించడంతో బాలుడిని చంపి మృతదేహాన్ని కాటన్ బాక్స్ లో పెట్టి సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ సమీపంలో దుండగులు వదిలివెళ్లారు. విచారణ వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement